విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు | Many trains passing through Vijayawada have been cancelled | Sakshi
Sakshi News home page

విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

Published Thu, May 16 2024 5:49 AM | Last Updated on Thu, May 16 2024 6:45 AM

Many trains passing through Vijayawada have been cancelled

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): విజయ­వాడ, గుంటూరు డివిజన్‌లలో జరుగుతున్న ట్రాక్‌ నిర్వహణ పనుల కారణంగా ఆయా మార్గాల్లో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ డివిజన్‌ పీఆర్‌ఓ నుస్రత్‌ మండ్రూప్కర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

ఈనెల 15 నుంచి 26 వరకు రాజమండ్రి–విజయవాడ (07466/07467), నర్సాపూర్‌–నిడదవోలు (07897/07771), నర్సాపూర్‌–విజయవాడ (17270/07862), నర్సాపూర్‌–రాజమండ్రి (07883/07884), విశాఖపట్నం–గుంటూరు (22701/22702/­17239) రైళ్లు,  16 నుంచి 27 వరకు విశాఖపట్నం–గుంటూరు (17240),  16 నుంచి 31 వరకు నర్సాపూర్‌–గుంటూరు (17282), 17 నుంచి జూన్‌ 1 వరకు గుంటూరు–నర్సాపూర్‌ (17281), 16 నుంచి 31 వరకు హుబ్లీ–విజయవాడ (17329),  17 నుంచి జూన్‌ 1 వరకు విజయవాడ–హుబ్లీ (17330) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. అదే విధంగా రామవరప్పాడు–నర్సాపూర్‌ (07861) రైలును భీమవరం–నర్సాపూర్‌ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement