ప్రయాణికులకు అలర్ట్‌.. విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు | Many trains passing through Vijayawada have been cancelled | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు అలర్ట్‌.. విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

Published Sun, Jan 21 2024 5:11 AM | Last Updated on Sun, Jan 21 2024 11:32 AM

Many trains passing through Vijayawada have been cancelled - Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ):  దక్షిణ మధ్య రైల్వే విజయ­వాడ డివిజన్‌లో చేపట్టనున్న ట్రాక్‌ నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లు పూర్తిగాను, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసి, కొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు విజయవాడ డివిజన్‌ పీఆర్‌వో నుస్రత్‌ మండ్రుప్కర్‌ శనివారం తెలిపా­రు. ఈ నెల 29– ఫిబ్రవరి 25 వరకు గుంటూరు–విశాఖ (17239/17240), కాకినాడ పోర్టు–విశాఖ (172­67­/­17268), మచిలీపట్నం–విశాఖ (17219/17220), గుంటూరు–రాయగఢ్‌ (17243/ 17244), బిట్రగుంట–విజయవాడ (07977/ 07978) రైళ్లు రద్దయ్యాయి.

బిట్రగుంట–చెన్నై సెంట్రల్‌ (17237/17238) రైళ్లు ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు, 5 నుంచి 9 వరకు, 12 నుంచి 16 వరకు, 19 నుంచి 23 వరకు రద్దు చేశారు. అలాగే, ఈ నెల 29– ఫిబ్రవరి 25 వరకు మచిలీపట్నం–విజయవాడ (07896/07769), నర్సాపూర్‌–విజయవాడ (07863), విజయవాడ–మచిలీపట్నం (07866), మచిలీపట్నం–విజయవాడ (07770), విజయవాడ–భీమవరం జంక్షన్‌ (07283), మచిలీపట్నం–విజయవాడ (07870), విజయవాడ–నర్సాపూర్‌ (07861) రైళ్లు రామవరప్పాడు నుంచి బయలుదేరి, తిరుగు ప్రయాణంలో కూడా ఈ స్టేషన్‌ వరకే నడవనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement