
సాక్షి, అమరావతి: ఏడాదిలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 90 శాతం హామీలు అమలు చేశారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత ట్వీట్ చేశారు. రాష్ట్రంలో పోలీస్ శాఖ పూర్తి స్వేచ్ఛగా, సామాన్యులకు అండగా.. మహిళలకు రక్షణ కవచంలా పనిచేసిందని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దిశ పోలీస్‌స్టేషన్లు, దిశ యాప్, గ్రామ మహిళా పోలీసులు, జైళ్లు, ఫైర్ డిపార్ట్‌మెంట్‌లలో సంస్కరణలతో పెను మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. ప్రజల రక్షణ, శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేస్తున్న పోలీస్ శాఖకు ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. (దిక్కుతోచని స్థితిలో టీడీపీ: దాడిశెట్టి రాజా)
Comments
Please login to add a commentAdd a comment