విశాఖపట్నం: హర్యానాలో జాట్ల ఉద్యమం హింసాత్మకంగా మారడం రైల్వే అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. గత కొన్ని రోజులుగా రిజర్వేషన్ల కోసం ఆందోళన బాట పట్టిన జాట్ ఆందోళనకారులు ఉద్యమాన్ని తీవ్రతరం చేసి రైల్వే స్టేషన్లు, రైళ్లు, బస్సులు, సంస్థలకు నిప్పుపెట్టి విధ్వంస సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ అధికారులు ప్రకటించారు.
రద్దయిన రైలు సర్వీసులు:
రేపు (సోమవారం) ఉదయం 8:20 గంటలకు బయలుదేరాల్సిన 12803 విశాఖ - నిజాముద్దీన్ స్వర్ణజయంతి ఎక్స్ ప్రెస్ రద్దు
ఈ నెల 23న రాత్రి 11:50 గంటలకు బయలుదేరాల్సిన 18507 విశాఖ - అమృత్ సర్ హీరాకుడ్ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
జాట్ల ఆందోళన... పలు రైళ్ల రద్దు
Published Sun, Feb 21 2016 6:56 PM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM
Advertisement
Advertisement