మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భద్రత తగ్గించామనడంలో వాస్తవం లేదని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. చంద్రబాబుకు భద్రత తగ్గించారని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటికి చంద్రబాబు తానే సీఎం అని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 58 మంది ఇవ్వాల్సి చోట 74 మందితో భద్రత కల్పిస్తున్నట్టు వెల్లడించారు.