సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండగ తెచ్చే సంబరాలతో ప్రతిఇంటా ఆనందాలు వెల్లివిరియాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
‘మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 14, 2022
Comments
Please login to add a commentAdd a comment