‘ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందే ’ | FIR Must Be Registered On Encounter Killing By Police Supreme Court Order | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందే : సుప్రీంకోర్టు

Published Thu, Jul 18 2019 8:58 PM | Last Updated on Thu, Jul 18 2019 10:17 PM

FIR Must Be Registered On Encounter Killing By Police Supreme Court Order - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పోలీసులు చేసే ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందేనని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు తర్వాతే కోర్టు దృష్టికి తీసుకురావాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై సెక్షన్‌ 302 నమోదు చేయాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు ఏపీ పోలీస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ సుప్రీంలో సవాల్‌ చేశాయి. తాజాగా ఈ అంశంపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ తీర్పు వెలువరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement