Eastgodavari District
-
కడియం నర్సరీలో వెరైటీగా.. హ్యాపీ న్యూ ఇయర్
2024కి వీడ్కోలు చెబుతూ.. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ తూర్పు గోదావరి జిల్లా కడియంలోని పల్లా వెంకన్న నర్సరీలో వేలాది మొక్కలతో ‘హ్యాపీ న్యూ ఇయర్ 2025’ అంటూ అక్షరాకృతులను మొక్కలతో అలంకరించారు.పల్లా వెంకన్న నర్సరీ రైతు పల్లా సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) కుమారులు, నర్సరీ యువ రైతులు వెంకటేశ్, వినయ్ తీర్చిదిద్దిన ఈ ఆకృతుల మధ్య ఫొటోలు తీయించుకోవడానికి సందర్శకులు పోటీపడుతున్నారు. 50 మంది కార్మికులు 4 రోజుల పాటు శ్రమించి వేల మొక్కలతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ మొక్కల కూర్పును సందర్శకుల కోసం జనవరి 18 వరకు నర్సరీలో ఉంచనున్నారు. వైజాగ్‌లో న్యూ ఇయర్ జోష్నూతన సంవత్సర వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ సంబరాలు చేసుకున్నారు. విశాఖపట్నం బీచ్‌లో నృత్యకారిణులు విభిన్నంగా కొత్త ఏడాది ఆగమనాన్ని స్వాగతించారు. వైజాగ్ నగరంలో చాలా ప్రాంతాల్లో న్యూ ఇయర్ జోష్ కనిపించింది. సెల్ఫీలు, ఫొటోలతో వైజాగ్ వాసులు సందడి చేశారు. ఆటపాటలతో హ్యపీ న్యూ ఇయర్ జరుపుకున్నారు. ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో గోదారి ‘కళ’కళలుకొత్తపేట: ఈ ఏడాది ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవంలో గోదారి ‘కళ’కళలు కనువిందు చేయనున్నాయి. అక్కడ జరిగే ‘జై మా భారతి నృత్యోత్సవం’లో పాల్గొనే అవకాశం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 100 మంది గరగ నృత్యం కళాకారులకు లభించింది. గణతంత్ర వేడుకలకు దేశవ్యాప్తంగా 29 జానపద, 22 గిరిజన కళారూపాల ప్రదర్శనలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ ప్రదర్శనల్లో ప్రముఖ జానపద సంప్రదాయ ప్రదర్శనలుగా ఖ్యాతి పొందిన గరగ నృత్యం, వీరనాట్యం కళారూపాలకు కేంద్ర సాంస్కృతిక శాఖ అవకాశం కల్పించింది. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పలివెల గ్రామానికి చెందిన గరగ నృత్యం, వీరనాట్యం కళాకారుడు కొమారిపాటి ఏసు వెంకట ప్రసాద్ ఆధ్వర్యాన శివపార్వతి గరగ నృత్యం కళాకారులు 100 మంది డిసెంబర్ 28న ఢిల్లీ పయనమయ్యారు. చదవండి: బాబు నూతన సంవత్సర కానుక 'రూ.1.19 లక్షల కోట్ల అప్పు' -
జీడిమామిడి పండు.. పోషకాలు మెండు
రాజానగరం(తూర్పుగోదావరి జిల్లా): మెట్ట ప్రాంతంలో రైతులకు అధిక ఆదాయాన్ని సమకూర్చే పంటలలో జీడిమామిడి ప్రధానమైనది. ఈ పంటలో జీడిగింజల ద్వారానే ఆదాయం వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే జీడిగింజల ఉత్పత్తికి ప్రధాన కారణంగా ఉన్న జీడి మామిడి పండ్లను మాత్రం పెద్దగా పట్టించుకోరు. అవి తోటల్లో చెట్ల కింద రాలిపోతూ, కుళ్లిపోతూ ఉంటాయి. ఈ విధంగా దేశంలో సాలీనా 40 లక్షల టన్నుల జీడిమామిడి పండ్లు తోటల్లో వృథా అవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. మంచి రంగు, రుచి మంచి రంగు, రుచి, ఘాటైన వాసన కలిగివున్న జీడిమామిడి పండు తినగానే గొంతులో ఒక రకమైన జీర వస్తుంది. అందుకే చాలామంది దీనిని తినడానికి ఆసక్తిని చూపించరు. ఒకటి, రెండు రోజులకు మించి నిల్వ చేసుకునేందుకు అవకాశం లేని పండు కావడం, త్వరగా కుళ్లిపోయే స్వభాగం కలిగివుండంతో జీడిమామిడి పండ్లు ఎక్కువగా తోటల్లో రాలిపోతూ, భూమిలోనే కలిసిపోతున్నాయి. వాస్తవానికి వీటిలో అనేక రకాల పోషక విలువలు, ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకనే వీటి వినియోగం పై దేశవ్యాప్తంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు (కెవికె) గ్రామీణ రైతు మహిళలకు శిక్షణ ఇస్తూ, కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాయి. పలు రకాల ఆహార ఉత్పత్తులు జీడిమామిడి పండ్లతో పలురకాల ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు. వీటి రసంతో శీతల పానీయాలు, గుజ్జుతో జామ్, మిక్స్డ్ ఫ్రూట్ జామ్, చట్నీ, ఊరగాయ, కాండీ, టూటీ ఫ్రూటీ, టాఫీ, వినిగర్, తయారు చేయవచ్చు. గోవాలో లభించే ‘ఫెన్నీ’ అనే మత్తు పానీయం జీడిమామిడి పండ్ల రసం నుంచి తయారవుతుంది. రసం తీసే విధానం బాగా ముగ్గిన జీడిమామిడి పండ్లను సేకరించి, నీటితో శుభ్రం చేసిన తరువాత చేతులతోగాని, ప్రత్యేక మెషీన్‌తోగాని రసాన్ని తీస్తారు. ఇందుకు జ్యూస్ ఎక్స్‌ట్రాక్టరుని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీనివల్ల పండు నుంచి 70 శాతం రసాన్ని తీయడమే కాకుండా గంటకు 150 కిలోల పండ్ల నుంచి రసాన్ని తీసేందుకు అవకాశం ఉంటుంది. ఈ రసంలో ఉన్న టెనిన్స్‌ని (గొంతులో జీరను కలిగించే వగరు) తొలగించడానికి సగ్గు బియ్యంతో తయారు చేసిన గంజిని ఉపయోగిస్తుంటారు. జీడిమామిడి పండ్లతో మామిడి కాయల మాదిరిగా ఆవకాయ పెట్టవచ్చు. తీరిక సమయంలో తినేందుకు పొటాటో చిప్స్ మాదిరిగా చిప్స్ కూడా తయారు చేసుకోచ్చు. పిప్పితో ఉపయోగాలు ► రసం తీసిన తరువాత వచ్చే పిప్పిని ఎండబెట్టి పశువులకు, కోళ్లకు దాణాగా ఉపయోగించుకోవచ్చు. ►వర్మీ కంపోస్టుగాను ఉపయోగపడుతుంది. ఈ కంపోస్టులో 1.60 శాతం నత్రజని, 0.44 శాతం భాస్వరం, 0.58 శాతం పొటాషియం ఉంటాయి. ►గోవా రాష్ట్రంలో ఈ పిప్పిని లిక్కర్ తయారీకి వాడతారు. ►ఈ పిప్పి నుంచి ‘పెక్టిన్’ అనే ముఖ్యమైన ఉత్పత్తిని తయారు చేయవచ్చు. ఇది జామ్, చాస్, జెల్లీ, కెచప్ తయారీలలో చిక్కదనం రావడానికి తోర్పడుతుంది. పలు రకాల మందుల తయారీలోను, పౌడర్లు, పేస్టుల తయారీలోను కూడా వాడతారు. ఔషధకారిగా.. ►ఈ పండులో లభ్యమయ్యే సి–విటమిన్ నిమ్మ జాతుల కంటే సుమారు 5 రెట్లు అధికంగా ఉంటుంది. పసుపు, ఎరుపు, గులాబి రంగులలో దొరికే ఈ పండ్లలో 85 శాతం రసం, 10 శాతం చక్కెర ఉంటాయి. రసంలో ఫ్రక్టోజు, గ్లూకోజు, సుక్రోజు, మాల్టోజు, మాలిక్ ఆమ్లం ఉంటాయి. ►జిగట, నీళ్ల విరోచనాల నివారణకు, స్కర్వీ వ్యాధిని అరికట్టడానికి ఉపయోగపడుతుంది. ►మూత్ర పిండాల సమస్యలు, కలరా, డ్రాప్సీ వ్యాధి నివారణకు ఉపకరిస్తుంది. జీడిమామిడి పండు ఆరగించడం ద్వారా అరికాళ్ల పగుళ్లను నివారించవచ్చు. ►జీడిమామిడి రసంతో తయారు చేసిన ‘ఫెన్నీ’ అనే మత్తు పానీయం పెద్దలకు, పిల్లలకు అనేక వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. ►వీటి విత్తనాలతో తయారు చేసిన పొడి పాము కాటుకు విరుగుడుగా కూడా ఉపయోగిస్తుంటారు. యువతకు ఉపాధి ఫుడ్ ప్రాసెంగ్ యూనిట్ల ద్వారా జీడిమామిడి పండ్లను కూడా ఉపయోగంలోకి తీసుకువచ్చే ప్రొసెస్‌ని చేపడితే మెట్ట ప్రాంతాలలో నిరుద్యోగులకు ఉపాధిని చూపవచ్చు. ఈ పండ్ల నుంచి తీసిన రసాన్ని యాప్సీ, ఫ్రూటీ, మాజాల మాదిరిగా టెట్టా ప్యాకింగ్ చేసి విక్రయించే ప్రక్రియ ద్వారా యువతకు ఉపాధి లభిస్తుంది. కేరళలో ఇప్పటికే జీడిమామిడి పండ్లతో తయారుచేసిన రసాన్ని శీతల పానీయంగా విక్రయిస్తున్నారు. పచ్చడి పెట్టుకోవచ్చు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా జీడిమామిడి పండ్లతో ఏఏ రకాల ఆహార పదార్థాలను, రసాలను, జ్యూస్‌లను, జామ్‌లను తయారు చేయవచ్చునో గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు శిక్షణ ఇస్తున్నాం. వీటితో పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. అదెలాగో శిక్షణలో తెలియజేస్తున్నాం. – డాక్టర్ వీఎస్‌జీఆర్ నాయుడు, ప్రధానాధికారి, కృషి విజ్ఞాన కేంద్రం, కలవచర్ల, తూర్పుగోదావరి జిల్లా 600 మందికి శిక్షణ ఇచ్చాం కేరళ, గోవాలో మాదిరిగా జీడిమామిడి పండ్లను వినియోగం లోకి తీసుకువచ్చేందుకు డీసీసీడీ కొచ్చిన్ (కేరళ) సహకారంతో కేవీకేలో బ్యాచ్‌ల వారీగా గత ఆరు సంవత్సరాల నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 600 మంది మహిళలకు శిక్షణ ఇచ్చాం. – జేవీఆర్ సత్యవాణి, గృహ విజ్ఞాన విభాగం అధికారి, కేవీకే, కలవచర్ల, తూర్పుగోదావరి జిల్లా -
Wheelchair Cricket: వైకల్యాన్ని జయించారు
కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలిరా.. అన్నట్టు హుషారుగా బ్యాట్ ఝుళిపించారు. పరుగుల వరద పారించారు. భళా అనిపించారు.. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో ఆంధ్రప్రదేశ్ వీల్‌చైర్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ వర్సెస్ తెలంగాణ జట్ల మధ్య జరిగిన క్రికెట్ పోటీల్లో దివ్యాంగుల క్రీడోత్సాహ దృశ్యాలివి. రాజమహేంద్రవరం రూరల్: చిన్న ఓటమి, అపజయానికే తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురవుతున్న నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ దివ్యాంగ క్రీడాకారులు. అంగ వైకల్యంతో కుంగిపోకుండా, పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తమకు ఇష్టమైన క్రికెట్లో సత్తా చాటుతున్నారు. ఆర్థికంగా కష్టమైనా, సౌకర్యాలు తక్కువగా ఉన్నా వీల్ చైర్ క్రికెట్లో సాధన చేసి అనుకున్నది సాధించారు. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి చేరారు. త్వరలో ఐడబ్ల్యూపీఎల్ (ఇండియన్ వీల్‌చైర్ ప్రీమియర్ లీగ్)లో ఆడనున్నట్లు సంతోషంగా చెబుతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాకు చెందిన వీల్‌చైర్ క్రికెట్ క్రీడాకారులు. సాధారణ క్రికెట్ మాదిరిగానే వీల్‌చైర్ క్రికెట్ కూడా ఉంటుంది. జట్టులో 11 మంది క్రీడాకారులు ఉంటారు. బౌలింగ్, బ్యాటింగ్, కీపింగ్, ఫీల్డింగ్ అంతా వీల్‌చైర్‌లో ఉంటూనే చేస్తారు. సాధారణ క్రికెటర్లు పరిగెత్తినట్టుగా మైదానంలో వీల్ చైర్లో తిరుగుతూ ఆడతారు. ఇప్పటికే పలు రాష్ట్రాలలో జరుగుతున్న వీల్‌చైర్ క్రికెట్ పోటీలలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బాలుర హైస్కూల్ క్రీడాప్రాంగణంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ వీల్‌చైర్ క్రికెట్ టోర్నమెంట్లో తలపడుతున్నారు. శుక్రవారం నుంచి మూడురోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయి. ధృడ సంకల్పం ధృడ సంకల్పం ఉంటే ఎంత కష్టమైన పనిలోనైనా విజయం సాధించవచ్చని వీల్‌చైర్ క్రికెట్ క్రీడాకారులు నిరూపిస్తున్నారు. వీల్‌చైర్‌లోనే క్రికెట్ ఆడుతూ క్రీడలపై తమకు ఉన్న మక్కువను చూపుతున్నారు. బంతిని అందుకునే సమయంలో క్రీడాకారులు అదుపుతప్పి పడిపోయినట్లే ఒక్కోసారి వీరుకూడా వీల్‌చైర్ నుంచి కింద పడిపోతారు. అయినా మొక్కవోని దీక్షతో తమ సత్తా చాటుతున్నారు. సత్తా చాటుతాం జాతీయస్థాయి వీల్‌చైర్ క్రికెట్లో సైతం సత్తా చాటుతాం. రెండేళ్లుగా ముమ్మర సాధన చేస్తున్నాం. త్వరలో జరిగే ఇండియన్ వీల్‌చైర్ క్రికెట్ ప్రీమియర్ లీగ్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు పాల్గొంటున్నారు. పిడింగొయ్యి పంచాయతీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నా. ఖాళీ సమయంలో వీల్‌చైర్ క్రికెట్ సాధన చేస్తున్నాను. హైదరాబాద్‌లో జరిగిన టోర్నమెంట్లో ఆంధ్రా జట్టు రన్నర్‌గా నిలిచింది. – మానుపాటి ప్రవీణ్ కుమార్, ఏపీ వీల్‌చైర్ క్రికెట్ టీమ్ కెప్టెన్ క్రికెట్‌పై మక్కువ అంగవైకల్యం ఉన్నా ఏరోజూ కుంగిపోలేదు. ఆటపై ఉన్న మక్కువతో వీల్ చైర్ క్రికెట్లో సాధన చేశాం. పలువురు అందించిన ప్రోత్సాహంతో అనేక రాష్ట్రాలలో క్రికెట్ ఆడాను. బ్యాటింగ్‌లో మంచి స్కోర్‌ను సాధించగలిగాను. టీమ్ సమష్టి కృషితో ముంబైలో జరిగిన టోర్నమెంట్లో రన్నర్‌గా నిలిచాం. మరింత సాధన చేసి జాతీయ టీమ్‌లో స్థానం సంపాదించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాను. – ఎస్కే సమీయుద్దీన్, తెలంగాణ వీల్‌చైర్ క్రికెట్ టీమ్ కెప్టెన్ ప్రోత్సాహం బాగుంది వీల్‌చైర్ క్రికెట్లో రాణిస్తున్నాం. క్రికెట్ ఆడేందుకు మాకు వైకల్యం అడ్డుకాలేదు. ఆత్మవిశ్వాసంతో క్రమశిక్షణ తో సాధన చేస్తూ ముందుకు సాగుతున్నాం. ఒడిశాను ఉత్తమ జట్టుగా నిలిపేందుకు కృషి చేస్తున్నాం. ఆంధ్రాలో జరుగుతున్న మ్యాచ్‌లో విజయం సాధించే లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. వీల్‌చైర్ క్రికెట్‌కు వస్తున్న ప్రోత్సాహంతోనే ఇతర రాష్ట్రాలకు సైతం వెళ్లి ఆడుతున్నాం. – అభయ్, ఒడిశా వీల్‌చైర్ క్రికెట్ టీమ్ కెప్టెన్ -
ఒక్కో మొక్క రూ.25 లక్షలు!
సాక్షి, కడియం: ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ గుజరాత్లో అభివృద్ధి చేస్తున్న భారీ పార్కులో నాటేందుకు తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి మొక్కలను తరలించారు. కడియంలోని వీరవరం రోడ్డులో మార్గాని వీరబాబుకు చెందిన గౌతమీ నర్సరీ నుంచి రెండు ఆలివ్ మొక్కలను గురువారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాలీపై తీసుకువెళ్ళారు. స్పెయిన్ నుంచి తీసుకువచ్చిన వీటి వయస్సు సుమారు 180 సంవత్సరాలు ఉంటుందని నర్సరీ రైతు మార్గాని వీరబాబు తెలిపారు. ఒక్కో మొక్క ధర రూ.25 లక్షలు ఉంటుందని సమాచారం. రెండేళ్ళ క్రితం ఇక్కడికి తెచ్చి, వాటిని అభివృద్ధి చేసినట్లు వీరబాబు వివరించారు. (చదవండి: సత్తా చాటిన విశాఖ; హైదరాబాద్‌ను వెనక్కునెట్టిన సుందరనగరి) -
అన్నవరం ట్రస్ట్ బోర్డు సభ్యులు వీరే
సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి పాలక మండలిని రాష్ట్ర ప్రభుత్వం నియమించించింది. ఆలయానికి కొత్త ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి వి. ఉషారాణి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు, ఆలయ ప్రధాన అర్చకుడితో పాటు 16 మందికి ఈ ట్రస్ట్ బోర్డులో అవకాశం కల్పించారు. ప్రభుత్వం గుర్తించిన వ్యవస్థాపక కుటుంబ సభ్యులు చైర్మన్‌గా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు పాలక మండలిలో కొనసాగుతారని స్పష్టం చేశారు. ప్రధాన అర్చకుడు ఎక్స్అఫిషియో సభ్యుడిగా ఉంటారని తెలిపారు. కాగా, ఇప్పటికే విజయవాడ, ద్వారకా తిరుమల, సింహాచలం దేవస్థానాలకు నూతన పాలక మండళ్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. (చదవండి: ప్రముఖ ఆలయాలకు పాలకమండళ్లు) అన్నవరం దేవస్థానం పాలకమండలి సభ్యులు వీరే.. 1. వ్యవస్థాపక కుటుంబ సభ్యులు (చైర్మన్) 2. సాధు దుర్గ 3. కర్రి భామిరెడ్డి 4. కలగా రామజోగేశ్వర శర్మ 5. వాసిరెడ్డి జగన్నాథం 6. నత్రా మహేశ్వరి 7. గాదె రాజశేఖరరెడ్డి 8. చిట్టూరి సావిత్రి 9. అప్పారి లక్ష్మి 10. ముత్యాల వీరభద్రరావు 11. మోకా సూర్యనారాయణ 12. చాగంటి వెంకట సూర్యనారాయణ 13. ములికి సూర్యవతి 14. బి. ఆశాలత 15. కర్రా వెంటకలక్ష్మి 16. కొండవీటి సత్యనారాయణ (ప్రధాన అర్చకుడు) -
వేధింపులపై వారే సీఎంకు లేఖ రాశారు
సాక్షి, రాజానగరం: ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న ఆంగ్ల విభాగాధిపతి డాక్టర్ ఎన్. సూర్యరాఘవేంద్రపై వచ్చిన లైంగిక వేధింపులపై ప్రాథమిక విచారణ చేపట్టిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సురేష్‌వర్మ శనివారం మీడియాకు వివరాలను వెల్లడించారు. వేధింపులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖను 2017- 19 బ్యాచ్‌కు చెందిన ముగ్గురు విద్యార్థినులుగా గుర్తించామని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ ముగ్గురు విద్యార్థినిలకు ఫోన్లు చేస్తే.. సరిగా రెస్పాండ్ కావడం లేదనీ.. అంతేకాక ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారని తెలిపారు. ఫిర్యాదు చేసిన విద్యార్థినులు యూనివర్సిటీలో ఉన్న సమయంలో తాను వీసీగా లేనని అన్నారు. ఎంఏ ఇంగ్లీష్ చదువుకున్న విద్యార్థులు ఎవరైనా తెలుగులో ఉత్తరం రాస్తారా..? పైగా విద్యార్థులు రాసిన లేఖలో వారి సంతకాలు కూడా లేవని సందేహం వ్యక్తపరిచారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి, ఇందులో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో తెలుసుకుని యూనివర్సిటీ తరఫున క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉద్ఘాటించారు. చదవండి: నన్నయ వర్సిటీలో లైంగిక వేధింపులు -
కొబ్బరి రైతులకు శుభవార్త
సాక్షి, తూర్పు గోదావరి: రాష్ట్రంలోని కొబ్బరి రైతులకు వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు శుభవార్త అందించారు. ఉపాధి హమీ పథకాన్ని కొబ్బరి తోటల పెంపకానికి అనుసంధానం చేశామని కన్నబాబు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకంలో భాగంగా కొబ్బరికి 75 శాతం బీమా ప్రీమియంను కొబ్బరి అభివృద్ధి బోర్డుతో కలిసి ప్రభుత్వం చెల్లిస్తుందని వెల్లడించారు. వేజ్ కాంపొనెంట్ కింద రూ.1,73,591, మెటీరియల్ కాంపొనెంట్ కింద రూ.1,06,179లు కలిపి మూడు ఏళ్లకు హెక్టారుకు రూ.2,79,770లు కొబ్బరి రైతుకు ప్రభుత్వం అందజేస్తుందని మంత్రి పేర్కొన్నారు. కొత్తగా కొబ్బరి తోటలు పెంపకం చేయాలనుకునే రైతులకు ఇది ఎంతో మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇటీవల కొబ్బరి ధరలు పడిపోయిన నేపథ్యంలో నాఫెడ్ ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో ఐదు చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వల్ల నెల రోజుల్లోనే మిల్లింగ్ కోప్రాకి రూ. రెండు వేలు రేటు పెరిగిందని గుర్తుచేశారు. సీపీసీఆర్‌ఐ నిర్ణయం ప్రకారం త్వరలోనే సామర్లకోట వద్ద కొబ్బరి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించారు. రైతు తోటలోనే శాస్త్రజ్ఞులు పరిశోధన చేసేలా 'ఆన్ ఫార్మింగ్ రిసెర్చ్ స్టేషన్'ను కోనసీమలో ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి పేర్కొన్నారు. -
కోనసీమలో కొబ్బరి పరిశోధన కేంద్రం
సాక్షి, తూర్పుగోదావరి: కోనసీమలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రపప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శనివారం కాకినాడ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి కురసాల మాట్లాడుతూ.. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తితో పాలన చేస్తున్నామని, అందుకే రాష్ట్రంలోని ప్రభుత్వ పథకాలకు వైఎస్సార్ పేరు పెడుతున్నామని అన్నారు. రైతులకు ఉపయోగపడే మొక్కలను అటవీశాఖ ఉచితంగా ఇస్తున్న నేపథ్యంలో.. పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు పది లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కురసాల తెలిపారు. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణకు వ్యవసాయ, ఉద్యానవన, అటవీశాఖలు సమన్వయం కావాలని అధికారులను ఆదేశించారు. అంతేకాక ఆయా శాఖలు రైతులకు మొక్కల పెంపకంపై అవగాహన కలిపించాలని అధికారులకు సూచించారు. -
ఆయన ‘జూలకటక’ అన్నట్లుగా తయారయ్యాడు
కాకినాడ: మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ‘ జూలకటక’ అన్నట్లుగా తయారయ్యాడని అమలాపురం ఎంపీ పండుల రవీంద్ర బాబు ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పండుల రవీంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ ఎన్నికల ఫలితాల సర్వేతో జోకర్ అయ్యాడని అన్నారు. లగడపాటి తన వ్యాపారాల్లో కాళ్లు ఎత్తేశాడని ఆరోపించారు. బ్యాంక్ అప్పులు తీర్చుకోవడానికి బెట్టింగ్ వ్యాపారం మొదలు పెట్టారని విమర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత లగడపాటి ఎలాగూ పారిపోతాడని జోస్యం చెప్పారు. ఎందుకంటే అతని సర్వే నమ్మి బెట్టింగ్ కాసిన వాళ్లు వెంటపడతారని అన్నారు. -
ఏయ్ ఎక్కడికిపోయావ్ రా..?
సాక్షి, కాకినాడ ప్రతినిధి: అది కాకినాడ నగరంలోని మెక్లారిన్ హైస్కూల్.. శంకర్‌దాదా సినిమాలోలా ఆ స్కూల్‌కు ఓ ఆస్పత్రి బోర్డు తగిలించారు. ఇక అంబులెన్స్‌లు ఇతరత్రా వాటిని కూడా అక్కడ ఏర్పాటు చేసి.. ఆస్పత్రి వాతావరణాన్ని తలపించేలా సిద్ధం చేశారు. ఏంటని ఆరా తీస్తే.. అది విజయదేవరకొండ హీరోగా మైత్రి ప్రొడక్షన్ నిర్మిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ సినిమా కోసం వేసిన సెట్టింగ్ అని తేలింది. కట్ చేస్తే.. ఇంతలో అక్కడికి ప్రాజెక్టు డైరెక్టర్ డీఆర్డీఏ, విశాఖపట్నం పేరున్న బోర్డుతో నలుపురంగులో ఉన్న ఓ వాహనం వచ్చి ఆగింది. అందులో నుంచి ఓ వ్యక్తి దిగారు.. మంచి టిప్‌టాప్‌గా ఉన్న ఆయనకు అస్సలు ఎండతగలకుండా పక్కన ఓ దఫేదారు గొడుగుపట్టుకుని ఆయనను అనుసరించాడు. ఆయన నేరుగా ఆస్పత్రిలా వేసిన సెట్టింగ్‌లోకి వెళ్లారు. మళ్లీ కట్ చేస్తే.. కొంత సేపటికి లోపలకు వెళ్లిన ఆయన చాలా కోపంగా బయటకి వచ్చారు. ‘‘ఏయ్ ఎక్కడికి పోయావ్రా?.. నేను నిన్ను వెతుక్కోవాలా.. ఏం నేను రావాలా వెనక్కి మళ్లీ సెల్ తీసుకోవడానికి అంటూ (రాయడానికి వీల్లేది తిట్లతో) ఆ దఫేదార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతే పాపం ఆ దఫేదార్ తెల్లముఖం వేసి.. ఆయన వెంట కుర్చీ పట్టుకుని నడుచుకుంటూ వెళ్లాడు.. ఇంతకీ ఆయన ఎవరని ఆరా తీస్తే.. ఆయన విశాఖ జిల్లా డీఆర్డీఏ పీడీ సత్యశ్రీనివాస్ అని.. ఆయనకు సినిమాల్లో నటించడం హాబీ అని తేలింది. విశాఖ డీఆర్డీఏ పీడీ సత్యశ్రీనివాస్ తన నోటికి పనిచెప్పారు. తన వెంట ఉండే దఫేదార్‌ను నానా బూతులు తిడుతూ దుర్భాషలాడారు. అంతేకాదు తన సొంత పనులకు ప్రభుత్వ వాహనాలను, సిబ్బందిని వినియోగిస్తూ మీడియాకు చిక్కారు. గతంలోనూ ఈయన పలు వివాదాస్పద వ్యవహారాల్లోనూ చిక్కుకొని విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా కాకినాడలో ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు ఆయన ఆదివారం వచ్చారు. అయితే నేరుగా ప్రభుత్వ వాహనంలోనే ఆయన తన దఫేదార్, ప్రభుత్వ డ్రైవర్‌ను వెంట తీసుకువచ్చారు. సినిమా చిత్రీకరణ జరిగినంత సేపు సిబ్బంది ఆయన వెంటే ఉన్నారు. ఆయనను నీడలా వెంటపెట్టుకునే ఉన్నారు. ఒకానొక దశలో దఫేదార్ ఆయన వెంట లేకపోవడంతో పీడీకి చిర్రెత్తుకొచ్చింది. అంతే తన నోటికి పని చెప్పారు. ఇష్టానుసారంగా దఫేదార్‌పై అందరూ చూస్తుండగానే విరుచుకుపడ్డారు. ఆయన దుర్భాషలాడిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. డీఆర్డీఏ పీడీ సత్యశ్రీనివాస్, షూటింగ్ స్పాట్లో ప్రభుత్వ వాహనం జిల్లా పంచాయతీ అధికారి కూడా.. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ ఇన్చార్జ్ అధికారి ఆనంద్ కూడా ఈ సినిమా షూటింగ్లో ఉన్న డీఆర్డీఏ పీడీని కలిసేందుకు మెక్లారిన్ హైస్కూల్‌కు వచ్చారు. ఆయన కూడా ప్రభుత్వ వాహనంలోనే తన సిబ్బందిని వెంట పెట్టుకుని వచ్చారు. సినిమా చిత్రీకరణలో సుమారు రెండు గంటల పాటు అక్కడే గడిపారు. పీడీ సినిమా చిత్రీకరణలో ఉండడంతో ఆయన కోసం అక్కడే వేచి ఉన్నారు. అయితే విశాఖ డీఆర్డీఏ పీడీ విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా.. ‘‘నాకు సత్యశ్రీనివాస్ స్నేహితుడని, అందుకే ఆయనను కలవడానికి వచ్చాను’’ అని సమాధానమచ్చారు. దఫేదార్‌ను దుర్భాషలాడిన విషయం తనకు తెలియదన్నారు. నిబంధనల ప్రకారం.. ఏ అధికారైనా తన వ్యక్తిగత పనులకు ప్రభుత్వ వాహనాలను, సిబ్బందిని వినియోగించకూడదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా అధికారులు ఇలా యథేచ్ఛగా ప్రభుత్వ అధికారాలను, వాహనాలను, దుర్వినియోగం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు తన కిందిస్థాయి సిబ్బందిని ఇలా దుర్భాషలాడడంపైనా పలువురు మండిపడుతున్నారు. షూటింగ్ కోసం వచ్చిన వ్యక్తి ఇలా ప్రభుత్వ వాహనాలను వాడడం ఏంటని పలువురు ఆశ్చర్యపోయారు. -
జననేతకు జైకొట్టిన జనగోదారి
ఊళ్లకు ఊళ్లే తరలి రావడంతో ప్రజా సంకల్ప యాత్ర ఆద్యంతం జన గోదావరిగా మారింది. జనాభిమానం గోదారమ్మలా పొంగిపొర్లింది. అక్కచెల్లెమ్మలు పోటీపడి అడుగడుగునా హారతి పట్టగా, యువకెరటం ఉత్తుంగ తరంగంలా ఎగిసిపడింది. నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా బహిరంగ సభలకు ఇసుకవేస్తే రాలనంతగా జనం పోటెత్తారు. అధికారం అండతో పేట్రేగిపోతున్న పాలకుల దుర్మార్గాలను, అవినీతిని, మోసాలను నడిరోడ్డుపై జగన్ నిగ్గదీసినప్పుడు అశేష ప్రజానీకం ఈలలు.. కేకలతో ప్రతిస్పందిస్తూ మద్దతు పలికింది. చిన్నారులు మొదలు వయో వృద్ధుల వరకు.. అన్ని వర్గాల ప్రజలు జననేతతో మాట కలిపారు. మీ వెంటే ఉంటామంటూ చేతిలో చెయ్యేసి నడిచారు. సమస్యలూ చెప్పుకున్నారు. మీరొస్తేనే న్యాయం జరుగుతుందని ఆకాంక్షించారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా జన సంద్రంగా మారి జననేతను అక్కున చేర్చుకుంది. ప్రజలతో మమేకమై.. సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ప్రభంజనం సృష్టించింది. జూన్ 12వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా నుంచి రోడ్డు కం రైల్వే వంతెన మీదుగా రాజమహేంద్రవరంలోకి ప్రవేశించిన పాదయాత్రకు చరిత్రలో నిలిచిపోయేలా లక్షలాది జనం స్వాగతం పలికారు. అక్కడి నుంచి కోనసీమలోని పచ్చని పల్లెల మీదుగా మధ్య డెల్టా, మెట్ట ప్రాంతాల మధ్య, ఏజెన్సీకి సమీపంలోని జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో దుర్భేద్యమైన కొండల మధ్య పాదయాత్ర సాగింది. ఈ క్రమంలో జననేత 2,700 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించారు. పాదయాత్రలో ఆద్యంతం అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ.. నుదుట తిలకం దిద్ది మంగళ హారతులిస్తూ.. దిష్టితీస్తూ మహిళలు పెద్ద సంఖ్యలో జననేతకు ఘన స్వాగతం పలికారు. వృద్ధులు సైతం ఓపిక తెచ్చుకుని రోడ్లపైకి వచ్చారు. యువకుల సందడి, విద్యార్థినుల హడావుడి, రాఖీలు కట్టిన అక్కచెల్లెమ్మల ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఓవైపు ఘన స్వాగతం పలుకుతూ.. మరోవైపు తమ సమస్యలు వినే నాయకుడు వచ్చారంటూ అవ్వాతాతాలు, మహిళలు, యువత, పేదలు, రైతులు, చిరుద్యోగులు, వ్యాపారులు, వివిధ కుల వృత్తుల వారు, ప్రజా సంఘాలు, విద్యార్థులు కష్టాలు చెప్పుకున్నారు. ఇళ్లు, పింఛన్లు ఇవ్వడం లేదని, ఆరోగ్యశ్రీ వర్తించడం లేదని, ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదని, ఉద్యోగాలు లేవని, తాగు, సాగు నీరు అందడం లేదని వాపోయారు. అందరి సమస్యలు ఓపిగ్గా విన్న వైఎస్ జగన్.. నవరత్నాలతో అందరినీ ఆదుకుంటామని, రాజన్న రాజ్యం తీసుకొస్తానని భరోసా ఇచ్చారు. అందరిలోనూ ఉత్తేజం.. మండుటెండను లెక్కచేయలేదు. జోరున వర్షం కురిసినా వెనక్కు తగ్గలేదు. లక్షలాది మంది అభిమాన నేతతో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. పాదయాత్రలో ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి. అనపర్తి మాజీ ఎమ్మెల్యే తేతలి రామారెడ్డి, ప్రముఖ వైద్యుడు పితాని అన్నవరం, ఎన్ఆర్ఐ దవులూరి దొరబాబు, ఆదర్శ ఇంజినీరింగ్ కళాశాల అధినేత బుర్రా అనుబాబు తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. ఒకవైపు పాదయాత్ర చేస్తూనే ప్రత్యేక హోదా కోసం జూలై 24వ తేదీన బంద్‌కు పిలుపునిచ్చి పెద్దాపురంలో జననేత బంద్‌ను పర్యవేక్షించారు. ఊహించిన దానికంటే ఎక్కువగా పాదయాత్ర విజయవంతం కావడంతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో కదనోత్సాహం తొణికిసలాడుతోంది. ప్రభుత్వ తీరుతో నష్టపోయిన తాడిత, పీడిత జనానికి భరోసానిచ్చింది. జగన్ సీఎం అయ్యేలా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామని అన్ని వర్గాల వారు స్పష్టీకరిస్తున్నారు. జిల్లాలో 412 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించిన జననేత నేడు విశాఖ జిల్లాలో ప్రవేశించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఇటు ఘనంగా వీడ్కోలు, అటు స్వాగతం పలకబోతున్నాయి. జిల్లాలో జననేత ఇచ్చిన ప్రధాన హామీలు.. - దారీతెన్నూ లేని, నాటు పడవలే దిక్కైన గోదావరి లంక వాసుల సమస్యల పరిష్కారానికి హామీ. - పేద ప్రజల ఇళ్ల రుణ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. - ప్రభుత్వ ఉద్యోగులందరికీ స్థలం ఇచ్చి సొంతిళ్లు కట్టిస్తాం.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి సకాలంలో డీఏలు ఇస్తాం. - దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని పునరుద్ఘాటన. - మత్స్యకారులకు ప్రత్యేక కార్పొరేషన్.. డీజిల్‌పై సబ్సిడీ పెంపు.. కొత్త బోట్లకు రిజిస్ట్రేషన్.. ఫిషింగ్ హాలిడే సమయంలో రూ.10 వేల సాయం.. ప్రమాదవశాత్తు మత్స్యకారుడు మరణిస్తే కుటుంబానికి రూ. 10 లక్షల సాయం, మత్స్యకార మహిళలకు 45 ఏళ్లకే పింఛన్ - ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ.. గ్రామ సచివాలయాల ద్వారా 1.50 లక్షల ఉద్యోగాల కల్పన - యానిమేటర్లకు రూ.10 వేల వేతనం - కాపులకు రూ.10 వేల కోట్లు కేటాయింపు. కాపు ఉద్యమంలో పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేస్తాం. - చేనేత కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు, మగ్గం ఉన్న ప్రతీ ఇంటికి నెలకు రూ.2 వేలు.. ఆప్కోలో మార్పులతో ఆర్థిక పరిపుష్టి. - తక్కువ పరిహారం పొందిన పోలవరం ముంపు బాధితులకు ఎకరాకు రూ.5 లక్షలు.. గతంలో పరిహారం పొందని వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం. - జర్నలిస్టులకు ఇళ్లు నిర్మించి ఇస్తాం. - ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల దోపిడీని అడ్డుకుంటాం. ఫీజులు తగ్గిస్తాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం. -
ఆషాఢంలో ఇంటికి వస్తున్నాడని అల్లుడి హత్య
సాక్షి, అమలాపురం టౌన్: ఆషాఢ మాసంలో తరచుగా తమ ఇంటికి వస్తున్నాడన్న కోపంతో అల్లుడిని హత్య చేసిన మామకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అల్లుడిని హత్య చేశాడన్న నేరం రుజువు కావడంతో తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన లోకినెడి అక్కిరాజు(మామ)కు జీవిత ఖైదు, రూ.రెండు వేలు జరిమానా విధిస్తూ అమలాపురం రెండో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి బీఎస్వీ హిమబిందు బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. భీమనపల్లి శివారు సంత మార్కెట్ ప్రాంతానికి చెందిన అక్కిరాజు, తన అల్లుడైన ముమ్మిడివరం మండలం క్రాప చింతలపూడికి చెందిన అమలదాసు సత్తి బాబును హత్య చేశాడు. ఆషాఢ మాసంలో అత్తవారింటికి తరచూ రావద్దని పదేపదే చెప్పినా వినకపోవడంతో కోపంతో 2015 జూలై 8న అల్లుడిని కోళ్లను కోసే కత్తితో నరికాడు. అప్పటికి అతడి భార్య దుర్గాభవాని 9వ నెల గర్భిణి. ఈ కేసును అప్పటి ఉప్పలగుప్తం ఏఎస్ఐ బి.జనార్దన్ నమోదు చేయగా రూరల్ సీఐ జి. దేవకుమార్ దర్యాప్తు చేశారని ఉప్పలగుప్తం ఎస్సై బి.రామకృష్ణ తెలిపారు. పీపీ అజయ్‌కుమార్ ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించారు. -
మంత్రి చెబితే అంతేమరి!
సాక్షి, అమరావతి: ఏలేరు రిజర్వాయర్ ఆధునికీకరణ రెండో దశ టెండర్లను తన సన్నిహితుడికి కట్టబెట్టి, రూ.40 కోట్లకు పైగా కమీషన్లు కొల్లగొల్లడానికి కీలక మంత్రి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ పనులకు రూ.200 కోట్లు అంతర్గత అంచనా విలువ(ఐబీఎం)గా నిర్ణయించి శుక్రవారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. బిడ్ దాఖలు చేయడానికి ఈ నెల 25ను తుది గడువుగా నిర్ణయించారు. 26న టెక్నికల్(సాంకేతిక) బిడ్, 30న ప్రైస్(ఆర్థిక) బిడ్ తెరిచి టెండర్లను ఖరారు చేసి, కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించనున్నారు. జలవనరుల శాఖలో ఈపీసీ(ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) విధానంలో నిర్వహించిన టెండర్లలో ఎన్నడూ లేని రీతిలో ఈ టెండర్లలో ఈ నెల 19న ప్రీ బిడ్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించడం గమనార్హం. టెండర్లలో ఎవరూ పాల్గొనకుండా ప్రీ బిడ్ సమావేశంలో బెదిరించి, సన్నిహితునికే పనులు కట్టబెట్టేందుకు కీలక మంత్రి స్కెచ్ వేసినట్లు సమాచారం. సింగిల్ బిడ్‌ను ఆమోదించాలట! తూర్పుగోదావరి జిల్లాలో ఏలేరు రిజర్వాయర్ కింద 67,614 ఎకరాల ఆయకట్టు ఉంది. కాలువలు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారడం వల్ల ఆయకట్టుకు సక్రమంగా నీళ్లందడం లేదు. దాంతో ఏలేరు ఆధునికకీరణ పనులను 2007లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. తొలి దశ పనులకు ఇప్పటికే రూ.102.70 కోట్లు ఖర్చు చేశారు. రెండోదశ కింద రూ.200 కోట్ల అంచనా వ్యయంతో ఆధునికకీరణ పనులకు గతేడాది మార్చి 3న రాష్ట్ర ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పనులను తనకు కావాల్సిన కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకు కీలక మంత్రి వ్యూహం రచించారు. ఈపీసీ విధానంలో గతేడాది పిలిచిన టెండర్లలో ఎవరూ పాల్గొనవద్దంటూ కాంట్రాక్టర్లను బెదిరించారు. దాంతో కీలక మంత్రి సన్నిహితుడు మినహా ఇతరులెవరూ బిడ్లు దాఖలు చేయలేదు. తన సన్నిహితుడు దాఖలు చేసిన సింగిల్ బిడ్‌నే ఆమోదించాలని ఏలేరు రిజర్వాయర్ ఎస్ఈపై మంత్రి ఒత్తిడి తెచ్చారు. దాంతో సింగిల్ బిడ్‌ను ఆమోదించిన ఎస్ఈ.. ఆ పనులు అప్పగించడానికి అనుమతి కోరుతూ హైపవర్ కమిటీకి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆగ్రహం సింగిల్ బిడ్‌ను ఆమోదించాలని ఎలా ప్రతిపాదిస్తారని జలవనరుల శాఖ అధికారులపై హైపవర్ కమిటీ చైర్మన్, సీఎస్ దినేష్‌కుమార్ అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ టెండర్లు నిర్వహించాలని ఆదేశించారు. అక్రమాలకు తాను బాధ్యత వహించలేనని, హైపవర్ కమిటీ నుంచి తనను తప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. దాంతో ఆయనను ప్రభుత్వం ఇటీవల తప్పించింది. ఎల్ఎస్–ఓపెన్ విధానం తరహాలోనే ఈపీసీ విధానంలో నిర్వహించిన టెండర్లను ఖరారు చేసే బాధ్యతను కమిషనరేట్ ఆఫ్ టెండర్స్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చింది. పట్టువదలని అక్రమార్కుడు హైపవర్ కమిటీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని తప్పించిన నేపథ్యంలో సీవోటీకి ప్రతిపాదనలు పంపి.. సన్నిహిత కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని జలవనరుల శాఖపై కీలక మంత్రి ఒత్తిడి తెచ్చారు. నిబంధనల ప్రకారం మళ్లీ టెండర్లు నిర్వహిస్తామని అధికారులు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో తాను సూచించిన కాంట్రాక్టర్‌కే పనులు దక్కేలా నిబంధనలు రూపొందించి, టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. దాంతో అధికారులు విచిత్రమైన నిబంధనలు పెట్టారు. ఒకరి కంటే ఎక్కువ మంది కాంట్రాక్టర్లు జట్టుగా ఏర్పడి(జాయింట్ వెంచర్) టెండర్లలో పాల్గొనడానికి అవకాశం లేదని నిబంధనలు విధిస్తున్న జలవనరుల శాఖ.. ఏలేరు ఆధునికకీరణ టెండర్లలో మాత్రం ముగ్గురు కాంట్రాక్టర్లు జట్టుగా ఏర్పడి బిడ్లు దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. విదేశీ కాంట్రాక్టర్లు బిడ్ దాఖలు చేయడానికి అనర్హులని మెలిక పెట్టింది. మంత్రి బెదిరింపుల నేపథ్యంలో బిడ్లు దాఖలు చేయడానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. మంత్రి సన్నిహిత కాంట్రాక్టర్ మాత్రమే బిడ్ దాఖలు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాత్ర లేకపోవడంతో ఈసారి సింగిల్ బిడ్‌నే ఆమోదించి, సదరు సన్నిహితుడికి పనులు కట్టబెట్టనున్నారు. ఈ వ్యవహారంలో చక్రం తిప్పిన మంత్రికి రూ.40 కోట్లకుపైగా కమీషన్లు ముట్టనున్నట్లు తెలుస్తోంది. -
ఆరో రోజూ జూడాల సమ్మె కొనసాగింపు
సర్పవరం (కాకినాడ సిటీ ): చట్టసభల ద్వారా మెడికల్ రిజిస్ట్రేషన్ యాక్ట్‌ను సవరణ చేయాలని జూని యర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు తీర్చాలని ఆరు రోజులు గా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. పీజీ డాక్టర్ స్నిగ్థ మాట్లాడుతూ 2016లో డిగ్రీ పూర్తి చేసినా ఇంత వరకూ ఏ ఒక్కరికీ ఒరిజనల్ సర్టిఫికెట్ ఇవ్వలేదన్నారు. ఒరిజినల్ సరిఫికెట్ లేనందున పక్క రాష్ట్రంలో పరీక్ష రాయాలంటే ఎన్ఓసీ కావాలంటున్నారన్నారు. దీనివల్ల నీట్ పరీక్ష రాయడానికి ఇబ్బందులు పడుతున్నామని స్నిగ్థ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తప్పనిసరిగా మా డిమాండ్లపై చర్చ జరగాలన్నారు. లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని జుడాలు కోరారు. డాక్టర్లు నరేష్, వందన సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
కారాగారంలో కలకలం
రాజమహేంద్రవరం క్రైం: సెంట్రల్ జైలులో రిమాండు ఖైదీ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. మృతుడి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. కోటనందూరు మండలం, అల్లిపూడికి చెందిన చింతకాయల రవి (21) గంజాయి కేసులో ఈ నెల 10వ తేదీన తుని రూరల్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిని ఆ మర్నాడు సెంట్రల్ జైలుకు రిమాండుకు తరలించారు. శనివారం రాత్రి ఖైదీలను లాకప్‌లో వేస్తుండగా రవి లేనట్టు గార్డులు గుర్తించారు. అతడి కోసం గాలించగా, అదే బ్లాక్ మెట్లపై ఉన్న రేకుల షెడ్డుకు టవల్‌తో ఉరి వేసుకొని కనిపించాడు. హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే రవి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వన్‌టౌన్ సీఐ ఎం.రవీంద్ర, ఎస్సై రాజశేఖర్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురిపై సస్పెన్షన్ వేటు ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు సిబ్బందిని జైలు సూపరింటెండెంట్ ఎం.వరప్రసాద్ సస్పెండ్ చేశారు. చీఫ్ హెడ్ వార్డర్ రమణ, సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించే పవన్, దామోదర్‌తోపాటు, మరో ఇద్దరు సస్పెండైనవారిలో ఉన్నారు. రిమాండు ఖైదీ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని సూపరింటెండెంట్ చెప్పారు. ఎన్నో అనుమానాలు.. రవి ఆత్మహత్యపై అతడి మేనమామ బత్తిన శ్రీను, అల్లిపూడి ఎంపీటీసీ రుత్తల శ్రీనివాస్, మరో మేనమామ, సర్పంచ్ అంకంరెడ్డి సత్యంమూర్తి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రవి ఆత్మహత్యకు పాల్పడేంతటి పిరికివాడు కాదని వారంటున్నారు. వారి కథనం ప్రకారం.. రవి హైదరాబాద్‌లోని ఒక రెస్టారెంట్లో పని చేస్తున్నాడు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి రూ.వెయ్యి తీసుకున్నాడు. హైవే మీదకు వచ్చి హైదరాబాద్ వెళ్లేందుకు కారు ఎక్కాడు. తుని రూరల్ పరిధిలో పోలీసులు కారును ఆపి తనిఖీ చేస్తుండగా, కారుకు సంబంధించినవారు పారిపోయారు. రవి పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిపై గంజాయి రవాణా కేసు నమోదు చేసి జైలులో పెట్టారని వారు చెబుతున్నారు. మరెన్నో ఆరోపణలు ఇదిలా ఉండగా, వారు చెబుతున్నదాని ప్రకారమే.. జైలులో రిమాండు ఖైదీలను ఒక బ్లాక్‌లో ఉంచి, మూడు నాలుగు రోజులు పరిశీలిస్తారు. రవిని చోరీ కేసుల నిందితులను ఉంచిన బ్లాక్‌లో ఉంచారు. అంతేకాకుండా రిమాండు ఖైదీలను జైలులో జరిగే నిర్మాణ పనులకు ఉపయోగించారు. తనకు ఒంట్లో బాగోలేదని అన్న రవిని జైలు అధికారులు వేధించారని అతడి బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో రవి మనస్తాపానికి గురయ్యాడని అంటున్నారు. రవి ఆత్మహత్యపై జైలు అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని, అక్కడి సీసీ కెమెరా ఫుటేజీలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. జైలులో ఉరి వేసుకున్న ప్రాంతం కూడా చేతికి అందేంత ఎత్తులోనే ఉండడంపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బెయిల్ రాదన్న ఒత్తిడితోనే.. రవి ఆత్మహత్యపై జైలు అధికారులు భిన్న కథనం వినిపిస్తున్నారు. గంజాయి కేసులో బెయిల్ రాదనే ఒత్తిడితోనే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని డిప్యూటీ సూపరింటెండెంట్లు రాజారావు, రఘు చెప్పారు. ప్రభుత్వాసుపత్రికి వచ్చిన వారు విలేకర్లతో మాట్లాడుతూ.. గంజాయి కేసులలో సాధారణంగా బెయిల్ రాదని, దీనితో మనస్తాపం చెందిన రవి ఆత్మహత్యకు ప్పాడ్డాడని అన్నారు. సమగ్ర విచారణ జరుపుతాం : సబ్ కలెక్టర్ రవి మృతిపై సమగ్ర విచారణ జరుపుతామని సబ్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ అతడి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వాస్పత్రి మార్చురీలో రవి మృతదేహాన్ని ఆయన పరిశీలించారు. మృతదేహంపై గాయాలు ఉన్నాయా అనే అంశాన్ని బంధువుల సమక్షంలో పరిశీలించారు. వారిని ఓదార్చారు. వారు వ్యక్తం చేసిన అనుమానాలపై సమగ్ర విచారణ జరుపుతామని, సెంట్రల్ జైలులో సీసీ కెమెరా ఫుటేజీలను కూడా పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆసరాగా ఉంటాడనుకుంటే.. అనంత లోకాలకు.. అల్లిపూడికి చెందిన సత్యవతి, కన్నాపాత్రుడు దంపతులకు కుమారుడు రవితోపాటు, ఉమ, మరో కుమార్తె ఉన్నారు. కొంతకాలం క్రితం తండ్రి మృతి చెందడంతో రవి హైదరాబాద్‌లోని ఒక హోటల్లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇప్పుడు అతడి మృతితో తమ కుటుంబం వీధిన పడిందని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు అనంత లోకాలకు వెళ్లిపోయాడంటూ తల్లి సత్యవతి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. -
లారీ బోల్తా : ఒకరి మృతి
ప్రత్తిపాడు: తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్తున్న మేకల లారీ అదుపు తప్పి ప్రత్తిపాడు జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. -
పసిబిడ్డను వదిలించుకోవాలని ఓ అమ్మ ప్రయత్నాలు
-
విద్యార్ధినిని కోర్చిక తీర్చమన్న లెక్చరర్ అరెస్ట్
కాకినాడ: విద్యార్థులు నేర్పించాల్సిన గురువు పెడతోవ పట్టాడు. శిష్యురాలిపై కన్నేసి ఆమెను లైంగికంగా వేధించాడు. నలుగురు విద్యార్థులతో కలిసి ఆమెకు నరకం చూపించాడు. బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో వీరి ఆగడాలకు అడ్డుకట్ట పడింది. కాకినాడ ఐడీఎల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీటెక్ సెకండియర్ చదువుతున్న విద్యార్థినిని వేధిస్తున్న లెక్చరర్, నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ కోర్చిక తీర్చకపోతే చంపేస్తామంటూ బాధితురాలిని బెదిరించారు. చివరకు ఆమె ధైర్యం చేసి టుటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. -
వడగాల్పులకు పిట్టల్లా రాలుతున్న జనం
రాజమండ్రి: మండుతున్న ఎండలు, వడగాల్పులతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అల్లడుతున్నారు. వేడి గాలులకు జనం పిట్టల్లా రాలుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం వడదెబ్బకు 25 మంది మృతి చెందారు. వడగాల్పులు తగ్గకపోవడంతో జిల్లా వ్యాప్తంగా రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో నేడు వడదెబ్బకు 24 మంది మృతి చెందారని జిల్లా కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు. రేపు కూడా వడగాల్పులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. విశాఖపట్నం జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వడదెబ్బకు మాకవరపాలెం మండలంలో ఇద్దరు, నాతవరం మండలంలో ఒకరు మృతి చెందారు. కైలాసపురం దుర్గానగర్‌లో వడదెబ్బకు పద్మా అనే వికలాంగ యువతి ప్రాణాలు విడిచింది. -
రమణమ్మ.. నీదెంత పెద్ద మనసమ్మా!
బొబ్బర లంక: అనుకున్నది సాధించాలంటే ఎంతో ఆత్మవిశ్వాసం... అంతకుమించి దాన్ని సాధించేందుకు ధృడ సంకల్పం అవసరం. సమాజానికి సేవ చేయాలంటే ఎంతో పెద్దమనసు కావాలి. బతుకుదెరువు కోసం చిరువ్యాపారం చేసుకునే ఓ వృద్ధురాలు తోటి ప్రజల కోసం తను కూడబెట్టినదంతా కరిగించింది. సేవ చేయాలంటే అధికారమో, డబ్బో అవసరంలేదని సాటి మనిషికి సాయమందించాలనే తాపత్రయం ఉంటే చాలని చాటిచెప్పింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బర లంకలో నివసించే రమణమ్మ... చిరుతిళ్లు, గుగ్గిళ్లు, ఒడియాలు అమ్ముకుంటూ జీవిస్తోంది. భర్త వదిలేయడంతో అక్క, తమ్ముళ్లతో కాలం వెళ్లదీసేది. ఒక్కరోజూ చేసే పనికి దూరమయ్యేది కాదు రమణమ్మ. చిన్న సంఘటనతో తమ్ముడు ఆమెను విడిచి ఎక్కడికో వెళ్లిపోయాడు. తమ్ముడికోసం ఏళ్ల తరబడి ఎదురు చూసింది. అతడు మాత్రం తిరిగిరాలేదు, ఏమయ్యాడో తెలియలేదు. ఎండైనా...వానైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా గుగ్గిళ్లు, ఒడియాలు అమ్మడం మానలేదు రమణమ్మ. రాజమండ్రిలోని గౌతమీ జీవకారుణ్య సంఘానికి విరాళంగా ఇస్తే... పిల్లలకు భోజనం పెడతారని ఎవరో చెప్పారామెకు. తాను కూడబెట్టిన డబ్బులో 30వేలు ఆ సంస్థకు విరాళంగా ఇచ్చేసింది. గ్రామంలో చిరుతిళ్లు అమ్మే వృద్ధురాలు 30 వేలు ఓ సంస్థకు విరాళం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రమణమ్మ ఆశయం అక్కడితో ఆగిపోలేదు. మళ్లీ రూపాయి, రూపాయి కూడబెట్టడం మొదలు పెట్టింది. లక్షరూపాయలు వరకూ కూడబెట్టింది. గ్రామపెద్దను కలిసి, ఊళ్లో బస్టాపు నిర్మించాలని కోరింది. ఆమె ఆశయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. రెక్కలు ముక్కలు చేసుకుని తమ కళ్లముందు కష్టపడిన వృద్ధురాలు గ్రామానికి చేస్తున్న సహాయం చూసి చలించిపోయారు. ఆమె కోరిక మేరకు ఒక్క పైసా వృథా కాకుండా గ్రామంలో బస్టాప్ నిర్మించారు. జీవితమంతా కష్టపడి సంపాదించిన సొమ్ముతో నిర్మించిన బస్టాండుకు తాను ఎంతగానో అభిమానించిన తమ్ముడి పేరు పెట్టుకుంది రమణమ్మ. జీవిత చరమాంకంలో తనకుంటూ పైసా కూడా ఉంచుకోకుండా గ్రామంకోసం ఖర్చుపెట్టడంపై ఆనందంవ్యక్తం చేస్తోంది. ఎండలో ప్రయాణికులు ఇబ్బందిపడకుండా ఉండేందుకే బస్ షెల్టర్ ఏర్పాటు చేశానని చెపుతోంది. ఏడుపదులు పైబడిన వయసులోనూ రమణమ్మ తన పనులు తానే చేసుకుంటోంది. ఒంటరిగా జీవిస్తూ గ్రామంలో తిరుగుతూ చిరుతిళ్లు అమ్ముతూనే ఉంది. ప్రభుత్వం నుంచి పెన్షన్ వస్తుంది కదా ఎందుకింకా కష్టపడతావని ఆమెను అడిగితే ఒకటే సమాధానం చెపుతుంది. పని చేయడం తనకు అలవాటని డబ్బు కూడపెడితే మరో మంచి పనికి ఆవి పనికి వస్తాయంటోంది. ఆమె ఆశయానికి గ్రామస్థులు కూడా సహకరిస్తున్నారు. ఏ ఆధారం లేని ఆ వృద్ధురాలికి అండగా ఉంటున్నారు. ఎదుటివారికి సహాయం చేయాలనే ఆలోచన ఏ కొద్దిమందికో ఉంటుంది. ఆలోచన వచ్చినా ఆచరణలో ఎందుకొచ్చిన కష్టంలే అని వదిలేసేవారే ఎక్కువమంది. కానీ వయసు మీదపడుతున్నా శరీరం సహకరించకున్నా ఇతరుల కోసం జీవితం ధారపోసే రమణమ్మలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. అలాంటి వారికి ఆమె ఆదర్శనమడంలో సందేహం లేదు. -
‘బాబుగారి’ మాటలకు అర్థాలే వేరులే..!
కాకినాడ: చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని తెలుగుదేశం పార్టీ అధినేత వ్యవహార శైలి చెప్పకనే చెబుతోంది. ప్రజల సమక్షంలో, వారి అభిప్రాయాలను తీసుకుని అభ్యర్థిని ప్రకటిస్తానని పాలమూరు ప్రజాగర్జన సభలో చంద్రబాబు ప్రకటించారు. కానీ, దీనికి భిన్నంగా వలస వచ్చిన నేతలు తమకు తామే అభ్యర్థులమంటూ ప్రకటించుకుంటున్నారు. విభజన నిర్ణయం తీసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానంటూ గొప్పలకు పోయిన మాజీమంత్రి తోట నరసింహం.. మాట మార్చి తన మామ, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు దౌత్యం తో ఇటీవల చంద్రబాబు పంచన చేరారు. టీడీపీలో చేరిన అనంతరం మంగళవారం తొలిసారిగా జగ్గంపేట చేరిన ఆయన కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. కాకినాడ నుంచి పార్లమెంటుకు తాను, జగ్గంపేట నుంచి అసెంబ్లీకి జ్యోతుల చంటిబాబు పోటీ చేస్తారని ప్రకటించుకున్నారు. జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, మెట్ల సత్యనారాయణరావు సమక్షంలోనే ఆయన చేసిన ఈ ప్రకటన తెలుగు తమ్ముళ్ల మధ్య చిచ్చురేపింది. కాంగ్రెస్ నుంచి వచ్చీరాగానే తనకు తానుగా అభ్యర్థినని ప్రకటించుకునే అధికారం తోటకు చంద్రబాబు ఇచ్చారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని జగ్గంపేట, కొత్తపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లో పార్టీ జెండాను భుజాన మోస్తోన్న పాతకాపులను పక్కన పెట్టి అడ్రస్ లేక కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన వారికి టికెట్లు కట్టబెడుతున్న బాబు తీరును పార్టీ శ్రేణులు ఆక్షేపిస్తున్నాయి. జగ్గంపేట నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి జ్యోతుల చంటిబాబుకు జెల్లకొట్టి.. అక్కడి నుంచి బొటాబొటీ మెజార్టీతో బయటపడ్డ తోట నరసింహానికి టికెట్టు ఖాయం చేద్దామని చంద్రబాబు అనుకున్నారు. దీనిని పసిగట్టిన తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. హైదరాబాద్‌లో నరసింహం ఇటీవల సైకిల్ ఎక్కిన సమయానికి నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు నిర్ణయంపై భగ్గుమన్నారు. గత రెండుసార్లు అంతంతమాత్రం మెజార్టీతో గెలుపొంది ప్రజల ఆశలకు తగ్గట్టుగా అభివృద్ధి చేయలేక వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి వ్యక్తికి చంటిబాబును పక్కన పెట్టి జగ్గంపేట టికెట్టు ఏ ప్రాతిపదికన ఇవ్వాలనుకుంటున్నారో 24 గంటల్లోగా చెప్పాలని పార్టీ నాయకులు అల్టిమేటమ్ ఇచ్చారు. గత రెండు ఎన్నికల్లో పార్టీ కోసం లక్షలు తగలేసుకుని తిరుగుతున్న చంటిబాబుకంటే నరసింహం ఎందులో ఎక్కువనేది చెప్పాలంటూ బాబు తీరును తూర్పారబట్టారు. దీంతో దిగొచ్చిన చంద్రబాబు జగ్గంపేట టికెట్టును చంటిబాబుకు ఇచ్చేందుకు అంగీకరించారని సమాచారం. మరోపక్క ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ టికెట్టుపై ఆశతో ఏడాది కాలంగా ప్రముఖ విద్యా సంస్థల అధినేత పోతుల విశ్వం లక్షలు ఖర్చు చేస్తున్నారు. తోటకు ఈ టికెట్టు ఇచ్చేస్తే విశ్వం పరిస్థితి ఏమిటని ఆయన అనుచర వర్గం మండిపడుతోంది. పార్టీ అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ప్రజల సమక్షంలోనే చేస్తానంటున్న చంద్రబాబు మాటలు కేవలం ప్రచారార్భాటానికే పరిమితమా? అని పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ యనమల రామకృష్ణుడు జగ్గంపేట బీసీలకు కేటాయిస్తారనుకుని టీడీపీలో చేరామని, ఇప్పుడు ఇలా చేయడం ద్వారా పార్టీ శ్రేణులకు ఏమని సంకేతాలు ఇస్తున్నారో చెప్పాలని జగ్గంపేట అసెంబ్లీ టికెట్టు ఆశించిన పల్లా సత్యనారాయణ, కాకినాడ పార్లమెంటు సీటు ఆశించిన పోతుల విశ్వం వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. బీసీలకు పార్టీలో సముచిత స్థానం, చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తానని బాబు చెప్పారు. కానీ.. జిల్లాలో ఆ వర్గానికి ఇవ్వాల్సిన రామచంద్రపురం, కొత్తపేట నియోజకవరా్గాలను వలస వచ్చిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, బండారు సత్యానందరావులకు ప్రకటించారు. దీనిపై కూడా పార్టీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. కొత్తపేట సీటు ఆశించిన బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యానికి మొండిచేయి చూపడంపై బీసీ సామాజికవర్గం మండిపడుతోంది. మరోపక్క రామచంద్రపురం టికెట్టు ఆశించి, భంగపడిన కట్టా సూర్యనారాయణ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్సీపీలో ఇటీవల చేరారు. -
జగ్గంపేట టీడీపీలో ముసలం
జగ్గంపేట: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట టీడీపీలో ముసలం రాజుకుంది. మాజీ మంత్రి తోట నర్సింహంను పార్టీలో చేర్చుకోవడాన్ని తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తోట నర్సింహంకు జగ్గంపేట సీటిస్తే టీడీపీ తరపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు. ఇన్నాళ్లు టీడీపీ వ్యతిరేకంగా పనిచేసిన నర్సింహంను ఇప్పుడు ఎలా పార్టీలో చేర్చుకుంటారని జగ్గంపేట టీటీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 2014 ఎన్నికలే కాదు 2019 ఆ తర్వాత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుండే పోటీ చేసి గెలుస్తానని నరసింహం గొప్పలు పోయిన విషయాన్ని వారు గుర్తు చేశారు. తోట నర్సింహంకు జగ్గంపేట సీటిస్తే అంగీకరించేది లేదని తెగేసి చెప్పారు. -
మన తలరాతను మార్చే ఎన్నికలివి: జగన్
-
మన తలరాతను మార్చే ఎన్నికలివి: వైఎస్ జగన్
రామచంద్రాపురం: మరో 45 రోజుల్లో జరగనున్న ఎన్నికలు మన తలరాతను మార్చేవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మా గుండె లోతుల్లో దివంగత నేత వైఎస్ఆర్ ఉన్నారని ప్రతి ఒక్కరూ చెబుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో జరిగిన రోడ్డు షోలో జగన్ ప్రసంగించారు. రాముడి పాలనను చూడలేదు కానీ...రాజశేఖరుని సువర్ణయుగాన్ని చూశామన్నారు. ఇప్పటికీ బాబు భయానక పాలన గుర్తుకు వస్తోందన్నారు. చంద్రబాబు ఆల్ ఫ్రీ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. రైతు రుణాలు మాఫీ చేస్తానని, ఉచిత విద్యుత్ ఇస్తానని బాబు ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. ఓట్ల కోసం చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తానంటున్నారని తెలిపారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కాబట్టి... లేనిపోని హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ప్రతి పిల్లవాడ్ని తాను చదివిస్తానని వైఎస్ జగన్ హామీయిచ్చారు. రాష్ట్ర చరిత్రను మార్చే ఐదు సంతకాలు చేస్తానని చెప్పారు. అమ్మఒడి పథకం అమలుపై తొలి సంతకం చేస్తానన్నారు. అవ్వా, తాతల జీవితాలకు ఊరటనిచ్చేలా రెండో సంతకం, రైతన్న ఇంట వెలుగు నిండేలా మూడో సంతకం చేస్తానని చెప్పారు. పల్లెలకు స్వయంపాలనపై మరో సంతకం చేస్తానని వైఎస్ జగన్ అన్నారు. -
సీటు రాకుంటే అమ్మేసుకున్నట్టా?
కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీటు వస్తే ఎమ్మెల్యే అయిపోతామనే నమ్మకంతో ఉండి.. తీరా సీటు రాకపోయేసరికి అమ్మేసుకుంటున్నారని విమర్శలు చేయడం వారి ఆవివేకాన్ని తెలియజేస్తోందని పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్, మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణంరాజు విమర్శించారు. సోమవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం నార్కెడమిల్లిలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, దివంగత మాజీ ఎమ్మెల్యే చిర్ల సోమసుందరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తనను కలసిన విలేకర్లతో ఇందుకూరి మాట్లాడుతూ, జగన్మోహన్రెడ్డి సీటు ఇస్తే ఎమ్మెల్యే అయిపోదామనే భావనలో ఉన్నవారికి అవకాశాలు రాకపోవడంతో చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడైన బుచ్చిమహేశ్వరరావు సీట్లు బేరం పెడుతున్నారనడాన్ని రామకృష్ణంరాజు తీవ్రంగా ఖండించారు. బుచ్చిమహేశ్వరరావు అమలాపురం ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఆశించగా, జగన్మోహన్రెడ్డి అతనికి టిక్కెట్టు ఇస్తామని ఏ నాడూ చెప్పని విషయం ఆయనకు తెలియంది కాదని చెప్పారు. తాను చైర్మన్‌గా ఉన్న క్రమశిక్షణ కమిటీలో సభ్యుడైన బుచ్చిమహేశ్వరరావు ఎంపీ టిక్కెట్టు ఇవ్వకపోవడం, ఎమ్మెల్యే సీటు బాబూరావుకు ఇస్తున్నారని తెలియజేయగా, సమర్థత, స్థానిక పరిస్థితుల ఆధారంగా కేటాయిస్తున్న విషయం తెలియచేసి భవిష్యత్‌లో జగన్మోహన్రెడ్డి సముచితస్థానం కల్పిస్తారని చెప్పానన్నారు. సరేనన్న బుచ్చిమహేశ్వరరావు ఇంతలోనే అసత్య ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. ఆయన వెనుక జగన్మోహన్రెడ్డి అంటే గిట్టని పార్టీల నాయకులు ఉండి అలా మాట్లాడించినట్టుగా ఉందన్నారు. ఒక్కో నియోజకవర్గంలో నలుగురైదుగురు ఆశావహులు టిక్కెట్లు ఆశిస్తుండగా, అందరికీ సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండదనే విషయం రాజకీయాలతో సంబంధం ఉన్నవారికి తెలియంది కాదన్నారు. ఆ నలుగురైదుగురిలో ఒకరికి కేటాయిస్తే మిగిలినవారు తమ భవిష్యత్ కోల్పోతామనే బాధతో పార్టీపైనా, జగన్మోహన్రెడ్డిపైనా అవాకులు, చవాకులు పేలడం వారి దిగజారుడుతనాన్ని చెప్పకనే చెపుతోం దని రామకృష్ణంరాజు విమర్శించారు. సమర్థులు, స్థానిక పరిస్థితులు, సామాజిక సమతూకాల ఆధారంగానే సీట్లపై జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పారు. -
బుచ్చయ్యా.. ఇదేం పనయ్యా?
చదివేస్తే ఉన్న మతి పోయిందన్న చందంగా తయారయింది మన రాజకీయ నాయకుల తీరు. ప్రజలకు మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయకూడన్న ప్రాథమిక సూత్రాన్ని మన నేతాశ్రీలు ఎప్పుడో మర్చిపోయారు. ఎన్నికల జాతరలో ఖర్చు చేసిన సొమ్ములను నొల్లుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్న నేతాగణం వైఖరి విస్మయపరుస్తోంది. స్వప్రయోజనాల కోసం పేదల కడుపు కొట్టేందుకు కూడా వెనుకాడకపోవడం చూస్తుంటే రాజకీయ నాయకులు ఎంతగా దిగజారిపోతున్నారో అర్థమవుతోంది. ఆధిప్య పోరుతో అమాయకుల జీవితాలతో చెలగాటం ఆడేందుకు కూడా సందేహించడం లేదు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తాజాగా జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. పేదలకు ఇళ్లు కేటాయించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వీరంగం ఆడడంతో స్థానికులు అవాక్కయ్యారు. ఆధిపత్యం కోసం పేదల చిరకాల స్వప్నాన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యేను ఆహ్వానించలేదన్న అక్కసుతో తన అనుచురులతో కలిసి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కుట్ర చేశారు. అటు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు కూడా తానేం తక్కువ తినలేదన్నట్టుగా వ్యవహరించారు. తమ సొంతింటి కలను భగ్నం చేయడానికి వచ్చిన బుచ్చయ్య చౌదరిపై బడుగులు భగ్గుమన్నారు. తమ పాలిట సైంధవుడిలా మారిన గోరంట్ల, ఆయన అనుచరులపై విరుచుకుపడ్డారు. రాళ్లతో తరిమి కొట్టారు. మహిళలు చెప్పులు చూపిస్తూ శాపనార్థాలు పెట్టారు. రోడ్డు మీది దుమ్మెత్తి పోశారు. ఈ పరిణామాన్ని ఊహించని గోరంట్ల మ్లానవదనంతో, అవమానభారంతో అక్కడి నుంచి ఉడాయించాల్సి వచ్చింది. అయితే తనకడ్డొచ్చిన మహిళలను తోసుకుంటూ గోరంట్ల పలాయనం చిత్తగించారు. మహిళలు అని కూడా చూడకుండా పక్కకు గెంటేసి పారిపోయారు. పిల్లిని కూడా గదిలో బంధించి కొడితే పులిలా తిరగబడుతుందంటారు. పేదవాడు కన్నెర్ర చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో రాజమండ్రి ఘటన కళ్లకు కట్టింది. తమ కష్టార్జితాన్ని తక్కువ చేసి చూస్తే సహించబోమని చాటారు. తమకు మంచి చేయకపోయిన ఫర్వాలేదు గాని, చెడు చేసేందుకు ప్రయత్నిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని చెప్పకనే చెప్పారు. గతంలో ఎన్నడూ చోటు చేసుకోని ఈ పరిణామం నేతలకు వణుకు పుట్టించగా, జనంలో వచ్చిన కొత్త చైతన్యాన్ని చాటి చెప్పింది. ప్రజాగ్రహం ముందు ఎంతటి నాయకుడైనా తలవంచాల్సిందేనని నిరూపిస్తోందీ ఘటన. -
చైల్డ్ స్నాచింగ్; తల్లి చేతుల్లో నుంచి బిడ్డ అపహరణ
రాజమండ్రి: తల్లి చేతుల్లో ఉన్న బిడ్డను దుండగులు గుంజుకుని ఎత్తుకుపోయిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి మున్సిపల్ కాలనీలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం వివరాలు ఇలా ఉన్నాయి. సీతానగరం మండలం బొబ్బిలిలంకకు చెందిన నెర్లగంటి శ్రీను, అతని భార్య వెంకటలక్ష్మి తలవెంట్రుకలు కొని, అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి రెండేళ్ల వయసున్న బాబు ఉన్నాడు. మంగళవారం సాయంత్రం శ్రీను దంపతులు రోడ్డుపై వెళుతుండగా ఓ వ్యక్తి, ఓ మహిళ మోటార్ సైకిల్‌పై వారిని వెంబడించారు. రెండు వీధులు తిరిగాక బైక్‌పై వెనుక కూర్చున్న మహిళ వెంకటలక్ష్మి గుండెలకు హత్తుకుని ఉన్న బాబును గుంజుకుంది. అనంతరం వేగంగా అక్కడినుంచి పరారయ్యారు. శ్రీను దంపతులు అరుస్తూ వెంటబడ్డా ఫలితం లేకపోయింది. దీనిపై బాధితులు బుధవారం త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ట్రైనింగ్ డీఎస్పీ కొల్లి శ్రీనివాస్, సీఐ రమేష్‌లను కోరారు. -
రైతులకు రూ.4,765 కోట్ల రుణాలు: విశ్వరూప్
ఖరీఫ్, రబీ సీజన్లో తూర్పుగోదావరి జిల్లా రైతులకు రూ.4,765 కోట్ల రుణాలు మంజూరు చేయనున్నట్టు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ తెలిపారు. ఖరీఫ్‌లో రూ. 2859 కోట్లు, రబీలో రూ. 1907 కోట్లు రుణాలుగా ఇవ్వనున్నట్టు ఆయన వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ఆయన జాతీయ పతకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఇప్పటికే రూ.2,120 కోట్ల రుణాలు మంజూరు చేసినట్టు తెలిపారు. వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన 3,11,856 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చామన్నారు. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీని జమ చేశామని విశ్వరూప్ వివరించారు.