
స్థానిక ఎన్నికల్లో సత్తా చూపుతాం
మామిడికుదురు, న్యూస్‌లైన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చూపిస్తామని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. పాశర్లపూడిలో శనివారం జరిగిన సమావేశంలో పలువురు సర్పంచ్‌లు, మాజీ ప్రజా ప్రతినిధులు వైఎస్సార్ సీపీలో చేరారు.
సర్పంచ్‌లు మొల్లేటి త్రిమూర్తులు, దాకే సుభాష్ చంద్రబోస్, తాడి లక్ష్మణరావు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తోరం సూర్యభాస్కర్, పాశర్లపూడి సత్రం చైర్మన్ గుండాబత్తుల గోవిందరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాండ్రేగుల మహలక్ష్మి, మాజీ సర్పంచ్ కొనుకు నాగరాజు, ఎంపీటీసీ మాజీ సభ్యులు తోలేటి ఆదినారాయణమూర్తి, పసుపులేటి మహలక్ష్మీరావు, వీరవల్లి చిట్టిబాబు, నాయకులు చిట్టూరి బుల్లియ్య, జాలెం సుబ్బారావు, బొంతు మణిరాజు, జక్కంపూడి వాసు తదితరులు వైఎస్సార్ సీపీలో చేరారు.
వారికి జిల్లా కన్వీనర్ చిట్టబ్బాయి, మాజీ మంత్రి విశ్వరూప్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బొలిశెట్టి భగవాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విశ్వరూప్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికీ అందించిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు.
రాష్ట్రాన్ని పాలించే సత్తా కేవలం జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందని చిట్టబ్బాయి పేర్కొన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థి నయనాల రామకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి పి.కె. రావు, మిండగుదుటి మోహన్, కొండేటి చిట్టిబాబు, యాళ్ల దొరబాబు, యూవీవీ సత్యనారాయణ, అడ్డగళ్ల వెంకటసాయిరామ్, తాడి పుష్పరాజ్, పిల్లి శ్రీను, ముత్యాల నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.