
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలు, దళితులకు ఏదో అన్యాయం జరిగిపోతున్నట్లు ప్రతిపక్ష నేత చంద్రబాబు మొసలి కన్నీరు కార్చుతున్నారని, వాస్తవానికి ఆయన పాలనలోనే కోకొల్లలుగా ఈ వర్గాలపై దాడులు జరిగాయని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళితులకూ బీసీలకు, దళితులకూ దళితులకూ మధ్య చిచ్చు పెట్టడమే చంద్రబాబు ప్లాన్ అని మండిపడ్డారు. ఆమె ఇంకా ఏమన్నారంటే..
► మా ప్రభుత్వంలో మహిళల మీద దాడులు పెరిగాయా..? లేక చంద్రబాబు హయాంలో కాల్ మనీ నుంచి క్రైమ్ పెరిగిందా..? గణాంకాలని పరిశీలిస్తే తెలుస్తుంది.
► సీఎం వైఎస్ జగన్ ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలి అని మంచి మనస్సుతో దిశ చట్టం చేశారు. మహిళలపై దాడులు, అత్యాచారాలకు తెగబడిన వారికి బుద్ధి చెప్పటానికే దిశ చట్టం తెచ్చాం. దీని కోసం రూ.80 కోట్లు కేటాయించి 18 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం.
► డయల్ 100 కంటే దిశకే ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. దిశ యాప్‌ను ఇప్పటి వరకూ 5.80 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. దిశ ఎస్‌ఓఎస్ నంబర్‌కు 71,700 మంది కాల్ చేస్తే డయల్ 100కు 53,916 కాల్స్ చేశారు.
► దిశ యాప్‌లో ట్రాక్ మై ట్రావెల్‌ను 19,824 మంది ఉపయోగించుకున్నారు.
► దిశకు వచ్చిన 470 ఫిర్యాదుల్లో 103 వాటికి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి శిక్షలు ఖరారు చేశారు.
► దిశ చట్టం గురించి విమర్శలు చేస్తున్న వారికి దిశ ఆదరణ పొందుతోందనటానికి ఈ గణాంకాలే సాక్ష్యం.
► 14 నెలల్లో రాష్ట్రంలో 400 కేసులు నమోదు అయ్యాయని ప్రతిపక్షనేత చంద్రబాబే అన్నారు. అంతకుముందు చంద్రబాబు పాలనలో చివరి ఏడాది చూస్తే.. 1,070 కేసులు నమోదు అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment