
మంత్రి పదవి పోయినందుకు ఎలాంటి బాధ లేదని మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. మంత్రి పదవి రెండున్నరేళ్లు మాత్రమేనని సీఎం వైఎస్ జగన్ ముందే చెప్పారన్నారు.
గుంటూరు రూరల్: మంత్రి పదవి పోయినందుకు ఎలాంటి బాధ లేదని మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. మంత్రి పదవి రెండున్నరేళ్లు మాత్రమేనని సీఎం వైఎస్ జగన్ ముందే చెప్పారన్నారు. తన వల్ల పార్టీకి చెడ్డ పేరు రాకూడదని.. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు. ఈ మేరకు సోమవారం గుంటూరులోని ఆమె నివాసంలో సుచరిత మీడియాతో మాట్లాడారు.
చదవండి: ప్రాణం ఉన్నంత వరకు సీఎం జగన్ వెంటే: తిప్పేస్వామి
మంత్రి పదవి పోయినందుకు తనకు బాధగా లేదని.. అయితే కొన్ని కారణాలు బాధ కలిగించాయన్నారు. వ్యక్తిగత కారణాలు, అనారోగ్య పరిస్థితుల వల్ల తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా పంపానన్నారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం జగనన్నతోనే ఉంటానని చెప్పారు. పదవిలో ఉన్నా, లేకున్నా ప్రజలకు అందుబాటులోనే ఉంటానని సుచరిత స్పష్టం చేశారు.