డేరా హింస: పలు రైళ్లు రద్దు | List of trains cancelled today due to Dera violence | Sakshi
Sakshi News home page

డేరా హింస: పలు రైళ్లు రద్దు

Published Sat, Aug 26 2017 4:37 PM | Last Updated on Tue, Sep 12 2017 1:02 AM

List of trains cancelled today due to Dera violence

న్యూఢిల్లీ: డేరా చీఫ్‌ గుర్మీత్‌ రాం రహీం సింగ్‌ అనుచరుల హింసాత్మక చర్యల నేపథ్యంలో వందలాది సంఖ్యలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. శాంతి భద్రతలకు దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ నుంచి హర్యానా, పంజాబ్‌ వైపు వెళ్లే 309 రైళ్లను, అలాగే, హర్యానా వైపు వెళ్లే 294 ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేశామని ఉత్తర రైల్వే తెలిపింది. దీంతో పాటు 58 రైళ్లను దారి మళ్లించినట్లు వివరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement