
సాక్షి, హైదరాబాద్: దళితబంధు పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గానికి ప్రభుత్వం మరో రూ.200 కోట్లు మంగళవారం విడుదలచేసింది. మొత్తం మూడు దఫాలుగా ఇప్పటివరకు రూ.1,200 కోట్లు విడుదల చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గానికి దాదాపు రూ.2,000 కోట్లు అవసరమని ప్రభుత్వ అంచనా.