
కూరగాయలు విక్రయిస్తూ నిరసన
సర్పవరం (కాకినాడ సిటీ ): చట్టసభల ద్వారా మెడికల్ రిజిస్ట్రేషన్ యాక్ట్‌ను సవరణ చేయాలని జూని యర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు తీర్చాలని ఆరు రోజులు గా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. పీజీ డాక్టర్ స్నిగ్థ మాట్లాడుతూ 2016లో డిగ్రీ పూర్తి చేసినా ఇంత వరకూ ఏ ఒక్కరికీ ఒరిజనల్ సర్టిఫికెట్ ఇవ్వలేదన్నారు. ఒరిజినల్ సరిఫికెట్ లేనందున పక్క రాష్ట్రంలో పరీక్ష రాయాలంటే ఎన్‌ఓసీ కావాలంటున్నారన్నారు. దీనివల్ల నీట్ పరీక్ష రాయడానికి ఇబ్బందులు పడుతున్నామని స్నిగ్థ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తప్పనిసరిగా మా డిమాండ్లపై చర్చ జరగాలన్నారు. లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని జుడాలు కోరారు. డాక్టర్లు నరేష్, వందన సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment