
సాక్షి, హైదరాబాద్: బస్టాండ్ల ఆధునీకరణలో భాగంగా ఇటీవల లక్నో బస్‌స్టేషన్‌ను సందర్శించిన ఆర్టీసీ అధికారుల బృందం శనివారం ఆర్టీసీ వీసీఎండీ సునీల్‌శర్మకు నివేదిక అందజేసింది. ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో లక్నో ఆలంబాగ్ బస్‌స్టేషన్‌ను శాలిమార్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ నిర్మించిందని, బస్టాండు రూపురేఖలతోపాటు పార్కింగ్ స్థలం, బస్ బేలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, సినిమా థియేటర్లు, విశ్రాంతి గదులు, సంస్థాగత కార్యాలయాలు, ప్రయాణికులకు అందిస్తున్న పలు రకాల సేవలను నివేదికలో వెల్లడించారు. రూ. 230 కోట్లు వెచ్చించి అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ బస్టాండును 33 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చారని, బస్‌స్టేషన్ నిర్వహణ మొత్తాన్ని శాలిమార్ కంపెనీ భరిస్తోందని ప్రస్తావించారు. ఎయిర్‌పోర్ట్ తరహా సెక్యూరిటీ విధానాన్ని అమలుపరుస్తోందని పేర్కొన్నారు. నివేదిక సమర్పించిన వారిలో ఈడీ పురుషోత్తం, సీటీఎం రాజేంద్రప్రసాద్, ఈఈ సీతారాంబాబు తదితరులు ఉన్నారు.
ఖాళీ స్థలాల సద్వినియోగం: సునీల్ శర్మ
మహాత్మాగాంధీ బస్‌స్టేషన్లలో ఖాళీ స్థలాలను సద్వినియోగపరుచుకోవడం ద్వారా కమర్షియల్ రాబడిని పెంచుకోవడానికి గల అవకాశాలపై చర్యలు తీసుకోనున్నట్లు సునీల్‌శర్మ తెలిపారు. టీఎస్‌ఆర్టీసీకి సంబంధించిన ఖాళీస్థలాలను ఏ రకంగా ఉపయోగించుకుంటే ఆదాయం సమకూరుతుందనే విషయంపై త్వరలో స్పష్టత రానుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో బస్టాండ్ల నిర్మాణా నికి శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment