జూడాల సమ్మె ప్రజా వ్యతిరేకమా? | judas strike, does it public against protest? | Sakshi
Sakshi News home page

జూడాల సమ్మె ప్రజా వ్యతిరేకమా?

Published Tue, Nov 4 2014 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM

జూడాల సమ్మె ప్రజా వ్యతిరేకమా?

జూడాల సమ్మె ప్రజా వ్యతిరేకమా?

బోధనాసుపత్రుల్లోని ‘మౌలిక సదుపాయాల గురించి మీకెందుకు?’ అంటారు. కనీస సౌకర్యాలు కల్పిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది రోగులకు వైద్యం అందించవచ్చంటున్నాం. ఇది ప్రజారోగ్యంతో ముడిపడిన సమస్యా? జూడాల స్వార్థమా? ఏడాదికి ఒక టైనీతో గడిపేస్తే... గ్రామాలకు క్వాలిఫైడ్ డాక్టర్ల ైవె ద్య సేవలు నిలకడగగా అందేదెన్నడు?
 
 ‘‘ప్రభుత్వం లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్న జూనియర్ డాక్టర్లు పేద లకు, గ్రామీణ ప్రజలకు వైద్యం చేయడానికి ఇష్టప డక సమ్మె చేస్తున్నార’ని ప్రభుత్వం అసత్య ప్రచా రం చేస్తోంది. నిజానికి జూడాల ప్రధాన డిమాండ్లన్నీ పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సదుపాయాలను అందించ డానికి తోడ్పడేవే. బోధన ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలను కల్పిస్తేనే జూడాలు నాణ్యమైన వైద్యా న్ని నేర్చుకుని, మెరుగైన సేవలను అందించగ లుగుతారు. ఏళ్ల తరబడి జూడాలు ఇదే  విషయాన్ని ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటున్నారు. సమ్మెలకు దిగుతున్నారు. పరిస్థితి మారడం లేదు. ఎమర్జెన్సీ విభాగంలో రోగిని పరీక్షించడానికి పట్టే సమయమే కీలకమైనది.

 

తీవ్రమైన కడుపునొప్పితో వచ్చిన రోగికి పేగు పూతా? లేక పాంక్రియాస్ గ్రంధి ఇన్‌ఫెక్షనా? నిర్ధారించుకోవాలంటే హైదరాబాద్ లోని ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ ఆసు పత్రుల్లోనే సౌకర్యాలు లేవు. ల్యాబ్‌లు 24 గంటలు అందుబాటులో ఉండవు. బయట చేయించడాన్ని అంగీకరించరు. దీంతో ప్రాణాపాయస్థితిలోని రోగు లకు సైతం వైద్యం అందించలేని దుస్థితిలో జూడాలు పనిచేయాలి. రోగికి జరగరానిది ఏదైనా జరిగితే తన్నులు తినాలి! వారు వైద్యం నేర్చుకుం టున్న విద్యార్థులేనని చాలా మందికి తెలియదు. ఇకపోతే ‘మౌలిక సదుపాయాల సమస్య మీకెం దుకు?’ అంటారు. బోధనాసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కాదు, కనీస సౌకర్యాలు కల్పిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది రోగులకు మంచి వైద్య సేవలు అందించవచ్చని అంటున్నాం. ఇది ప్రజారోగ్యంతో ముడిపడిన సమస్యా? జూడాల స్వార్థమా?  


  2003లో ఆనాటి ప్రభుత్వం పేదలే ఎక్కువగా వచ్చే ప్రభుత్వ ఆసుపత్రుల్లో యూజర్ చార్జీలను ప్రవేశపెట్టింది. ఓపీ చీటికి రూ.10, ఎక్స్‌రేకు రూ.50, సాధారణ ప్రసవానికి రూ.1000, సిజేరియనయితే  రూ. 1,500 చార్జీలుగా నిర్దేశిం చారు. 40 రోజుల సమ్మె పోరాటంతో జూడాలు వాటిని రద్దు చేయించారు. కాబట్టే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేటికీ ఉచిత  వైద్యం అందుతోంది. ప్రభుత్వ వైద్య సేవలను పేదలకు అందరానివిగా చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా జూడాలు ఇప్పుడు కూడా పోరాడుతున్నారు. జూడాల సమ్మెను ప్రజా వ్యతిరేకమైనదిగా చూపే అస్త్రంగా మారిన  ‘‘తప్పనిసరి గ్రామీణ సర్వీసు’’ జాతీయ వైద్య విద్యామండలి (ఎమ్‌సీఐ) మార్గదర్శకాల్లో లేనిది. ‘విధానపరమైన నిర్ణయ’మంటూ దాన్ని రుద్దుతున్నా జూడాలు దాన్ని పూర్తిగా వ్యతిరేకించడం లేదు.

 

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ట్రైనీ జూడాలను ఏడాదికి ఒకరిని చొప్పున పంపుతూ గడిపేస్తే... గ్రామీణ ప్రజలకు క్వాలిఫైడ్ డాక్టర్ల నాణ్యమైన ైవె ద్యసేవలు నిలకడగగా అందేదెన్నడు? ఏడాదికొకరుగా వచ్చే ట్రైనీల మాట పీహెచ్‌సీల్లోని నాలుగో తరగతి సిబ్బంది సైతం లెక్క చేయరు. ఇక జూడాలకు గ్రామీణ శిక్షణ పచ్చి బూటకం. ఏ సదుపాయాల్లేని ఆసుపత్రుల్లో ట్రైనీయే ఏకైక డాక్టరయితే శిక్షణను ఇచ్చేదెవరు? ఉద్దేశాలేవైనా ఇదంతా పేద రోగులు ఉచిత ప్రజా వైద్యసేవల పట్ల విముఖులై, ఖరీదైన ప్రైవేటు వైద్యసేవలను ఆశ్రయించేందుకే దారి తీస్తుంది. కోర్సు పూర్తయ్యాక రెగ్యులర్ డాక్టర్లుగా, సౌకర్యాలు గల గ్రామీణ ఆసుపత్రుల్లో నియమించాలని జూడాలు కోరడం ఏలికలకు గొంతెమ్మ కోరికనిపిస్తోంది!
 
 జూడాల సమ్మెను విమర్శిస్తున్నవారు అవే సమస్యలపై వారు మళ్లీ మళ్లీ ఎందుకు సమ్మె చేయాల్సి వస్తుందో ఆలోచించ కపోవడం శోచనీయం. 2006లో కోఠీ ఆసుపత్రిలో ఒక జూనియర్ డాక్టర్‌పై స్థానిక ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేయగా... స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు రక్షణ కల్పిస్తామన్నారు. అదేమీ లేదు సరికదా కొన్ని ఆసుపత్రుల్లో పోలీసు ఔట్ పోస్టులే లేవు. అలాంటిదే స్టయిపెండ్ సమస్య. ఎయిమ్స్ వంటి చోట్ల జూడాలకు రూ. 50-60 వేల స్టయిపెండ్ ఇస్తుంటే, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు సైతం రూ.40, 50 వేలు ఇస్తున్నాయి.
 
 ఒక జోన్లో ఒకే స్టయిపెండ్ అని ఎమ్‌సీఐ నిర్దేశన. కానీ హైదరాబాద్‌లోని నిమ్స్‌లో రూ. 45 వేలు ఇస్తుంటే... ఉస్మానియా, గాంధీల్లో నెలకు రూ.23 వేలు! ఈ అంతరాన్ని పూడ్చమనడం తప్పా? ఇచ్చేదేదో ఏ ఆరు నెల్లకో కాక నెల నెలా ఇవ్వమ నడం తప్పా?  2012 జూడాల ఆమరణ నిరాహార దీక్ష శిబిరానికి వచ్చిన చంద్రబాబు నాయుడు, కె. చంద్రశేఖరరావులు ఇద్దరూ అధికా రంలోకి రాగానే రూ.40వేలు స్టయిపెండ్ ఇస్తామని హామీ ఇచ్చిన వారే! ఈ సమస్యలపైనే గాక మెడికల్ జర్నల్స్, స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ ఫండ్, హెల్త్ ఇన్సూరెన్స్ తదితర డిమాండ్లపై సైతం 2012 సమ్మె సందర్భంగా ప్రభుత్వం ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. జూనియర్ డాక్టర్లు కోరుతున్నది ఒక్కటే...ఆ ఒప్పందంలోని హామీలను నెరవేర్చా లని. తెలంగాణ, ఏపీ జూడాల సమస్యలు, డిమాం డ్లు ఒక్కటే. అందుకే ఏపీలో కూడా జూడాలు సమ్మెకు సన్నాహాలు చేస్తున్నారు.
 
 -పి.ఫణి మహేష్‌రెడ్డి,(వ్యాసకర్త జూనియర్ డాక్టర్ల
 సంఘం మాజీ అధ్యక్షులు)

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement