సూళ్లూరుపేట: సూళ్లూరుపేట మండలంలోని ఇసుకమిట్ట వద్ద రైల్వే ట్రాక్‌పై తల్లీకుమారుడు ఆత్మహత్యాయత్నం చేయబోయారు. ఇసుకమిట్టకు చెందిన ఓ మహిళ తన భర్త తనను సరిగ్గా చూసుకోవడం లేదని, బిడ్డకు కూడా సరిగ్గా భోజనం పెట్టలేకపోతున్నానని మనస్తాపం చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. రైలు డ్రైవర్ గమనించి ఆపేయడంతో ప్రమాదం తప్పింది. దీంతో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ను 10 నిమిషాల పాటు ఆపేశారు. సదరు మహిళకు సర్ధి చెప్పి అక్కడి నుంచి పంపివేశారు.