
నెల్లూరు: పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమం అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. మూడేళ్ల పాలనలో చరిత్రలో నిలిచిపోయేలా సీఎం జగన్ సంక్షేమం అందించారన్నారు. నెల్లూరులో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాల్లో మాట్లాడిన కాకాణి.. ‘కోవిడ్ కారణంగా రెండేళ్లు ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకోలేకపోయాం. చరిత్రలో నిలిచిపోయేలా సీఎం జగన్ సంక్షేమం అందించారు. భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. ప్రతిపక్షం అక్కసుతో అసత్య ఆరోపణలు చేస్తోంది.
పచ్చమీడియా తప్పుడు రాతలు రాస్తోంది.రైతులకు అండగా నిలిచింది, నిలుస్తోంది వైఎస్సార్ కుటుంబం మాత్రమే. చంద్రబాబుకి, సీఎం వైఎస్ జగన్‌కి చాలా వ్యత్యాసం ఉంది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుంది. రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించి ముఖ్యమంత్రి మహిళా పక్షపాతిగా నిలిచారు. శరీరంలో అవయవాలు ఎంత ముఖ్యమో పార్టీకి కార్యకర్తలు అంతే ముఖ్యం.చంద్రబాబు దివాలాకోరు తనం వల్లే కాంట్రాక్టర్లకు ఇబ్బందులు వచ్చాయి. 2024 ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలసిన పరిస్థితి చంద్రబాబుది.అందుకే కుట్రలు ,కుతంత్రాలు చేస్తున్నారు’ అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment