bus stops
-
హైదరాబాద్‌లో ప్రకటనలకేనా షెల్టర్లు? ప్రయాణికులు తలదాచుకోవడానికి కాదా!
సాక్షి, సిటీబ్యూరో: ఒకవైపు వరుస వర్షాలు.. మరోవైపు బస్సుల కోసం నిరీక్షిస్తూ తలదాచుకుందామంటే ఉన్న బస్షెల్టర్లు ప్రయాణికులకు రక్షణనివ్వడం లేదు. ఎండాకాలంలో మండుటెండల్లో నీడనివ్వగలిగేవి వీటిలో కొన్ని మాత్రమే. ఇక ఏసీ బస్షెల్టర్లన్నది ప్రచారార్భాటంగా మిగిలింది. అటు ఆర్టీసీ.. ఇటు జీహెచ్ఎంసీ బస్ షెల్టర్లను ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నాయి? ఎవరి కోసం ఏర్పాటు చేస్తున్నాయి? అంటే.. కేవలం వాటిని ఏర్పాటు చేసే ఏజెన్సీలకు ప్రకటనల ద్వారా ఆదాయం సమకూర్చేందుకేనని చెప్పక తప్పదు. అలంకారప్రాయంగా.. ►జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 1200 బస్ షెల్టర్లున్నాయి. వివిధ ఏజెన్సీలు వాటిని ఏర్పాటు చేశాయి. ఒప్పందం మేరకైతే ప్రజలకు సదుపాయంగా ఉండాలి. కానీ.. అవి అలా ఉన్నాయా.. లేదా అన్నది అందుకు స్థలాలు కేటాయించిన జీహెచ్ఎంసీ గాని.. ప్రజలకు సదుపాయంగా ఉంచాల్సిన ఆర్టీసీ గాని పట్టించుకోలేదు. దీంతో బస్షెల్టర్లు ప్రజావసరాలకు కాకుండా అలంకారప్రాయంగా మారాయి. బస్సుల కోసం ప్రజలెక్కువగా ఎదురు చూసే ప్రాంతాల్లో బస్ షెల్టర్లుండవు. ►ఈ నేపథ్యంలో నగరవ్యాప్తంగా ఉన్న బస్సు షెల్టర్లు.. వాటి స్థితిగతులు.. ప్రజలకుపయోపడుతున్న తీరు వంటివి తనిఖీలు చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగాలు ఆపనిచేయలేదు. పైపెచ్చు కొత్తగా మరో 78 బస్షెల్టర్లు మూడునెలల్లో ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే పలు బస్షెల్టర్లను ప్రకటనల ఆదాయ వనరుగా మార్చుకున్న ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాయి. ►పేరుకు మాత్రం సకల సదుపాయాలతో ఏర్పాటు చేయాల్సిందిగా నిబంధనల్లో పొందుపరుస్తున్నప్పటికీ, ఆ తర్వాత పట్టించుకోవడం లేరు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) కింద బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (బీఓటీ) పద్ధతిలో ఏర్పాటుకు అనుమతించారు. అందంగా, ప్రయాణికుల.. పర్యావరణహితంగా వీటిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నప్పటికీ, ఏమేరకు వాస్తవ రూపం దాలుస్తాయో వేచి చూడాల్సిందే. ఈ ప్రాంతాల్లో ఏర్పాటు.. బస్షెల్టర్లు ఏర్పాటు కానున్న ప్రాంతాల్లో రాజేంద్రనగర్ ఆర్చి (ఏజీ యూనివర్సిటీ), çపురానాపూల్ గాంధీ విగ్రహం, చౌమహల్లా ప్యాలెస్ ఎదుట, జియాగూడ, వివేకానందనగర్, ఉప్పల్ క్రాస్‌రోడ్స్, హయత్‌నగర్(కెప్టెన్కుక్ ఎదుట), బైరామల్‌గూడ, పనామా క్రాస్‌రోడ్స్, విక్టోరియా మెమోరియల్–సరూర్‌నగర్, కామినేని హాస్పిటల్, హెచ్‌బీకాలనీ, కొత్తపేట ప్రభుత్వ పాఠశాల, నాగోల్ క్రాస్‌రోడ్స్, నాగార్జునసాగర్ రింగ్‌రోడ్(ఒవైసీ ఆస్పతి వైపు), నందనవనం భూపేశ్‌నగర్ , తాళ్లూరి థియేటర్ కమాన్, ఓయూ క్యాంపస్, పద్మారావునగర్ ఎస్పీ కాలేజ్, సెయింట్ ఆన్స్ స్కూల్, చిలకలగూడ (ఉప్పల్వైపు) తదితరమైనవి ఉన్నాయి. నిబంధనల మేరకు.. ►జీపీఎస్ ద్వారా ఆర్టీసీ బస్సులు బస్‌షెల్టర్లకు చేరుకోనున్న రియల్‌టైమ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ►బస్సుల నంబర్లు, రూట్‌మ్యాప్ వంటి వివరాలు సైతం ఉంచాలి. ►రాత్రి వేళల్లో విద్యుత్ ఉండాలి. షెల్టర్లలోని బెంచీలు బలంగా, ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా ఉండాలి. ►మొబైల్ చార్జింగ్ పాయింట్, డస్ట్‌బిన్ వంటివి ఉండాలి. ►వీటి అంచనా వ్యయం దాదాపు రూ.1.09 కోట్లు. -
నగరం బస్టాప్‌లలో... నిలువ నీడ కరువు
-
బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి
దసరా రద్దీ కొనసాగుతూనే ఉంది. ఆర్టీసీ బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటున్నాయి. తెలంగాణలో దసరా సెలవులు పొడిగించడం.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు పండుగ సెలవుల మూడ్ నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి గమ్యస్థానాలకు బయలుదేరుతుండటంతో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. ఆర్టీసీ, రైల్వే శాఖలు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాయి. రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ అధిక టికెట్ ధరలతో ప్రయాణికుల జేబులకు చిల్లులుపెడుతున్నాయి. సాక్షి, విజయవాడ : స్వస్థలాలు, ఉద్యోగ ప్రాంతాలు, చదువుకునే ప్రదేశాలకు వెళ్లేవారు.. వచ్చేవారితో బస్స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. గత మంగళవారం విజయదశమి వేడుకలు ముగిసినప్పటికీ ఇప్పటికీ ప్రయాణికుల రద్దీ కొనసాగుతూనే ఉంది. బుధవారం సుమారు 250 ప్రత్యేక బస్సులతో సేవలందించిన ఆర్టీసీ శనివారం 80 బస్సులు నడిపింది. ఆదివారం 100కుపైగా ప్రత్యేక బస్సులు నడిపే అవకాశం ఉంది. బస్సులు, రైళ్లు ఫుల్.. ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేసినా అన్నీ నిండిపోతున్నాయి. రాత్రి అయ్యే సరికి రైల్వే స్టేషన్, బస్‌స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అర్ధరాత్రి దాటేవరకు రద్దీ తగ్గడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల రద్దీతో వారం రోజులుగా రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌లో వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేక బాదుడు ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని ప్రత్యేక బస్సులను ఏ రోజుకు ఆ రోజు పెంచుతున్నారు. అయితే ప్రయాణికుల సౌకర్యం కోసం మాత్రమే ప్రత్యేక బస్సులు వేస్తున్నారుకుంటే పొరపాటు పడినట్టే. ఈ బస్సులు, రైళ్లలో 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సిటీ బస్సులనే దూర ప్రాంతాలకు నడిపేస్తున్నారు. ఈ సిటీ బస్సుల్లో దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రయాణికులకు నరకం కనిపిస్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, అన్నవరం, బెంగళూరు, చెన్నై, కడప, కర్నూలుకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఇక రైల్వే ఐఆర్సీటీసీ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నా.. అవి సకాలంలో రావడం లేదు. ప్రైవేట్ ట్రావెల్స్‌లో రెట్టింపు ధరలు బస్‌స్టేషన్ (విజయవాడ): రద్దీని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికులను దోపిడీ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, రైళ్లు కిటకిటలాడుతుండటంతో ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో వారు రెట్టింపు ధరలతో ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. డిమాండ్ పెరగడంతో రేట్లు అమాంతంగా పెంచేశారు. ఏసీ బస్సుల్లో ప్రయాణం చేయాలంటే దూరాన్ని, రద్దీని బట్టి ఒక్కో టికెట్టుపై వెయ్యి, రూ.2 వేలు అదనంగా వసూలు చేస్తున్నారు. -
బస్టాండ్ల ఆధునీకరణపై నివేదిక
సాక్షి, హైదరాబాద్: బస్టాండ్ల ఆధునీకరణలో భాగంగా ఇటీవల లక్నో బస్‌స్టేషన్‌ను సందర్శించిన ఆర్టీసీ అధికారుల బృందం శనివారం ఆర్టీసీ వీసీఎండీ సునీల్‌శర్మకు నివేదిక అందజేసింది. ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో లక్నో ఆలంబాగ్ బస్‌స్టేషన్‌ను శాలిమార్ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మించిందని, బస్టాండు రూపురేఖలతోపాటు పార్కింగ్ స్థలం, బస్ బేలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, సినిమా థియేటర్లు, విశ్రాంతి గదులు, సంస్థాగత కార్యాలయాలు, ప్రయాణికులకు అందిస్తున్న పలు రకాల సేవలను నివేదికలో వెల్లడించారు. రూ. 230 కోట్లు వెచ్చించి అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ బస్టాండును 33 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చారని, బస్‌స్టేషన్ నిర్వహణ మొత్తాన్ని శాలిమార్ కంపెనీ భరిస్తోందని ప్రస్తావించారు. ఎయిర్పోర్ట్ తరహా సెక్యూరిటీ విధానాన్ని అమలుపరుస్తోందని పేర్కొన్నారు. నివేదిక సమర్పించిన వారిలో ఈడీ పురుషోత్తం, సీటీఎం రాజేంద్రప్రసాద్, ఈఈ సీతారాంబాబు తదితరులు ఉన్నారు. ఖాళీ స్థలాల సద్వినియోగం: సునీల్ శర్మ మహాత్మాగాంధీ బస్స్టేషన్లలో ఖాళీ స్థలాలను సద్వినియోగపరుచుకోవడం ద్వారా కమర్షియల్ రాబడిని పెంచుకోవడానికి గల అవకాశాలపై చర్యలు తీసుకోనున్నట్లు సునీల్‌శర్మ తెలిపారు. టీఎస్ఆర్టీసీకి సంబంధించిన ఖాళీస్థలాలను ఏ రకంగా ఉపయోగించుకుంటే ఆదాయం సమకూరుతుందనే విషయంపై త్వరలో స్పష్టత రానుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో బస్టాండ్ల నిర్మాణా నికి శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. -
హైదరాబాద్‌లో హైటెక్ బస్‌స్టాపులు
సాక్షి, హైదరాబాద్ : ఎయిర్కండీషనింగ్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ఏటీఎం, కాఫీ మిషన్లు, వైఫై, సీసీ టీవీ, టాయిలెట్లు ఇవన్నీ ఇప్పటిదాక మనం ఎయిర్‌పోర్టులో లేదా మెట్రో స్టేషన్లలోనే చూసేవాళ్లం. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ బస్‌స్టాపుల్లో కూడా ఈ సౌకర్యాలన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. విశ్వనగరంగా రూపొందుతున్న గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యాధునిక హంగులతో బస్‌స్టాపులను(బస్షెల్టర్లను) ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు ప్రయాణికులకు అత్యంత మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఏసీ, వైఫై, ఏటీఎం, సీసీ టీవీ, మొబైల్ చార్జింగ్, టాయిలెట్లు ఉండేలా ఆధునిక బస్షెల్టర్లను ఏర్పాటు చేస్తోంది. పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసిన ఏసీ బస్‌షెల్టర్‌ను శిల్పారామం వద్ద రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ ఆఫీసు దగ్గర, కూకట్‌పల్లికి దగ్గరిలో కేపీహెచ్‌బీ వద్ద మరో రెండు ఆధునిక లేదా గ్రేడ్ 1 బస్షెల్టర్లు తుది దశలో ఉన్నాయి. వీటిని కూడా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 826 ఆధునిక బస్షెల్టర్లను నాలుగు ప్యాకేజీలలో జీహెచ్ఎంసీ నిర్మిస్తోంది. వీటిలో మొదటి గ్రేడ్‌లో అడ్వాన్స్డ్ ఏసీ బస్షెల్టర్లను నిర్మిస్తున్నారు. కేవలం పాశ్చాత్య దేశాల్లోని ప్రముఖ నగరాల్లో మాత్రమే ఈ విధమైన బస్షెల్టర్లు అందుబాటులో ఉన్నాయి. గ్రేడ్-2 బస్షెల్టర్లలో డస్ట్బిన్లు, టాయిలెట్లు, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, తాగునీటి సౌకర్యం, వైఫై, ఫ్యాన్లు, టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. గ్రేడ్-3 బస్‌షెల్టర్‌లో డస్ట్‌బిన్, మొబైల్ చార్జింగ్ పాయింట్, టాయిలెట్స్, తాగునీటి సౌకర్యం ఉండనుంది. గ్రేడ్-4లో కేవలం బస్షెల్టర్తో పాటు డస్ట్బిన్లే ఉంటాయి. మొత్తం నాలుగు ప్యాకేజీలుగా 826 బస్షెల్టర్లను విభజించి టెండర్ ద్వారా వివిధ ఏజెన్సీలకు అప్పగించారు. అత్యాధునిక బస్షెల్టర్లతో ఏర్పాటు చేయడం వల్ల హైదరాబాద్ నగరం ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో మాదిరిగా నగరవాసులకు మెరుగైన సౌకర్యం ఏర్పడుతుందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. -
కేశినేని ట్రావెల్స్ మూసివేత
-
ఆధునిక బస్షెల్టర్లు రాబోతున్నాయి
సాక్షి, సిటీబ్యూరో: ప్రయాణికులకు కనీస సదుపాయాలతో కూడిన ఆధునిక బస్షెల్టర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. నగర ప్రజలకు మెరుగైన, నాణ్యమైన రవాణా సదుపాయాలు అందజేయడంలో భాగంగా ప్రభుత్వం అన్ని వసతులు కలిగిన బస్షెల్టర్లను నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. సురక్షితమైన తాగునీరు, టాయిలెట్లు, రాత్రి పూట చక్కటి లైటింగ్ సదుపాయం కలిగి ఉండి, బస్సుల రాకపోకలపై ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేసే ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులను ఈ బస్షెల్టర్లలో ఏర్పాటు చేస్తారు. షెల్టర్ల ఏర్పాటులో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా శీఘ్రగతిన పూర్తి చేసేందుకు పర్యవేక్షణ బాధ్యతలను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ)కి అప్పగించారు. నగరంలో బస్షెల్టర్ల దుస్థితిపై ఇటీవల జీహెచ్ఎంసీ, ఆర్టీసీ సంయుక్త సర్వే నిర్వహించాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2300 బస్టాపులు ఉండగా, 1500 బస్టాపుల్లో మాత్రమే షెల్టర్లు ఉన్నాయి. 800 చోట్ల ప్రయాణికులు వర్షంలో తడుస్తూ, ఎండలో చెమటలు గక్కుతూ బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ప్రస్తుతం బస్షెల్టర్లు ఉన్న వాటిలోనూ సగం వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని చోట్ల బస్షెల్టర్లు కబ్జాకు గురయ్యాయి. మరోవైపు మెట్రో రైలు నిర్మాణ పనుల దష్ట్యా చాలా చోట్ల షెల్టర్లను తొలగించారు. మొత్తంగా ఇప్పటికిప్పుడు 800 బస్టాపుల్లో షెల్టర్లు నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. స్థలాలు అందుబాటులో ఉన్న చోట షెల్టర్లతో పాటు, బస్‌బేలు కూడా ఏర్పాటు చేస్తారు. ఆ తరువాత రెండో దశలో శిథిలావస్థలో ఉన్న షెల్టర్లను పునరుద్ధరిస్తారు. ఎల్ఈడీ బోర్డులు, వైఫై సదుపాయం... బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ వంటి ప్రాంతాలు, ప్రయాణికుల అవసరాలు, స్థలం లభ్యతకు అనుగుణంగా బస్షెల్టర్లలో సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. ► తక్కువ స్థలం అందుబాటులో ఉన్న చోట ఒక పోల్ ఏర్పాటు చేసి బస్సుల రాకపోకలపై సైనేజీ బోర్డు ప్రదర్శిస్తారు. స్థలం ఎక్కువ ఉన్న చోట, ప్రయాణికుల రాకపోకలు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేస్తారు. ఆ రూట్లో రాకపోకలు సాగించే బస్సుల వివరాలు, టైమింగ్స్ ఎప్పటికప్పుడు డిస్ప్లే చేస్తారు. ► తక్కువ స్థలం అందుబాటులో ఉన్న షెల్టర్లలో ఒక స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేస్తారు. ఎక్కువ స్థలం ఉన్న చోట షెల్టర్ లోపలి వైపు కూడా లైట్లు ఏర్పాటు చేస్తారు. అలాగే అవకాశం ఉన్న చోట సోలార్లైట్లను ఏర్పాటు చేస్తారు. పర్యావరణ హితంగా... ► అన్ని బస్షెల్టర్లు పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేయనున్నారు. ఫుట్‌పాత్, సైడ్ వాక్ సదుపాయంతో పాటు స్థలం లభించిన చోట వీటితో పాటు బస్‌షెల్టర్ చుట్టూ మొక్కలు నాటుతారు. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేవిధంగా చర్యలు తీసుకుంటారు. పై కప్పును సైతం పచ్చదనంతో కప్పేస్తారు. ► అన్ని రకాల వాతావరణాన్ని, ప్రతికూల పరిస్థితులను తట్టుకొనేవిధంగా నాణ్యమైన బెంచీలను ఏర్పాటు చేస్తారు. ఫుల్వాల్కు 4 నుంచి 5 ఫీట్ల దూరం ఉండేవిధంగా సీట్లు ఏర్పాటు చేస్తారు. మహిళల కోసం ప్రత్యేక సీట్లు కూడా ఉంటాయి. ► మ్యాపులు, డిస్‌ప్లేబోర్డులతో పాటు, వైఫై సదుపాయం కూడా ఉంటుంది. ► సురక్షితమైన తాగునీరు, అవకాశం ఉన్న చోట్ల టాయిలెట్లు, తదితర అన్ని సదుపాయాలు కల్పిస్తారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా షెల్టర్లు... బస్టాపుల ప్రాధాన్యత, ప్రయాణికుల రద్దీ, అందుబాటులో ఉన్న స్థల విస్తీర్ణానికి అనుగుణంగా బస్షెల్టర్లను ఏర్పాటు చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని హైదర్‌నగర్ (మియాపూర్), కేపీహెచ్‌బీ 4వ ఫేజ్, కూకట్పల్లి, భరత్‌నగర్, హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్, దారుల్షిఫా, ఉస్మాన్‌గంజ్, లక్డీకాపూల్, హిమాయత్‌నగర్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, అశోక్‌నగర్, చింతల్‌కుంట, భాగ్యలత కాలనీ (హయత్‌నగర్), యూసుఫ్‌గూడ బస్తీ, వేవ్‌రాక్, మాదాపూర్, ఉప్పల్, అంబర్పేట్ ఆలీకేఫ్, ఆల్విన్‌కాలనీ, పద్మారావునగర్, బోయిన్పల్లి, కొంపల్లి, మేడ్చెల్, ఎల్బీనగర్ కామినేని, ఆలియాబాద్, పహాడీషరీఫ్ తదితర ప్రాంతాల్లో బస్షెల్టర్లు నిర్మిస్తారు. కూకట్పల్లి, ఈఎస్ఐ, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, మాసాబ్‌ట్యాంక్ ఎన్ఎండీసీ, మెహదీపట్నం సరోజనీదేవి ఆసుపత్రి, నానల్‌నగర్, బాపూనగర్, లక్డీకాపూల్(హోటల్ అశోకా), నాంపల్లి గాంధీభవన్, లోతుకుంట తదితర ప్రాంతాల్లో బస్‌బేలు ఏర్పాటు చేయనున్నారు. -
పుష్కరాల బస్సులు ఇక్కడి వరకే
కృష్ణా పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చే బస్సులు, రైళ్లను నిలిపి ఉంచే ప్రాంతాలపై అధికారులు వివరంగా ప్రకటన జారీ చేశారు. ఆగస్టు 12 నుంచి నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే నిలపాలని ఆర్టీసీ, రైల్వే అధికారులు తెలిపారు. బస్సులు ఆపే ప్రాంతాలు హైదరాబాద్ రూటు నుంచి వచ్చే బస్సులను ఇబ్రహీంపట్నం జాకీర్ హుస్సేన్ కాలేజ్ వరకు అనుమతిస్తారు ఏసీ బస్సులకు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు అనుమతినిచ్చారు తిరువూరు, మైలవరం నుంచి వచ్చే బస్సులకు ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ ఎ- కాలనీలో స్టాప్ ఏర్పాటు చేశారు విశాఖపట్నం నుంచి వచ్చే బస్సులను వైవీ రావ్ ఎస్టేట్ వద్ద నిలిపివేస్తారు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చే బస్సులను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద నిలిపివేస్తారు మచిలీపట్నం, అవనిగడ్డ వైపు నుంచి వచ్చే బస్సులను కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద ఆపేస్తారు తిరుపతి నుంచి ఆ మార్గంలో వచ్చే బస్సులను గుంటూరు బస్ స్టేషన్ వరకు అనుమతిస్తారు. అక్కడి నుంచి గుంటూరు-విజయవాడ పుష్కర స్పెషల్ షటిల్ సర్వీసులుంటాయి రైళ్లు నిలిపే ప్రాంతాలు హైదరాబాద్ నుంచి వచ్చే పుష్కర స్పెషల్ ట్రైన్లను రాయనపాడు వరకు అనుమతిస్తారు విశాఖపట్నం నుంచి వచ్చే పుష్కర స్పెషల్ ట్రైన్లను రామవరప్పాడు, గుణదల స్టేషన్లలో ఆపేయాలి గుంటూరు వైపు నుంచి, తెనాలి వైపు నుంచి వచ్చే పుష్కర స్పెషల్ ట్రైన్లను కృష్ణా కెనాల్ జంక్షన్ వరకూ అనుమతిస్తారు. అక్కడ నుంచి పుష్కర్ స్పెషల్ బస్సుల్లో విజయవాడ చేరుకోవచ్చు