తీరాన్నితాకిన తీవ్ర వాయుగుండం
చెన్నై : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం 'రోవన్' సోమవారం తమిళనాడులోని కడలూరు వద్ద తీరాన్ని తాకింది. కాగా తీరం దాటేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. గంటకు 60 నుంచి 70 మైళ్ల వేగంతో బలమైన గాలులు వీస్తుండటంతోపాటు అవి శీతల గాలులు కావడంతో ప్రజలు బాగా ఇబ్బందులకు గురవుతున్నారు. మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా రోవన్ ప్రభావం కనిపిస్తోంది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశ ఉంది. తీవ్ర వాయుగుండం కారణంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులుతో కూడిన వర్షం కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలాగే తిరుపతి, తిరుమలలోనూ భారీ వర్షం కురుస్తోంది. రెండో ఘాట్ రోడ్డులో పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి.