సాక్షి, గుంటూరు: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన సాగుతోందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏడాది కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయగలిగామని పేర్కొన్నారు. చంద్రబాబు రెండున్నర లక్షల కోట్లు లోటు బడ్జెట్ పెట్టి వెళ్లారన్నారు. దిశ చట్టం ఏర్పాటుతో పాటు పోలీసులకు వీక్లీ ఆఫ్ లు తీసుకొచ్చామని.. పాఠశాల విద్యలో సమూల మార్పులు తెచ్చామని తెలిపారు. త్వరలో 27 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
(సీఎం వైఎస్ జగన్‌కు చిరంజీవి కృతజ్ఞతలు)
‘‘వనజాక్షి, రిషితేశ్వరి ఘటనలో అవసరం లేని సీబీఐ ఇప్పుడు అవసరం వచ్చిందా? పుష్కరాల తొక్కిసలాటలో జనం చనిపోతే సీబీఐ గుర్తుకురాలేదా? సీబీఐని రాష్ట్రంలోకి అనుమతివ్వటానికి వీల్లేదంటూ చంద్రబాబు జీవోలు ఇచ్చారు. అదే చంద్రబాబు ఇప్పుడు సీబీఐ కావాలంటున్నారని’’ ఆమె విమర్శలు గుప్పించారు. అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్నామని సుచరిత పేర్కొన్నారు.
(‘యూటర్న్ అంకుల్.. ఏమిటి చెప్పండి’ )
Comments
Please login to add a commentAdd a comment