
Salman Khan Dance With Nephew And Niece Video Viral: బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ హిట్ చిత్రాల్లో 'దబాంగ్' సిరీస్ ఒకటి. చుల్బుల్ పాండేగా ఈ సినిమాలతో ఎంతగానో అలరించాడు సల్లూ భాయి. ప్రస్తుతం సల్మాన్ 'ద-బాంగ్' ఈవెంట్ కోసం దుబాయ్‌లో ఉన్నాడు. బుట్టబొమ్మ పూజా హెగ్డే, సాయి మంజ్రేకర్‌తోపాటు ఇతర నటీనటులతో కలిసి దుబాయ్‌లో నిర్వహించిన ఈవెంట్ కోసం ముందు రోజు రిహార్సల్స్ చేశాడు. ఈ క్రమంలోనే సల్మాన్ మేనల్లుడు అహిల్, మేనకోడలు అయత్‌తో కలిసి 'అల్లా దుహై', 'హుద్ హుద్ దబాంగ్' పాటలకు స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అయితే ఈ వీడియోలో సల్మాన్‌తో కలిసి డ్యాన్స్ చేసేందుకు తన మేనల్లుడు, మేనకోడలు నెర్వస్‌గా ఫీలవడం చూడొచ్చు. ఈ వీడియో చూసిన సల్లూ భాయి అభిమానులు, ఫాలోవర్లు పిల్లలతో సల్మాన్‌కు ఉండే అటాచ్‌మెంట్‌ను పొగుడుతున్నారు. ఇవే కాకుండా సల్మాన్ ఫ్యాన్ పేజీలలో సాయి మంజ్రేకర్, పూజా హెగ్డేతో కలిసి రిహార్సల్స్ చేసిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్లో ఆయుష్ శర్మ, దిశా పటానీ, సోనాక్షి సిన్హా, మనీష్ పాల్, గురు రుంధవా కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. భాయిజాన్ రెండో భాగం సినిమాలో సల్మాన్‌తో తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకోనుంది పూజా హెగ్డే.