( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ బిల్లులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన ఆమె.. మరో రెండు బిల్లులను ప్రభుత్వానికి తిప్పి పంపారు. మరో మూడు బిల్లులకు మాత్రం ఆమోద ముద్ర వేశారు. ఇంకా రెండు బిల్లులను పెండింగ్‌లోనే ఉంచారు.
కాగా.. పెండింగ్ బిల్లుల విషయంపై తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య కొద్ది రోజులుగా విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ పంచాయితీని తేల్చుకునేందుకు తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ పిటిషన్‌పై నేడే(సోమవారం) విచారణ జరగనుంది. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిలను పేర్కొన్నారు.
బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేయడం ప్రజాస్వామ స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షకు విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. విషయ తీవ్రత, ప్రాధాన్యత దృష్ట్యా విధి లేకే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలిపింది. గవర్నర్ వద్ద 10 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని నివేదించింది. ఇప్పటికే పెండింగ్ బిల్లుల ఆమోదంపై గవర్నర్ కార్యదర్శితో అడిషనల్ సోలిసిటరి జనరల్ చర్చించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ బిల్లును ఆమోదించడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది.
అయితే సుప్రీంకోర్టులో ఈ విషయంపై విచారణ జరగడానికి కొన్ని గంటలముందే రాష్ట్రపతి వీటిపై నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మొత్తం పది బిల్లులకూ గాను మూడింటికి మాత్రమే ఆమె ఆమోద ముద్ర వేయడం మరోసారి చర్చనీయాంశమైంది.
చదవండి: 24 గంటలు దుకాణాలు తెరిచి ఉంచడంపై కీలక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment