చంద్రబాబు నాయుడు (పాత ఫొటో)
సాక్షి, అమరావతి: సమాజంలో శాంతిభద్రతల కోసం శ్రమిస్తున్న పోలీసులపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు సరికాదని ఏపీ పోలీసు అధికారుల సంఘం ఖండించింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎండీ మస్తాన్‌ఖాన్, కోశాధికారి సోమశేఖర్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీసులు పోస్టింగ్‌ల కోసం కక్కుర్తిపడి అధికారపార్టీ నాయకులు ఏం చెబితే అది చేస్తున్నారంటూ చంద్రబాబుచేసిన వ్యాఖ్యలపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
పోలీసులు శాంతిభద్రతల కోసం శ్రమిస్తారే తప్ప.. పోస్టింగ్‌ల కోసం కక్కుర్తిపడాల్సిన అవసరం లేదని తెలిపారు. నిజాయితీగా పనిచేసే పోలీసుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం.. చంద్రబాబుకు తగదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టింగులనేవి సాధారణమని.. నిజాయితీ, పనితీరు, నైపుణ్యాలను బట్టి అవి లభిస్తాయని అన్నారు. చట్ట ప్రకారం పోలీసులు విధుల్ని నిర్వర్తిస్తారే తప్ప.. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు అండగా ఉండరన్న విషయాన్ని చంద్రబాబుకు తెలియజేస్తున్నామని సంఘం నేతలు పేర్కొన్నారు. (చదవండి: ఫర్నీచర్‌పై చంద్రబాబు పచ్చి అబద్ధాలు)
Comments
Please login to add a commentAdd a comment