పొగమంచు ఎఫెక్ట్: 69 రైళ్లు ఆలస్యం
ఢిల్లీ: దట్టమైన పొగమంచు కారణంగా పలు రైళ్ల సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీకి 69 రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, మరో 16 రైళ్ల వేళలలో మార్పులు చేశారు. కాగా, 4 రైళ్ల సర్వీసులను రైల్వే అధికారులు రద్దుచేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఉదయం రన్ వే సరిగా కనిపించడం లేని అధికారులు చెప్పారు. పొగమంచు కారణంగా 9 అంతర్జాతీయ, 3 డొమెస్టిక్ విమాన సర్వీసులు ఆలస్యం కానున్నాయి. ఒక అంతర్జాతీయ, రెండు డొమెస్టిక్ విమాన సర్వీసులను రద్దు చేశారు. గత కొన్ని రోజులనుంచి పలు ఢిల్లీ రైలు సర్వీసులకు, విమాన సర్వీసులకు సమస్యలు తలెత్తుతున్న విషయం తెలిసిందే.