గత ఐదేళ్లలో టీడీపీ నేతలు రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు సృష్టించారని, అక్రమ కేసులు పెట్టి ఎంతోమందిని వేధించారని హోంశాఖమంత్రి సుచరిత ఆరోపించారు. అక్రమ కేసు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శనివారం ఆమె పల్నాడులోని పిడుగురాళ్ల వాసవీ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘చంద్రబాబు ప్రభుత్వ బాధితుల సమావేశా’నికి హాజరయ్యారు.