
జగన్‌తోనే బడుగులకు పురోగతి
అయినవిల్లి, న్యూస్‌లైన్ : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, అమలాపురం ఎంపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. మాగాంలో వేటుకూరి వెంకట్రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఒకటో నంబర్ కాలువ గట్టు ఏరియాకి చెందిన టీడీపీ నాయకులు పలువురు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వీరికి చిట్టబ్బాయి, విశ్వరూప్, యాళ్ల దొరబాబు, కొండేటి చిట్టిబాబు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో నవుండ్రు జీవప్రకాశం, సవరపు సంపదరావు, కొడమంచిలి శ్రీనివాసరావు, శ్రీను (బుట్టో), నాగరాజు, ఏడుకొండలు, ప్రసాద్, వీరన్న, నవుండ్రు చిన సత్యనారాయణ, నీలయ్య, ప్రసాదరావు, పందిరి సత్యనారాయణ,ముమ్మిడివరపు సత్యనారాయణ, సవరపు సత్యనారాయణ, ఏసురత్నం, కన్నెపాముల సత్యనారాయణ, మంద శ్రీనివాసరావు, నవుండ్రు పాపాయమ్మ, సవరపు అర్జమ్మ ఉన్నారు. కుడుపూడి విద్యాసాగర్, వేటుకూరి కృష్ణరాజు, వేటుకూరి శివవర్మ తదిత రులు పాల్గొన్నారు.