Bhogi Fire Celebrations
-
భోగి సంబరాల్లో అంబటి రాంబాబు డ్యాన్స్
సాక్షి, గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా సంక్రాంతి శోభ సంతరించుకుంది. శుక్రవారం తెల్లువారుజాము నుంచే భోగి మంటలు వేయటంతో పండగ వాతావరణం సందడిగా మారింది. పలువురు రాజకీయ ప్రముఖులు భోగి మంటల వేడుకల్లో సందడి చేశారు. గుంటూరు జిల్లాలొని సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే అంబటి రాంబాబు పాల్గొన్నారు. గాంధీ బొమ్మ సెంటర్లో సాంప్రదాయబద్దంగా భోగి మంటలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. మహిళలలో హుషారుగా డ్యాన్స్ చేసి అక్కడ ఉన్నవారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భోగి సంబరాల్లో పాల్గొనటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలకు తోడుగా జగనన్న సంక్షేమ పథకాలు ఉన్నాయన్నారు. -
తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండగ తెచ్చే సంబరాలతో ప్రతిఇంటా ఆనందాలు వెల్లివిరియాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ‘మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. — YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2022 -
గుంటూరులో భోగి మంటల్లో అపశ్రుతి
గుంటూరు : భోగి మంటల్లో అపశ్రుతి చోటుచేసుకుని ఓ వ్యక్తి గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే...భోగి సందర్భంగా శుక్రవారం ఉదయం గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో భోగి మంటల్లో కిరోసిన్ పోస్తుండగా అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మంటలు ఓ వ్యక్తి శరీరానికి అంటుకున్నాయి. అతడిని కాపాడేందుకు ఎమ్మెల్యే మోదుగుల ప్రయత్నించారు. ఆయన పాదాలకు కూడా మంటలు అంటుకున్నాయి. గాయపడిన వ్యక్తిని స్టేడియం నిర్వాహకులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.