సాక్షి, హైదరాబాద్: నిర్వహణపరమైన కారణాలు, ఒడిశాలో రైలు ప్రమాద ఘటన దృష్ట్యా ఈ నెల 7 నుంచి 13 వరకు పలు రైళ్లను రద్దుచేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ–నిజామాబాద్ (07596), నిజామాబాద్–కాచిగూడ (07593), నాందేడ్–నిజామాబాద్ (07854), నిజామాబాద్–నాదేడ్ (07853) రైళ్లను ఈ నెల 7 నుంచి 13 వరకు రద్దుచేసినట్టు పేర్కొన్నారు.
కాచిగూడ–షాలిమార్–వాస్కోడిగామా (17603/18047), షాలిమార్–హైదరాబాద్ (18045/18046) రైళ్లు ఈ నెల 7న రద్దు కానున్నాయి. వాస్కోడిగామా–షాలిమార్–కాచిగూడ (18048/17604) రైలు 9వ రద్దు కానుంది. దౌండ్–నిజామాబాద్ (11409), నిజామాబాద్–పంఢర్‌పూర్ (01413) రైళ్లను ముద్ఖేడ్–నిజామాబాద్ మధ్య పాక్షికంగా రద్దుచేశారు.
ప్రత్యేక రైళ్ల పొడిగింపు
వేసవి రద్దీ దృష్ట్యా కాచిగూడ–తిరుపతి (070 61 / 07062), కాచిగూడ–కాకినాడ (07417 / 07418), కాచిగూడ–నర్సాపూర్ (07653 / 07654) ప్రత్యేక రైళ్లను ఈ నెల 30 వరకు పొడిగించనున్నట్లు సీపీఆర్వో తెలిపారు.
బెంగళూరు ఎక్స్‌ప్రెస్ చక్రాలకు మంటలు
బాలానగర్: కాచిగూడ నుంచి బెంగళూరు వెళ్లే బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం సాయంత్రం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ స్టేషన్‌లో 16 నిమిషాలు ఆగింది. 8.26 గంటలకు బాలానగర్‌కు వచ్చిన రైలు 8.43 గంటలకు తిరిగి బయలుదేరింది. రైల్లో ఎక్కువ మోతాదులో స్పార్క్స్ (మంటలు) రావడంతో ముందు జాగ్రత్తగా రైలును బాలానగర్‌లో నిలిపినట్లు సమాచారం.
ట్రైన్ బ్రేకులు వేసిన సమయంలో వీల్స్‌లో స్పార్క్స్ వచ్చాయని, సాధారణంగా చిన్నపాటి స్పార్క్స్ వస్తుంటాయన్నారు. లోకో పైలెట్ 16 నిమిషాలపాటు వాటిని సరిచేసుకుని బయలుదేరి వెళ్లారు. దీంతో కాచిగూడ టు కర్నూలు టౌన్ ట్రైన్‌కు సైతం అరగంట అంతరాయం కలిగినట్లు ప్రయాణికులు చెప్పారు. దీనికితోడు బాలానగర్ రైల్వేస్టేషన్‌లో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో స్టేషన్‌లో అంధకారం నెలకొంది.
చదవండి: Telangana: కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం తీపికబురు
Comments
Please login to add a commentAdd a comment