
సాక్షి,హైదరాబాద్ : ఓ వైపు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మె నిర్వహిస్తుండగా.. మరో వైపు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా పలు మెడికల్ కాలేజీల అభివృద్ది కోసం భారీ మొత్తంలో నిధుల్ని మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వుల్ని జారీ చేసింది. తెలంగాణ మెడికల్ కాలేజీలలో సివిల్ వర్క్ కోసం రూ.204కోట్లు నిధులను విడుదల చేస్తూ జీవో జారీ చేసింది.
ఇందులో భాగంగా ఉస్మానియా మెడికల్ కాలేజీ కోసం రూ.121 కోట్లు, గాంధీ మెడికల్ కాలేజీ కోసం రూ. 79 కోట్లు, హనుమకొండ కాకతీయ మెడికల్ కాలేజ్ కోసం రూ. 6 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఆయా మెడికల్ కాలేజీలలో హాస్టల్స్ నిర్మాణల కోసం రూ.204 కోట్ల నిధులను విడుదల చేస్తూ జీవో విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment