సాక్షి, గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా సంక్రాంతి శోభ సంతరించుకుంది. శుక్రవారం తెల్లువారుజాము నుంచే భోగి మంటలు వేయటంతో పండగ వాతావరణం సందడిగా మారింది. పలువురు రాజకీయ ప్రముఖులు భోగి మంటల వేడుకల్లో సందడి చేశారు. గుంటూరు జిల్లాలొని సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే అంబటి రాంబాబు పాల్గొన్నారు.
గాంధీ బొమ్మ సెంటర్‌లో సాంప్రదాయబద్దంగా భోగి మంటలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. మహిళలలో హుషారుగా డ్యాన్స్ చేసి అక్కడ ఉన్నవారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భోగి సంబరాల్లో పాల్గొనటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలకు తోడుగా జగనన్న సంక్షేమ పథకాలు ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment