ఐలెండ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ జోరు
Published Sun, Nov 10 2013 2:29 AM | Last Updated on Fri, Aug 10 2018 7:58 PM
ఐ.పోలవరం, న్యూస్‌లైన్ :ఐలెండ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలం పుంజుకుంటోంది. మండల పరిధిలోని పలు గ్రామాల్లోని వివిధ పార్టీల కార్యకర్తలు వైఎస్సార్ సీపీలోకి వందల సంఖ్యలో వచ్చి చేరుతుండడంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు డీలా పడుతున్నాయి. మాజీ ఎంపీపీ, పార్టీ సీనియర్ నాయకుడు భూపతిరాజు సుదర్శనబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఐ.పోలవరం మండల పరిధిలోని టి.కొత్తపల్లి గ్రామానికి చెందిన సుమారు 600 మంది వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి,
పార్టీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ అబ్జర్వర్ పినిపే విశ్వరూప్, పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు గుత్తుల సాయి, మిండగుదిటి మోహన్, జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు, పార్టీ నాయకులు జ్యోతుల నవీన్, నలమాటి లంకరాజు, పెన్మత్స చిట్టిరాజు, పెయ్యిల చిట్టిబాబు, పోతుల రత్నకుమారి పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి అనుకూలంగా ఉండడంతో వైఎస్సార్ సీపీకి ఆదరణ పెరుగుతోందన్నది పలువురు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Advertisement