తిరుపతి : జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు కట్టలు నిండిపోవడంతోపాటు పొంగి పొర్లుతూ ప్రమాద స్థితికి చేరుకున్నాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు మరి కొద్దిసేపట్లో తిరుపతి నుంచి మచిలీపట్నం వెళ్లాల్సిన మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్, తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. ఈ మేరకు తిరుపతి రీజియన్ ఆఫీసర్ కుప్పాల సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.