చంద్రబాబు అవమానిస్తే.. వైఎస్‌ జగన్‌ గౌరవించారు | Minister Sucharitha Respond After Appointed Home Department | Sakshi
Sakshi News home page

‘సీఎం వైఎస్‌ జగన్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా’

Published Sat, Jun 8 2019 9:06 PM | Last Updated on Sat, Jun 8 2019 9:11 PM

Minister Sucharitha Respond After Appointed Home Department - Sakshi

సాక్షి, గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. తనపై నమ్మకంతో అత్యంత కీలకమైన హోంశాఖను కేటాయించినందుకు సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ చంద్రబాబు నాయుడు దళితుల్ని తక్కువ చేసి మాట్లాడితే..  సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రం దళిత మహిళనైన తనకు అత్యంత కీలకమైన హోంశాఖను కేటాయించి గౌరవించారన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ పుట్టిన కులం తమదని, అలాంటి తమ కులం మీద చంద్రబాబు నాయుడు చిన్న చూపు చూస్తూ తక్కువ చేసి మాట్లాడారని విమర్శించారు. అందుకే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి ప్రజలు తగిన బుద్ది చేప్పారన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ తన నియోజక వర్గంలోని తాగు, సాగు నీటి సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని సుచరిత పేర్కొన్నారు. 

(చదవండి : సుచరితకు సువర్ణవకాశం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement