Jagananna Housing Colony: సుఖినో ‘భవంతి’ | Jagananna Colonies Houses In Guntur District | Sakshi
Sakshi News home page

Jagananna Housing Colony: సుఖినో ‘భవంతి’

Published Tue, Jun 21 2022 7:55 PM | Last Updated on Wed, Jun 22 2022 12:02 PM

Jagananna Colonies Houses In Guntur District - Sakshi

ప్రత్తిపాడు (గుంటూరు): ఆనందాలే హరివిల్లులై విరిసినట్టు.. సంతోషాలే రంగురంగుల రంగవల్లులై మెరిసినట్టు.. నవరత్నాలు పొదిగిన ముత్యాలై కాంతులీనుతున్నట్టు.. భువిపై వెలిసిన ఇంద్రభవనాల్లా శోభిల్లుతున్నట్టు.. జగనన్న లోగిళ్లు చక్కని ఎలివేషన్లతో సుందరంగా ముస్తాబై తళుకులీనుతున్నాయి.

సెంటు, సెంటున్నర్రలో ఇల్లా అంటూ పెదవి విరిచిన వారి కళ్లు కుట్టేలా సరికొత్త సొగసులద్దుకుని హొయలొలుకుతున్నాయి. కాంతిరేఖలై మిలమిలా మెరుస్తున్నాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు జగనన్న కాలనీలో అత్యాధునిక డిజైన్లలో అందంగా నిర్మితమైన ఈ పేదల గృహాలను చూసి అందరూ మంత్రముగ్ధులవుతున్నారు. ఔరా అంటూ అబ్బురపడుతున్నారు. జయహో జగన్‌ అంటూ కీర్తిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement