YSRCP Mekathoti Sucharitha Says Disha App Is Like Womans Brother - Sakshi
Sakshi News home page

Disha App: ‘దిశ’ యాప్‌ కేరాఫ్‌ మన అన్న.. 

Published Sat, Sep 18 2021 12:50 PM | Last Updated on Sat, Sep 18 2021 6:43 PM

Mekathoti Sucharitha Says Disha App Is Like Womans Brother - Sakshi

దిశ యాప్‌ ఆర్గనైజేషన్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న హోం మంత్రి మేకతోటి సుచరిత  

Mekathoti Sucharitha says importance of disha app.మహిళలు ఆటోలో, కార్లలో వెళ్లే సమయాల్లో వాహనదారుడిపై అనుమానం వస్తే వెంటనే దిశ యాప్‌లోని రెడ్‌ బటన్‌ ప్రెస్‌ చేయాలన్నారు. దీని ద్వారా వెంటనే పోలీసులకు ఇతర అధికారులకు సమాచారం అందుతుందని, నిమిషాల వ్యవధిలో పోలీసులు వచ్చి రక్షణ కల్పిస్తారని తెలిపారు .

గుంటూరు రూరల్‌: ‘దిశ’ యాప్‌ తమ ఫోనులో ఉంటే మన అన్న మనవెంట ఉన్నట్లేనని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శుక్రవారం నగరంలోని హోం మంత్రి నివాసంలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన దిశ ఆర్గనైజేషన్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. హోం మంత్రి మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థిని తమ ఫోన్‌లో దిశయాప్‌ను ఏవిధంగా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలో వివరించారు.

మహిళలు ఆటోలో, కార్లలో వెళ్లే సమయాల్లో వాహనదారుడిపై అనుమానం వస్తే వెంటనే దిశ యాప్‌లోని రెడ్‌ బటన్‌ ప్రెస్‌ చేయాలన్నారు. దీని ద్వారా వెంటనే పోలీసులకు ఇతర అధికారులకు సమాచారం అందుతుందని, నిమిషాల వ్యవధిలో పోలీసులు వచ్చి రక్షణ కల్పిస్తారని తెలిపారు . ప్రతి విద్యారి్థని, మహిళ, ఉద్యోగిని దిశ యాప్‌ను వినియోగించి రక్షణ పొందాలని కోరారు. సుమారు కోటి మందికి పైగా దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని వినియోగిస్తున్నారని తెలిపారు. ఆయా జిల్లాల వైఎస్సార్‌సీపీ నాయకులు  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement