
అన్నవరం దేవస్థానం (పాత ఫొటో)
సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి పాలక మండలిని రాష్ట్ర ప్రభుత్వం నియమించించింది. ఆలయానికి కొత్త ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి వి. ఉషారాణి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు, ఆలయ ప్రధాన అర్చకుడితో పాటు 16 మందికి ఈ ట్రస్ట్ బోర్డులో అవకాశం కల్పించారు. ప్రభుత్వం గుర్తించిన వ్యవస్థాపక కుటుంబ సభ్యులు చైర్మన్‌గా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు పాలక మండలిలో కొనసాగుతారని స్పష్టం చేశారు. ప్రధాన అర్చకుడు ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా ఉంటారని తెలిపారు. కాగా, ఇప్పటికే విజయవాడ, ద్వారకా తిరుమల, సింహాచలం దేవస్థానాలకు నూతన పాలక మండళ్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. (చదవండి: ప్రముఖ ఆలయాలకు పాలకమండళ్లు)
అన్నవరం దేవస్థానం పాలకమండలి సభ్యులు వీరే..
1. వ్యవస్థాపక కుటుంబ సభ్యులు (చైర్మన్)
2. సాధు దుర్గ
3. కర్రి భామిరెడ్డి
4. కలగా రామజోగేశ్వర శర్మ
5. వాసిరెడ్డి జగన్నాథం
6. నత్రా మహేశ్వరి
7. గాదె రాజశేఖరరెడ్డి
8. చిట్టూరి సావిత్రి
9. అప్పారి లక్ష్మి
10. ముత్యాల వీరభద్రరావు
11. మోకా సూర్యనారాయణ
12. చాగంటి వెంకట సూర్యనారాయణ
13. ములికి సూర్యవతి
14. బి. ఆశాలత
15. కర్రా వెంటకలక్ష్మి
16. కొండవీటి సత్యనారాయణ (ప్రధాన అర్చకుడు)
Comments
Please login to add a commentAdd a comment