judas strike
-
ఓ వైపు జూడాల సమ్మె.. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్ : ఓ వైపు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె నిర్వహిస్తుండగా.. మరో వైపు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు మెడికల్ కాలేజీల అభివృద్ది కోసం భారీ మొత్తంలో నిధుల్ని మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వుల్ని జారీ చేసింది. తెలంగాణ మెడికల్ కాలేజీలలో సివిల్ వర్క్ కోసం రూ.204కోట్లు నిధులను విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఇందులో భాగంగా ఉస్మానియా మెడికల్ కాలేజీ కోసం రూ.121 కోట్లు, గాంధీ మెడికల్ కాలేజీ కోసం రూ. 79 కోట్లు, హనుమకొండ కాకతీయ మెడికల్ కాలేజ్ కోసం రూ. 6 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఆయా మెడికల్ కాలేజీలలో హాస్టల్స్ నిర్మాణల కోసం రూ.204 కోట్ల నిధులను విడుదల చేస్తూ జీవో విడుదల చేసింది. -
జూడాల మధ్య చిచ్చుపెట్టిన సమ్మె విరమణ!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె.. వాళ్లలో వాళ్లకే చిచ్చు రాజేసింది. జూడాలు రెండుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్నారు. సమ్మె విరమించినట్లు జూడాల ప్రెసిడెంట్ ప్రకటించిన వేళ.. ఉస్మానియా జూడాలు మాత్రం సమ్మె కొనసాగుతోందని ప్రకటించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.తెలంగాణలో జూడాల సమ్మె విరమణ.. గాంధీ ఆస్పత్రి వర్సెస్ ఉస్మానియా ఆస్పత్రి జూనియర్ డాక్టర్ల అంశంగా మారిందిప్పుడు. బోధనాసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం నిధుల విడుదల, కాకతీయ యూనివర్సిటీ రోడ్ల మరమ్మత్తుల నిధుల విడుదల బోధనాసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం నిధులు విడుదల.. ఈ రెండు హామీలతో సమ్మె విరమిస్తున్నట్లు(తాత్కాలికంగానే) జూనియర్ డాక్టర్ల ప్రెసిడెంట్ ప్రకటించారు.అయితే.. ప్రభుత్వం ముందు ఎనిమిది డిమాండ్లు ఉంచామని, అందులో కేవలం రెండు డిమాండ్లను మాత్రమే ప్రభుత్వం అంగీకరిస్తే సమ్మె ఎలా విరమిస్తారని ఉస్మానియా జూనియర్ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు గాంధీ ఆస్పత్రి జూడాలు ప్రభుత్వానికి లొంగిపోయారంటూ ఆరోపిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం తమ ప్రధాన డిమాండ్ అని, ప్రభుత్వం నుంచి ఈ డిమాండ్‌పై స్పష్టమైన హామీ వచ్చేదాకా యధావిధిగా సమ్మె కొనసాగిస్తామని వారంటున్నారు.ఈ క్రమంలో జూడా జనరల్ సెక్రటరీ ఉస్మానియా జూడాలకు మద్దతుగా నిలవడంతో.. ఈ వ్యవహారం ఏ మలుపు తిరగబోతుందా? అనే ఆసక్తి నెలకొంది. -
జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలం
-
సమ్మె చేయడం మంచిది కాదు
-
తెలంగాణ లో ఆందోళన బాటలో జూనియర్ డాక్టర్లు
-
జూడాల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్లు (జూడాలు) సమ్మె విరమించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం తీసుకొచ్చిన జాతీయ మెడికల్ కమిషన్ చట్టపై కొద్ది రోజులుగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జూడాలు, ఐఎంఏ ప్రతినిధులు వైద్య సేవలు నిలిపేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఆరోగ్యశ్రీ రోగులు మొదలు అనేక మంది రోగులు వైద్యం అందక ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం సచివాలయంలో జూడాల నేతలతో చర్చలు జరిపారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌తో తాను జరిపిన చర్చల గురించి జూడాలకు వివరించారు. దేశవ్యాప్తంగా డాక్టర్లు సమ్మె విరమించుకున్నారని చెప్పారు. తెలంగాణలోనే సమ్మె చేయడం వల్ల రోగులకు ఇబ్బంది తప్ప ఏ ప్రయోజనం లేదని స్పష్టంచేశారు. సమ్మె విరమించాలని, ఎన్‌ఎంసీపై ఉన్న అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, సవరణలు చేసేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఎన్ఎంసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించడంతో చట్టమైంది. పార్లమెంట్ సమావేశాలు కూడా ముగియడంతో సమ్మె కొనసాగించడం వల్ల లాభం లేదని భావించిన జూడాలు వెనక్కు తగ్గారు. తాము చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు జూడా అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ విజయేందర్ ప్రకటించారు. శనివారం నుంచి విధులకు హాజరవుతామన్నారు. సెలవు రోజులైనా ఓపీ సేవలు చేస్తామన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. వైద్య రంగంలో వస్తున్న పరిణామాలపై మంత్రి ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. జూడాలతో చర్చల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఒకప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ అన్ని రకాల రోగాలకు వైద్యం చేసేవారని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. ఎన్నో స్పెషల్ కోర్సులు చేయాల్సి వస్తోందని, దీంతో వైద్య విద్యార్థులపై ఎంతో భారం పడుతోందన్నారు. -
స్తంభించిన వైద్యసేవలు
సాక్షి, హైదరాబాద్ : వైద్యుల సమ్మెతో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లోనూ వైద్యసేవలు స్తంభించిపోయాయి. జూడాలకు మద్దతుగా సీనియర్ వైద్యులు కూడా సమ్మెలో పాల్గొనడంతో ఆయా ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ సేవలు నిలిచిపోగా, గురువారం జరగాల్సిన పలు చికిత్సలు వాయిదా పడ్డాయి. అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం సుదూర ప్రాంతాల నుంచి ఆయా ఆస్పత్రులకు చేరుకున్న రోగులు.. వైద్యసేవలు అందక నిరాశతో వెనుతిరగాల్సి వచ్చింది. నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును (ఎన్ఎంసీ) వ్యతిరేకిస్తూ గురువారం తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీఎస్ జూడా) ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద తెలంగాణ వైద్య మహగర్జన నిర్వహించారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్ సహా నగరంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని జూనియర్, కొంత మంది సీనియర్ వైద్యులు ఈ మహాగర్జనలో పాల్గొన్నారు. ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిల్లును రద్దుచేయాలని డిమాండ్ చేశారు. మహాగర్జనకు హాజరైన ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ నాగేశ్వర్, సీనీ హీరో జీవితా రాజశేఖర్, మాజీ జేడీ లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాది రచన తదితరులు వైద్యులకు సంఘీభావం ప్రకటించారు. ఢిల్లీలో కూర్చొని నియంత్రణా?: కోదండరాం ఢిల్లీలో ఎవరో కూర్చుని ఇక్కడ వైద్య వ్యవస్థను నియంత్రించడం ఎంతవరకు సమంజసమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ప్రశ్నించారు. ఈ బిల్లును మార్చే వరకు ఊరుకోబోమని హెచ్చరించారు. సినీనటులు జీవితారాజశేఖర్ దంపతులు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీకి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఐదేళ్లు చదివి పరీక్ష రాసి పాసైన విద్యార్థులకు మరోసారి ఎగ్జిట్ పరీక్ష పెట్టడం దారుణమన్నారు. -
జూడాల ఆందోళన ఉద్రిక్తం
లబ్బీపేట (విజయవాడ తూర్పు)/సాక్షి, అమరావతి/తిరుపతి తుడా: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్సీ)ను రద్దు చేయాలని కోరుతూ విజయవాడలో జూనియర్ వైద్యులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆరు రోజులుగా ప్రభుత్వాస్పత్రి, వైద్య కళాశాల ప్రాంగణంలో నిరసనలు తెలుపుతున్న జూడాలు బుధవారం జాతీయ రహదారిపైకి వచ్చి మహానాడు రోడ్డు జంక్షన్‌ను దిగ్బంధం చేశారు. వారి ఆందోళన అర్ధగంటకు పైగా సాగడంతో నాలుగు వైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ట్రాఫిక్ సమస్య దృష్ట్యా ఆందోళన విరమించాలని కోరారు. అందుకు జూడాలు నిరాకరించడంతో బలవంతంగా వాహనాల్లో ఎక్కించి భవానీపురం, వన్‌టౌన్ పోలీసుస్టేషన్లకు తరలించారు. ఆ క్రమంలో ఓ జూడాపై డీసీపీ హర్షవర్ధన్ దురుసుగా ప్రవర్తిస్తూ చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఐఎంఏ ప్రతినిధుల సంప్రదింపులు ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ టీవీ రమణమూర్తి, డాక్టర్ మనోజ్ తదితరులు వన్‌టౌన్, భవానీపురం పోలీసుస్టేషన్లకు వెళ్లి జూడాలను వదిలివేయాలని కోరారు. వారి భవిష్యత్‌తో కూడిన అంశం కావడంతో ఆందోళన చేస్తున్నారని తెలిపారు. ట్రాఫిక్ సమస్య సృష్టించాలని కానీ, ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం వారికి లేదని చెప్పడంతో కొద్దిసేపటి తర్వాత జూడాలను పోలీసులు వదిలివేశారు. అనంతరం ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న జూడాలు.. తమ పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసు అధికారి క్షమాపణ చెప్పాలంటూ నిరసన దీక్షకు దిగారు. జూడాలను బూట్ కాలితో తన్నుతున్న టీటీడీ వీజీవో అశోక్‌కుమార్ గౌడ్ మంత్రి, కార్యదర్శులకు వినతిపత్రాలు ఎన్ఎమ్సీని రద్దు చేసి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరించాలనే డిమాండ్‌తో కూడిన వినతిపత్రాలను జూనియర్ వైద్యుల సంఘ ప్రతినిధులు సచివాలయంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణప్రసాద్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డికి సమర్పించారు. అలిపిరి వద్ద ఆందోళన.. రసాభాస ఎన్ఎమ్సీ బిల్లుకు వ్యతిరేకంగా తిరుపతిలో జూడాలు చేపట్టిన ఆందోళన రసాభాసగా మారింది. భక్తులు తిరుమలకు వెళ్లే అలిపిరి మార్గంలో రాస్తారోకో నిర్వహించడంతో మూడు గంటల పాటు రాకపోకలు ఆగిపోయాయి. దీంతో పోలీసులు, టీటీడీ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ అధికారులు అక్కడకు చేరుకుని జూడాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఓ వైపు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో సహనం నశించి భక్తులు వైద్య విద్యార్థులతో గొడవకు దిగారు. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ అధికారి అశోక్‌కుమార్ గౌడ్ వైద్య విద్యార్థిపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు కాలితో తన్నడంతో ఒక్కసారిగా జూడాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ అధికారి చర్యలకు నిరసనగా మరోసారి ఆందోళనకు దిగారు. ఎంతకీ వినకపోవడంతో వారిని అరెస్టు చేసి ఎమ్మార్పల్లిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌కు తరలించారు. -
ఆరో రోజూ జూడాల సమ్మె కొనసాగింపు
సర్పవరం (కాకినాడ సిటీ ): చట్టసభల ద్వారా మెడికల్ రిజిస్ట్రేషన్ యాక్ట్‌ను సవరణ చేయాలని జూని యర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు తీర్చాలని ఆరు రోజులు గా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. పీజీ డాక్టర్ స్నిగ్థ మాట్లాడుతూ 2016లో డిగ్రీ పూర్తి చేసినా ఇంత వరకూ ఏ ఒక్కరికీ ఒరిజనల్ సర్టిఫికెట్ ఇవ్వలేదన్నారు. ఒరిజినల్ సరిఫికెట్ లేనందున పక్క రాష్ట్రంలో పరీక్ష రాయాలంటే ఎన్ఓసీ కావాలంటున్నారన్నారు. దీనివల్ల నీట్ పరీక్ష రాయడానికి ఇబ్బందులు పడుతున్నామని స్నిగ్థ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తప్పనిసరిగా మా డిమాండ్లపై చర్చ జరగాలన్నారు. లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని జుడాలు కోరారు. డాక్టర్లు నరేష్, వందన సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్యశాఖ నిర్ణయం.. హౌస్సర్జన్లకు శాపం
కోర్సుకాలం పొడిగింపుతో పీజీ ప్రవేశ పరీక్షకు అనర్హత 600 మంది విద్యార్థులు దూరమయ్యే ప్రమాదం ఉమ్మడి పరీక్షతో ఏపీ సహా ప్రైవేటు వైద్య విద్యార్థులకే లాభం జూడాల డిమాండ్లపై కొనసాగుతోన్న జాప్యం... భద్రత నిర్ణయం గాలికి సాక్షి, హైదరాబాద్: జూడాలు రెండు నెలలపాటు చేసిన సమ్మె కాలాన్ని వారి కోర్సు కాలంలో అదనంగా కలుపుతూ వైద్య విద్యా శాఖ ఇచ్చిన ఉత్తర్వులు వైద్య విద్యార్థులకు శరాఘాతంగా మారాయి. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ చేస్తున్న వారికి, పీజీ చివరి సంవత్సరం చేస్తున్న వారికి నష్టం కలిగిస్తుంది. ఎంబీబీఎస్ పూర్తయి హౌస్ సర్జన్లో ఉన్న విద్యార్థులకు మార్చి ఒకటో తేదీన పీజీ ప్రవేశ పరీక్ష ఉంది. వైద్య విద్యాశాఖ కోర్సు కాలం పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఉస్మానియా, గాంధీ, వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్‌కు చెందిన 600 మంది హౌస్‌సర్జన్ విద్యార్థులు అర్హత కోల్పోతారు. ఒకటో తేదీ దగ్గర పడుతున్నా వైద్యవిద్యాశాఖ అధికారులు మాత్రం పొడిగింపు ఉంటుందని... ఏమాత్రం వెనక్కు తగ్గేది లేదని తెగేసి చెపుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రెండు రాష్ట్రాలకు కలిపి ప్రవేశ పరీక్ష ఉంటున్నందున ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు, మొత్తం ప్రైవేటు కాలేజీ వైద్య విద్యార్థులు ముందుకు పోతారని... తాము పొందాల్సిన పీజీ సీట్లు వారు దక్కించుకుంటారని జూడా నేతలు ఆవేదన చెందుతున్నారు. ఇదిలావుంటే వైద్య పీజీ కోర్సు మే నెలలో పూర్తి కావాలి. ప్రభుత్వ నిర్ణయంతో జూలైలో పూర్తికానుంది. పీజీ తర్వాత సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్ష ఉంటుంది. పొడిగింపు వల్ల ఆ పరీక్షకు అర్హత కోల్పోతామన్న భయాందోళనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కలగజేసుకొని ఈ ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని, సమ్మె కాలాన్ని హాజరైనట్లుగా గుర్తించాలని జూడాల రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాస్ కోరుతున్నారు. స్టైఫెండ్ ఏరియర్స్‌పై అస్పష్టత జూడాల ఐదు కీలక డిమాండ్లలో ప్రభుత్వం నాలుగింటిని ఒప్పుకుంది. ఆ డిమాండ్లకు సంబంధించిన ఫైలు ఆర్థికశాఖ నుంచి సీఎం వద్దకు వెళ్లింది. దాదాపు నెల రోజులు కావస్తున్నా ఆ ఫైలుపై సంతకం కాలేదు. ప్రధానంగా 15 శాతం స్టైఫెండ్ పెంచాలన్న డిమాండ్ కూడా ప్రభుత్వం ఒప్పుకున్న దాంట్లో ఉంది. వాస్తవంగా గత ఏడాది జనవరి నుంచి ఈ పెంపుతో స్టైఫెండ్ రావాలి. అప్పటినుంచి ఏరియర్స్ ఇవ్వాలి. కానీ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం వెలువడ లేదు. దీనిపై ఇటీవల వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డిని జూడా నేతలు కలిశారు. పరిష్కరిస్తామని చెప్పారు గాని ఆచరణకు నోచుకోలేదని విమర్శిస్తున్నారు. అలాగే జూడాలపై ఇటీవలి కాలంలో దాడులు పెరిగాయని, భద్రత కోసం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
జూడాల సమ్మె ప్రజా వ్యతిరేకమా?
బోధనాసుపత్రుల్లోని ‘మౌలిక సదుపాయాల గురించి మీకెందుకు?’ అంటారు. కనీస సౌకర్యాలు కల్పిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది రోగులకు వైద్యం అందించవచ్చంటున్నాం. ఇది ప్రజారోగ్యంతో ముడిపడిన సమస్యా? జూడాల స్వార్థమా? ఏడాదికి ఒక టైనీతో గడిపేస్తే... గ్రామాలకు క్వాలిఫైడ్ డాక్టర్ల ైవె ద్య సేవలు నిలకడగగా అందేదెన్నడు? ‘‘ప్రభుత్వం లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్న జూనియర్ డాక్టర్లు పేద లకు, గ్రామీణ ప్రజలకు వైద్యం చేయడానికి ఇష్టప డక సమ్మె చేస్తున్నార’ని ప్రభుత్వం అసత్య ప్రచా రం చేస్తోంది. నిజానికి జూడాల ప్రధాన డిమాండ్లన్నీ పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సదుపాయాలను అందించ డానికి తోడ్పడేవే. బోధన ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలను కల్పిస్తేనే జూడాలు నాణ్యమైన వైద్యా న్ని నేర్చుకుని, మెరుగైన సేవలను అందించగ లుగుతారు. ఏళ్ల తరబడి జూడాలు ఇదే విషయాన్ని ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటున్నారు. సమ్మెలకు దిగుతున్నారు. పరిస్థితి మారడం లేదు. ఎమర్జెన్సీ విభాగంలో రోగిని పరీక్షించడానికి పట్టే సమయమే కీలకమైనది. తీవ్రమైన కడుపునొప్పితో వచ్చిన రోగికి పేగు పూతా? లేక పాంక్రియాస్ గ్రంధి ఇన్ఫెక్షనా? నిర్ధారించుకోవాలంటే హైదరాబాద్ లోని ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ ఆసు పత్రుల్లోనే సౌకర్యాలు లేవు. ల్యాబ్‌లు 24 గంటలు అందుబాటులో ఉండవు. బయట చేయించడాన్ని అంగీకరించరు. దీంతో ప్రాణాపాయస్థితిలోని రోగు లకు సైతం వైద్యం అందించలేని దుస్థితిలో జూడాలు పనిచేయాలి. రోగికి జరగరానిది ఏదైనా జరిగితే తన్నులు తినాలి! వారు వైద్యం నేర్చుకుం టున్న విద్యార్థులేనని చాలా మందికి తెలియదు. ఇకపోతే ‘మౌలిక సదుపాయాల సమస్య మీకెం దుకు?’ అంటారు. బోధనాసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కాదు, కనీస సౌకర్యాలు కల్పిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది రోగులకు మంచి వైద్య సేవలు అందించవచ్చని అంటున్నాం. ఇది ప్రజారోగ్యంతో ముడిపడిన సమస్యా? జూడాల స్వార్థమా? 2003లో ఆనాటి ప్రభుత్వం పేదలే ఎక్కువగా వచ్చే ప్రభుత్వ ఆసుపత్రుల్లో యూజర్ చార్జీలను ప్రవేశపెట్టింది. ఓపీ చీటికి రూ.10, ఎక్స్‌రేకు రూ.50, సాధారణ ప్రసవానికి రూ.1000, సిజేరియనయితే రూ. 1,500 చార్జీలుగా నిర్దేశిం చారు. 40 రోజుల సమ్మె పోరాటంతో జూడాలు వాటిని రద్దు చేయించారు. కాబట్టే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేటికీ ఉచిత వైద్యం అందుతోంది. ప్రభుత్వ వైద్య సేవలను పేదలకు అందరానివిగా చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా జూడాలు ఇప్పుడు కూడా పోరాడుతున్నారు. జూడాల సమ్మెను ప్రజా వ్యతిరేకమైనదిగా చూపే అస్త్రంగా మారిన ‘‘తప్పనిసరి గ్రామీణ సర్వీసు’’ జాతీయ వైద్య విద్యామండలి (ఎమ్సీఐ) మార్గదర్శకాల్లో లేనిది. ‘విధానపరమైన నిర్ణయ’మంటూ దాన్ని రుద్దుతున్నా జూడాలు దాన్ని పూర్తిగా వ్యతిరేకించడం లేదు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ట్రైనీ జూడాలను ఏడాదికి ఒకరిని చొప్పున పంపుతూ గడిపేస్తే... గ్రామీణ ప్రజలకు క్వాలిఫైడ్ డాక్టర్ల నాణ్యమైన ైవె ద్యసేవలు నిలకడగగా అందేదెన్నడు? ఏడాదికొకరుగా వచ్చే ట్రైనీల మాట పీహెచ్‌సీల్లోని నాలుగో తరగతి సిబ్బంది సైతం లెక్క చేయరు. ఇక జూడాలకు గ్రామీణ శిక్షణ పచ్చి బూటకం. ఏ సదుపాయాల్లేని ఆసుపత్రుల్లో ట్రైనీయే ఏకైక డాక్టరయితే శిక్షణను ఇచ్చేదెవరు? ఉద్దేశాలేవైనా ఇదంతా పేద రోగులు ఉచిత ప్రజా వైద్యసేవల పట్ల విముఖులై, ఖరీదైన ప్రైవేటు వైద్యసేవలను ఆశ్రయించేందుకే దారి తీస్తుంది. కోర్సు పూర్తయ్యాక రెగ్యులర్ డాక్టర్లుగా, సౌకర్యాలు గల గ్రామీణ ఆసుపత్రుల్లో నియమించాలని జూడాలు కోరడం ఏలికలకు గొంతెమ్మ కోరికనిపిస్తోంది! జూడాల సమ్మెను విమర్శిస్తున్నవారు అవే సమస్యలపై వారు మళ్లీ మళ్లీ ఎందుకు సమ్మె చేయాల్సి వస్తుందో ఆలోచించ కపోవడం శోచనీయం. 2006లో కోఠీ ఆసుపత్రిలో ఒక జూనియర్ డాక్టర్‌పై స్థానిక ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేయగా... స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు రక్షణ కల్పిస్తామన్నారు. అదేమీ లేదు సరికదా కొన్ని ఆసుపత్రుల్లో పోలీసు ఔట్ పోస్టులే లేవు. అలాంటిదే స్టయిపెండ్ సమస్య. ఎయిమ్స్ వంటి చోట్ల జూడాలకు రూ. 50-60 వేల స్టయిపెండ్ ఇస్తుంటే, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు సైతం రూ.40, 50 వేలు ఇస్తున్నాయి. ఒక జోన్లో ఒకే స్టయిపెండ్ అని ఎమ్సీఐ నిర్దేశన. కానీ హైదరాబాద్‌లోని నిమ్స్‌లో రూ. 45 వేలు ఇస్తుంటే... ఉస్మానియా, గాంధీల్లో నెలకు రూ.23 వేలు! ఈ అంతరాన్ని పూడ్చమనడం తప్పా? ఇచ్చేదేదో ఏ ఆరు నెల్లకో కాక నెల నెలా ఇవ్వమ నడం తప్పా? 2012 జూడాల ఆమరణ నిరాహార దీక్ష శిబిరానికి వచ్చిన చంద్రబాబు నాయుడు, కె. చంద్రశేఖరరావులు ఇద్దరూ అధికా రంలోకి రాగానే రూ.40వేలు స్టయిపెండ్ ఇస్తామని హామీ ఇచ్చిన వారే! ఈ సమస్యలపైనే గాక మెడికల్ జర్నల్స్, స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ ఫండ్, హెల్త్ ఇన్సూరెన్స్ తదితర డిమాండ్లపై సైతం 2012 సమ్మె సందర్భంగా ప్రభుత్వం ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. జూనియర్ డాక్టర్లు కోరుతున్నది ఒక్కటే...ఆ ఒప్పందంలోని హామీలను నెరవేర్చా లని. తెలంగాణ, ఏపీ జూడాల సమస్యలు, డిమాం డ్లు ఒక్కటే. అందుకే ఏపీలో కూడా జూడాలు సమ్మెకు సన్నాహాలు చేస్తున్నారు. -పి.ఫణి మహేష్‌రెడ్డి,(వ్యాసకర్త జూనియర్ డాక్టర్ల సంఘం మాజీ అధ్యక్షులు)