చెన్నైలో భారీవర్షాలు, పలు రైళ్లు రద్దు
చెన్నై : తమిళనాడులో భారీ వర్షాలు, వరదలు కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించక పోవడంతో దక్షిణ రైల్వే అధికారులు పలు రైలు సర్వీసులను రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు. చెన్నై-గూడూరు మధ్య పలుచోట్ల రైల్వే బ్రిడ్జ్లపై నీళ్లు నిలిచి, ప్రమాద స్థాయికి చేరుకోవడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. గత కొద్దిరోజులుగా తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే.
రద్దయిన రైళ్ల వివరాలు:
*ట్రయిన్ నెంబర్-17644: కాకినాడ-చెన్నై ఎగ్మూర్ ఎక్స్ప్రెస్
*12604: హైదరాబాద్-చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్
*12760: హైదరాబాద్-చెన్నై సెంట్రల్-చార్మినార్ ఎక్స్ప్రెస్
*17652 : కాచిగూడ-చెన్నై ఎగ్మూర్ ఎక్స్ప్రెస్
*16031: చెన్నై సెంట్రల్- శ్రీ మాతా వైష్ణోదేవి కత్రా అండమాన్ ఎక్స్ప్రెస్
*12621: చెన్నైసెంట్రల్-న్యూఢిల్లీ తమిళనాడు ఎక్స్ప్రెస్
*12840: చెన్నై సెంట్రల్- హౌరా మెయిల్
*12842: చెన్నై సెంట్రల్- హౌరా కోరమండల్ ఎక్స్ప్రెస్
*12656: చెన్నై సెంట్రల్- అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్ప్రెస్
*22611: చెన్నై సెంట్రల్- న్యూ జల్పైగురి ఎక్స్ప్రెస్
*22403: పుదుచ్చేరి-న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్
దారి మళ్లించిన రైళ్లు...
12898: భువనేశ్వర్- పుదుచ్చేరి ఎక్స్ప్రెస్...
12507: త్రివేండ్రం సెంట్రల్- గౌహతి ఎక్స్ప్రెస్
16351: సీఎస్టీ ముంబయి-నాగర్ కోయిల్ ఎక్స్ప్రెస్
తాత్కాలికంగా రద్దు అయిన రైళ్లు...
* 12711 - విజయవాడ-చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్ప్రెస్ (గూడూరు వరకు మాత్రమే)
* 12712 - చెన్నై సెంట్రల్ - విజయవాడ పినాకిని (చెన్నై నుంచి గూడురు వరకూ రద్దు)