సాక్షి, విజయవాడ: కరోనా నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని.. తమ ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మరోసారి ఆలోచించాలని ఏపీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జనుకుల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. పోలీసు శాఖలో కరోనాతో 109 మంది ప్రాణాలు కోల్పోయారని.. పోలీసు శాఖలో 14 వేల మంది కరోనా బారిన పడ్డారన్నారు. ఎన్నికల్లో పోలీసులు ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల ద్వారా వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని.. పోలీసు శాఖలో ముందుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగాలన్నారు. వ్యాక్సినేషన్.. బందోబస్తు ఒకేసారి చేయాలంటే ఇబ్బందికరమని తెలిపారు. చదవండి: ఓ రాజకీయ నేతలా నిమ్మగడ్డ..
‘‘ఎస్‌ఈసీకి చేతులెత్తి వేడుకుంటున్నాం. ఎన్నికలు అవసరమే కానీ.. కొంతకాలం వాయిదా వేస్తే బాగుంటుంది. కరోనా నేపథ్యంలో నిరంతరం ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాం. మనం ప్రాణాలతో ఉంటేనే కదా.. ఏదైనా చేయగలుగుతాం. తమ ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని ఎస్‌ఈసీ మరోసారి ఆలోచించాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలు నిర్వహించాలని పోలీసులు ఎస్‌ఈసీని కోరారు. చదవండి: ఎందుకంత నియంతృత్వ పోకడ: స్పీకర్ తమ్మినేని
Comments
Please login to add a commentAdd a comment