
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు, నిర్వహణాపనుల కారణంగా పలు రైళ్లు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం పట్నా నుంచి బయలుదేరిన పట్నా– ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశామన్నారు. నిర్వహణాపనుల వల్ల విజయవాడ–మచిలీపట్నం ప్యాసింజర్ ఈనెల 20 నుంచి 31 వరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈనెల 21 నుంచి సెప్టెంబరు 1 వరకు మచిలీపట్నం– విజయవాడ ప్యాసింజర్ రైలును మచిలీపట్నం– గుడివాడ పరిధిలో రద్దు చేశామన్నారు. మరోవైపు మచిలీపట్నం నుంచి ఉదయం 2.55కు వెళ్లే మచిలీపట్నం– విజయవాడ ప్యాసింజర్ ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 1 వరకు ఉదయం 3.25కి బయలుదేరనుందని వివరించారు.