గుంటూరులో భోగి మంటల్లో అపశ్రుతి
గుంటూరు : భోగి మంటల్లో అపశ్రుతి చోటుచేసుకుని ఓ వ్యక్తి గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే...భోగి సందర్భంగా శుక్రవారం ఉదయం గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియంలో భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో భోగి మంటల్లో కిరోసిన్ పోస్తుండగా అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మంటలు ఓ వ్యక్తి శరీరానికి అంటుకున్నాయి. అతడిని కాపాడేందుకు ఎమ్మెల్యే మోదుగుల ప్రయత్నించారు. ఆయన పాదాలకు కూడా మంటలు అంటుకున్నాయి. గాయపడిన వ్యక్తిని స్టేడియం నిర్వాహకులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.