ఖరీఫ్, రబీ సీజన్లో తూర్పుగోదావరి జిల్లా రైతులకు రూ.4,765 కోట్ల రుణాలు మంజూరు చేయనున్నట్టు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ తెలిపారు. ఖరీఫ్లో రూ. 2859 కోట్లు, రబీలో రూ. 1907 కోట్లు రుణాలుగా ఇవ్వనున్నట్టు ఆయన వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ఆయన జాతీయ పతకాన్ని ఎగురవేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఇప్పటికే రూ.2,120 కోట్ల రుణాలు మంజూరు చేసినట్టు తెలిపారు. వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన 3,11,856 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చామన్నారు. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీని జమ చేశామని విశ్వరూప్ వివరించారు.
రైతులకు రూ.4,765 కోట్ల రుణాలు: విశ్వరూప్
Published Thu, Aug 15 2013 8:29 PM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
Advertisement