వార్దా ఎఫెక్ట్ : ప్రత్యేక అధికారుల నియామకం
విజయవాడ : వార్దా తుపాను హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. నాలుగు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఆదివారం సాయంత్రం ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.
వార్దా తుపాను పెను తుపానుగా మారింది. దీని ప్రభావంతో తీరప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా సృష్టిస్తోంది. అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దక్షిణ కోస్తాలో గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు, తీరం దాటే సమయంలో 80-100కి.మీ వేగంతో పెనుగాలులు వీయనున్నాయి. ప్రత్యేక అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా పేరు అధికారి పేరు
ప్రకాశం ముఖేష్ కుమార్ మీనా
నెల్లూరు బి.శ్రీధర్
చిత్తూరు రవిచంద్ర
వైఎస్సార్ జిల్లా రామ్ గోపాల్