దశలవారీగా అందరికి వ్యాక్సినేషన్‌: సుచరిత | Mekathoti Sucharitha Starts Vaccination At Guntur Government Hospital | Sakshi
Sakshi News home page

దశలవారీగా అందరికి వ్యాక్సినేషన్‌: సుచరిత

Published Sat, Jan 16 2021 12:19 PM | Last Updated on Sat, Jan 16 2021 8:55 PM

Mekathoti Sucharitha Starts Vaccination At Guntur Government Hospital - Sakshi

సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఉదయం కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని హోం మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాల గిరిధర్, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, జేసి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ.. ‘ఇవాళ చాలా ఆనందంగా ఉంది. కరోనా మహమ్మారితో చాలా ఇబ్బంది పడ్డాం. కనీవిని ఎరుగని విపత్తు చూశాం. కరోనా వల్ల ప్రపంచం మొత్తం స్తంభించడం చూశాం.  మన దేశంలోనే వ్యాక్సిన్ తయారు చేసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు వ్యాక్సిన్ తయారీ మొదలు పెట్టి సఫలమయ్యాయి’ అన్నారు. 

‘గుంటూరు జిల్లాలో 31 వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశాం. కోవిడ్ నిబంధనల ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కోవిడ్ మహమ్మారిని తరిమేసే కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. ఒక్కొక్కరు రెండు డోసులు  వేసుకోవాలి. వ్యాక్సినేషన్ జరిగిన తరువాత లబ్ధిదారుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దశలవారీగా అందరికీ వ్యాక్సినేషన్ జరుగుతుంది’ అన్నారు సుచరిత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement