భారీ వర్షాలతో పలు రైళ్ల రద్దు | trains cancelled due to heavy rains | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలతో పలు రైళ్ల రద్దు

Published Mon, Oct 28 2013 8:41 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM

trains cancelled due to heavy rains

భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్ మీదకు నీళ్లు రావడంతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సోమవారం నాడు బయల్దేరాల్సిన ఈ రైళ్ల సర్వీసులను రద్దుచేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి కె.సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...

చెన్నైలో ఉదయం 8.45 గంటలకు బయల్దేరాల్సిన నెం. 12842 చెన్నై- హౌరా కోరమాండల్ ఎక్స్ప్రెస్ రద్దయింది.

చెన్నైలో రాత్రి 9.40 గంటలకు బయల్దేరాల్సిన నెం. 12840 చెన్నై- హౌరా మెయిల్ రద్దయింది.

తిరుపతిలో రాత్రి 7.55కు బయల్దేరాల్సిన తిరుపతి - కోల్కతా సంత్రాగచి ఎక్స్ప్రెస్ రద్దయింది.

కోల్కతా షాలిమార్లో ఉదయం 11 గంటలకు బయల్దేరాల్సిన కోల్కతా షాలిమార్ - యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ రద్దయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement