bhogi festival
-
మొగలిపువ్వంటీ మొగుడ్నీయవే : నాలుగు రోజుల ముచ్చట
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంబరంగా జరపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు...కొత్త అల్లుళ్లు ఇలా సంకాంత్రి వచ్చిందంటే ఆ సందడే వేరు. దక్షిణ భారతదేశంలో పొంగల్‌ను నాలుగు రోజుల పాటు జరుపు కుంటారు, నాలుగు రోజుల ఈ వేడుకలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత. సంక్రాంతి సంబరాల్లో తొలి రోజును 'భోగి'గా పిలుస్తారు.ఈ భోగి పండుగకు ప్రత్యేకత ఉంది. రెండో రోజును 'మకర సంక్రాంతి'గా, మూడో రోజును 'కనుమ'గా పిలుస్తారు. నాలుగో రోజును 'ముక్కనుమ' అంటారు. సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే భోగి: భగ అనే పదం నుంచి భోగి వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలు తొలిగిపోవాలంటూ అగ్ని దేవుడికి భోగి మంట సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకోవడమే పరమార్థమే భోగి పండుగ విశిష్టత. తెల్లవారుఝామున నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేస్తారు తద్వారా చీడ పీడలు దోషాలు, తొలగిపోతాయని విశ్వాసం. భోగి అంటేనే భోగి మంటలు కదా. పాతకు బై ..బై... కొత్తకు ఆహ్వానం ఆవు పేడతో చేసిన పిడకలతో తెల్లవారుఝామునే భోగి మంటలు వేయడం అలవాటు. అంతేకాదు ఇంట్లోని పాత వస్తువులను కూడా భోగి మంటల్లో వేస్తుంటారు. ఈ ఆవు పిడకలను రకరకా పేర్లతో పిలుచుకుంటారు. ఇంకా మామిడి, రావి, మేడి చెట్ల అవశేషాలు, తాటాకులు లాంటివి భోగి మంటల్లో వేస్తారు. పాతను వదిలిపెట్టి, సరికొత్తమార్గంలోకి పయనించాలనేదే దీనర్ధం పరమార్థం. ముఖ్యంగా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ప్రారంభం కానుండటంతో.. కాలంతో వచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేదే భోగి పండుగ. అలాగే భోగి అనగానే గుర్తుకు వచ్చేది భోగి పళ్ళు. సాయంత్రం ఇంట్లోని చిన్న పిల్లలకు ముచ్చటగా భోగి పళ్లు పోసి, పేరంటాళ్లను పిలుచుకొని వేడుక చేసుకుంటారు. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణంవైపు, మకర రాశిలోకి అడుగుపెట్టిన సందర్భమే సంక్రాంతి సూర్యుడి పండుగ. ఏడాదిలో వచ్చే తొలి పండుగు. ఈ సంక్రాంతిలో "సం" అంటే మిక్కిలి "క్రాంతి" అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని "సంక్రాంతి" గా పెద్దలు చెబుతారు. సంక్రాంతికి పుణ్య దినం సందర్భంగా అడిగిన వారికి కాదనకుండా యధాశక్తి దానధర్మాలు చేయాలని భావిస్తారు. పుష్యమాసంలో వచ్చే ఈ పండుగకు ఇంటికి ధనధాన్య రాశులు రైతుల ఇళ్లకు చేరతాయి. పౌష్యలక్ష్మితో కళకళలతో ఇల్లిల్లూ ఒకకొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది. అందుకే సంక్రాంతి రోజు మట్టి కుండలో కొత్త బియ్యం, బెల్లం,చెరకు కలిపి పొంగల్ చేస్తారు. ఈ పాలు ఎంత పొంగిపొర్లితే.. అంత సమృద్ధి , శ్రేయస్సును అని నమ్ముతారు. అంతేనా సంక్రాంతి ఈ పండుగ కొత్తబట్టలు కావాల్సిందే. ఇంకా పెద్దలకు నైవేద్యాలు, పితృతర్పణ లాంటివి ప్రధానంగా చెప్పుకోవాలి. శని దోషాలు తొలగిపోవాలని, నల్లనువ్వులతో సూర్యుడికి పూజలు, పితృదేవతలందరికీ తర్పణలిస్తుంటారు. ఇక పిండి వంటలతో ముఖ్యంగా అరిసెలు, నువ్వుండలు, సున్నుండలులాంటి స్వీట్లతోపాటు, జంతికలు చక్రాలతో అందరి ఇళ్ళు ఘుమ ఘుమ లాడుతూ ఉంటాయి. సంక్రాంతి అంటే ముగ్గూ ముచ్చట సంక్రాంతికి ముందే నెల పెట్టడం అని ముగ్గులు . ప్రతీ ఇల్లూ రంగు రంగుల రంగువల్లలతో కొత్త పెళ్లి కూతురులా ముస్తాబవుతుంది. పల్లెల్లో అయితే ఎవరుఎంత పెద్ద ముగ్గు పెడితే అంత గొప్ప అన్నట్టు. దీనిపై బాపూ లాంటి గీతకారులు కార్లూన్లు వేశారంటేనే అర్థం చేసుకోవచ్చు సంక్రాంతిలో ముగ్గుల హడావిడి. గోదావరి జిల్లాల్లో గొబ్బెమ్మలతో కన్నెపిల్లలు, చిన్న పిల్లల ముచ్చట చూసి తీరాల్సిందే. ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం. ముగ్గు మధ్యలో పెద్ద గొబ్బెమ్మకి గుమ్మడి, మందార, బంతి, చామంతి పూలు పెట్టి పసుపూ కుంకాలతో అలంకరించి, తోటి స్నేహితులను పిలుచుకుని పాడుతూ వాటి చుట్టూ పాటలు పాడతారు. సుబ్బీ గొబ్బెమ్మా! మల్లెపువ్వంటీ మరదల్నివ్వవే, చామంతిపూవంటి చెల్లెల్నివ్వవే, మొగలీ పూవంటి మొగుణ్ణివ్వవే” అంటూ అమ్మాయిలు గొబ్బెమ్మలాడతారు. ఈ నెల రోజులూ గొబ్బెమ్మల సందడి ఉంటుంది. హరిలో రంగ హరీ అంటూ హరిదాసులు, గంగిరెద్దులు, కోడి పందాలు, జానపదుల జావళి సంక్రాంతి పండుగ. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా అందంగా తలలూపుతూ చేసే నృత్యాలు..అబ్బో.. ఈ దృశ్యాలన్నీ చాలా రమణీయంగా ఉంటాయి. మూడో రోజు కనుమ: దీన్నే పశువుల పండుగ అని అంటారు. పశుపక్ష్యాదులకి గౌరవాన్ని సూచించే పండుగ వ్యవసాయ ఆధారమైన పల్లెల్లో పశువులే గొప్ప సంపద. రైతుకు ఎంతో ఆదరువు. చేతికొచ్చిన పంటను తామేకాక, పశువులూ, పక్షులూ పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. మెడలో గల్లుగల్లుమనే మువ్వల పట్టీలు పశువులకు చక్కగా అలకరించుకుంటారు. అందరూ కలిసి భోజనాలు చేస్తారు. గాలిపటాలు ఎగురవేస్తూ సరదాగా గడుపుతారు ముక్కనుమ:నాలుగో రోజైన ముక్కనుమ సంక్రాంతికి ముగింపు అనిచెప్పవవచ్చు. శాకాహారులు వివిధకూరగాయలో ముక్కల పులుసు చేసుకుంటూ, మాంసాహారులు నాన్‌వెజ్ వంటకాలతో విందు చేసుకుంటారు. ముక్కనమను తమిళులు ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజును కరినాళ్ అని పిలుస్తారు. పేరేదైనా.. సంబరం ఒకటే! ఆచారాలు, సాంప్రదాయాలు కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా చాలా ఉత్సాహంతో జరుపుకునే పండుగు సంక్రాంతి. పశ్చిమ బెంగాల్లో పౌషా సంక్రాంతి, తమిళనాడులో పొంగల్, అస్సాంలో బిహు, గుజరాత్‌లోని ఉత్తరాయణ్, పంజాబ్‌లోని లోహ్రీ, అస్సాంలోని మాగ్ బిహు ఉత్సవాలు జరుపుకుంటారు. -
భోగి రోజే గోదా కళ్యాణం.. చిన్నారులకు భోగిపళ్లు ఎందుకు పోస్తారు?
తెలుగునాట సంబరంగా జరుపుకునే పెద్ద పండుగా సంక్రాంతి. ఈ నాలుగు రోజుల పండుగలో మొదటి రోజు భోగభాగ్యల "భోగి"తో మొదలవుతుంది. ఈ భోగి పండుగ రోజు పెద్ద చిన్నా అంతా నలుగుపెట్టుకుని తలంటు స్నానం చేసి భోగి మంటలతో పండుగ మొదలు పెడతారు. ఆ రోజే దేవాలయాల్లో అంగరంగ వైభవంగా గోదా కళ్యాణం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రమే పసిపిల్లలకు తలపై భోగిపళ్లు పేరుతో రేగిపళ్లు పోయడం వంటి తతంగాలు జరుగుతాయి. ఆ రోజే ఇవన్నీ చేయడానికి గల కారణాలేంటో తెలుసుకుందామా!. పూర్వం ఈ దినమే శ్రీ రంగనధాస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీని సంకేతంగా "భోగి" పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాథ. ఒక రకంగా భగవంతుడి మనుసును గెలుచుకున్న ఓ భక్తురాలి గాథ ఇది. ప్రేమకు భగవంతుడైనా.. బంధీ అయిపోతాడని చెప్పే చక్కని పురాణ కథ ఇది. ఇక భోగి రోజు గోదా కళ్యాణం చేయడానికి కారణం ఏంటంటే.. గోదా కళ్యాణ ప్రాశస్యం.. శ్రీ మహావిష్ణువుకు భక్తులై ఆయనే లోకంగా జీవించి తరించిన మహాభక్తులను ఆళ్వారులు అంటారు. వీళ్లలో ముఖ్యమైన వారు 12 మంది. వీరిలో పెరియాళ్వారు అనే ఆయన శ్రీరంగనాధుడికి మహాభక్తుడు. ఈయన అసలు పేరు భట్టనాధుడు. ఈయనే తరువాతి కాలంలో విష్ణుచిత్తుడిగా ప్రసిద్ధి చెందాడు. విష్ణుచిత్తుడు రంగనాధుడికి ప్రతినిత్యం పూల మాలతో కైంకర్యం(అలంకరణ) చేసేవాడు. దీనికోసం ఒక తోటను పెంచి అందులో రకరకాలైన పూలతో అందంగా మాలలు కట్టి శ్రీరంగ నాథుడికి సమర్పించేవాడు. ఒకనాడు విష్ణుచిత్తునికి తులసి మెుక్క గుబురులో ఒక పసిపాప కనిపించింది. అతడు ఆ బిడ్డను భూదేవియే ప్రసాదింగా భావించి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు. అతను ఆ బిడ్డకు గోదా అని పేరుపెట్టాడు. ఈ గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగిందే. యుక్తవయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది. తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తానే ధరించి, తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని ఎంతగానో బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి, గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ, ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు. ఇక ఆమె యుక్తవయస్సుకు రాగానే శ్రీరంగనాధుడినే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది. దీంతో ఆమె తన తండ్రి వద్దకు వెళ్లి మానవ కాంతలెవరైనా దేవుడిని వివాహమాడిన సందర్భాలు ఉన్నాయా? అని అడుగగా ఆయన ఉన్నాయని చెప్పాడు. దానికోసం కాత్యాయని వ్రతమాచరించ వలసి ఉంటుందని చెప్పగా.. ఆమె ఆ వ్రత నియమాలను తెలుసుకొని ధనుర్మాసంలో ఆ వ్రతమును ఆచరించడమే గాక కృష్ణునిపై ప్రేమతో ఆయన్ను కీర్తిస్తూ 30 పాశురాలను కూడా పాడింది. అలా గోదా దేవి ప్రేమకు లొంగిపోయిన కృష్ణుడు విష్ణుచిత్తుడి కలలో కనిపించి గోదా దేవిని తీసుకుని శ్రీరంగనాథం రావాలని, అక్కడ ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పాడు. దీంతో విష్ణుచిత్తుని ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ విషయం ఆలయ అర్చకులకు, విల్లిపుత్తూరులోని ప్రజలకు తెలియజేశాడు. అందర్ని వెంటబెట్టుకుని శ్రీరంగనాథ ఆలయానికి చేరుకున్నాడు. అయితే పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదా దేవి అందరూ చూస్తుండగానే కృష్ణునిలో ఐక్యమైపోయింది. అయితే ఈ గోదా కళ్యాణం జరిగింది మకర సంక్రమణం జరిగే ముందు రోజైన భోగి నాడు. అందువల్లనే అప్పటి నుంచి ప్రతి ఏడాది భోగి రోజున గోదా కళ్యాణం ఒక పండుగలా చేస్తారు. భోగిపళ్లు ఎందుకు పోస్తారంటే..? భోగి రోజున భోగి పళ్ళు పేరుతో రేగి పళ్ళను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టుకు బదరీ వృక్షం అని సంస్కృతంలో పిలుస్తారు. శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని పురాణ వచనం. అలాగే ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగినవి ఈ రేగుపళ్లు. అందువల్ల వీటికి కొన్ని నాణేలను జత కలిపి పిల్లల తలపై పోస్తారు. వాటిని తలపై పోయడం వల్ల లక్ష్మీ నారాయణుల అనుగ్రహం మన పిల్లలకు ఉండటమేగాక, ఎలాంటి దిష్టి తగలకుండా దీర్ఘా ఆయుష్షుతో ఉంటారని ప్రతీతి. ఇలా పోయడంలో మరో అంతరార్థం ఏంటంటే..? మన బాహ్య నేత్రాలకి కనిపించని బ్రహ్మ రంధ్రం మన తల పైభాగంలో ఉంటుంది. ఈ భోగి పండ్లను పోయడంతో ఆ బ్రహ్మరంధ్రం ప్రేరేపించి జ్ఞానవంతులు అవుతారని ఒక నమ్మకం కూడా. అంతేగాదు ఈ రేగు పండ్లు సూర్య కిరణలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి, నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తల మీద పోయడం వలన వీటిలోని విద్యుచ్చక్తి, మన శరీరం, ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి. అందువలనే పిల్లలకి భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు పెద్దలు. (చదవండి: భోగి పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది? చలి మంటలు ఎందుకు వేస్తారు?) -
భోగి పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది? చలి మంటలు ఎందుకు వేస్తారు?
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడే వేరుగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రలో ఈ పండుగ హడవిడి మాములుగా ఉండదు. వీధులన్నీ రంగవల్లులతో కొత్త కోడళ్లు, అల్లుళ్లతో సందడిగా ఉంటుంది. ఓ పక్కన కోడి పందేల జోరు, మరోవైపు నోరూరించే రకరకాల పిండి వంటలు రుచులుతో వాతావరణం అంతా ఆహ్లాదభరితంగా మారిపోతుంది. ఎంతెంత దూరాన ఉన్న ఈ పండుగ వస్తే ఊళ్లకే వచ్చేస్తారు అందరూ. అలాంటి ప్రాముఖ్యత గల ఈ పండుగల్లో మొట్టమొదటి రోజు జరుపుకునే భోగి పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది? ఆ రోజు చలిమంటలు ఎందుకు వేస్తారు?. తదితర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం!. భోగి అనే పేరు ఎలా వచ్చిందంటే.. 'భగ' అనే పదం నుంచి 'భోగి' అనే మాట వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి అఖరి రోజుగా భోగి పండుగను భావిస్తారు. ఎందుకంటే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి.. రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలని ప్రజలు కోరుకుంటారు. పురాణ ప్రకారం చూస్తే..పూర్వం ఈ దినమే శ్రీ రంగనధాస్వామి లో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని అందుకు సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాథ!. భోగిమంటలు ఎందుకంటే.. అందరూ అనుకుంటున్నట్లు చలికాలం కనుక వెచ్చదనం కోసం ఈ చలిమంటలు వేసుకోవడం లేదు. ఆరోగ్యం కోసం అనే చెప్పాలి. ఎందుకంటే..? ధనుర్మాసం నేలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు అధికంగా గాల్లో విడుదలవుతుంది. అది పీల్చడం ఆరోగ్యానికి మంచిది. అదీగాక ఈ చలికాలంలోనే అనేక వ్యాధులు ప్రబలంగా వస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి. వాటికి ఇది ఔషధంగా పనిచేస్తుంది. అలాగే ఈ భోగిమంటలు పెద్దగా వచ్చేలా రావి, మామిడి, మేడి వంటి ఔషధ చెట్ల బెరడులను వేస్తారు. అవి బాగా కాలేలా ఆవు నెయ్యిని ఉపయోగిస్తారు. అలా అగ్నిహోత్రంలో వేసిన ప్రతి 10 గ్రాములు దేశీ ఆవునెయ్యి నుంచి ఒక టన్ను ప్రాణ వాయువు విడుదల అవుతుంది. ఈ ఔషధ మూలికలు, ఆవునెయ్యి, ఆవు పిడకలు కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలికి అత్యంత శక్తి ఉంటుంది. ఈ గాలి మన శరీరంలో ఉన్న 72 వేల నాడుల్లోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఒకరికి రోగం వస్తే తగిన ఔషధం ఇవ్వోచ్చు. అదే అందరికీ ఇవ్వడం కాస్త కష్టం, పైగా అసాధ్యం కూడా. వైద్యం చేయించుకోలేని పేదవాళ్లు కూడా ఉండొచ్చు. ఇదంతా ఆలోచించే మన పెద్దలు అందరూ కలిసి భోగిమంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరూ పాల్గొనేలా సంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుంచే వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదీగాక కులాలకు అతీతంగా ఈ పండుగ పేరుతో అందరూ ఒక చోట చేరడం ప్రజల మధ్య ఉన్న దూరాలను చెరిపేసి ఐక్యమత్యానికి శ్రీకారం చుడుతుంది. అంత మహిమాన్వితమైన ఈ భోగి పండుగ రోజును మీ లోగిళ్లో భోగిమంటలు వేసుకుని పెద్దచిన్న అంతా పాల్గొని ఆయురారోగ్యాల పొందడమే గాక భోగభాగ్యాలు కలిగేలా ఆనందంగా ఈ పండుగ జరుపుకోండి. (చదవండి: శని దోషాలు పోయి, సకల శుభాలు కలగాలంటే ఇలా చేయండి!) -
భోగి పండుగను ఇలా మాత్రం చెయ్యొద్దు!
అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న ఊళ్లు, పల్లెలు జనసందోహంతో కళకళలాడిపోతుంటాయి. ఎంతెంత దూరమైనా వ్యయప్రయాసలు కోర్చి మరీ పట్టణాలు, విదేశాల నుంచి సోంతూళ్లకి పయనమైపోతుంటారు. అంతటి సరదాలు, ఆనందాలు తెచ్చే పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఈ నాలుగు రోజుల పండుగకి ఉన్న క్రేజ్ మరే పండుగకి ఉండదేమో అన్నంతలా చిన్న పెద్ద భేదం లేకుండా జరుపుకునే పండుగ. అలాంటి ఈ పండుగను మన పూర్వీకులు ఏ ఉద్దేశ్యంతో ఇలానే జరుపుకోండని మనకు ఒక సంప్రదాయన్ని అందిస్తే దానికి తిలోదాకాలు ఇచ్చేసి తప్పుగా అర్థం చేసుకుంటూ పిచ్చిపిచ్చిగా జరుపుకుంటున్నాం. అజ్ఞానంతో పర్యావరణానికి హాని కలిగించడమే గాకుండా లేనిపోనీ అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాం. ఈ విషయమై పర్యావరణ అధికారులు, వైద్యులు, ఆయా పాలనాధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా దయచేసి ఇలా చెయ్యొద్దు అని వేడుకుంటున్నారు. ఇంతకీ ఈ పండుగను ఎలా జరుపుకోవాలి? ఎలాంటివి చెయ్యకూడదు?. వాళ్లంతా భయాందోళనలు వ్యక్తం చేయడానికి రీజన్? నిజానికి ఈ సంక్రాంతి పండుగలో భోగితో మొదలయ్యే తొలి పండుగ అంటే అందరికీ సరదానే. ఎందుకంటే? బోగి మంటలతో ప్రారంభమయ్యే ఈ పండుగ సఓ సంబరంలా అంతా ఒక చోట చేరి ఐక్యమత్యంగా జరుపుకుంటారు. అయితే ఈ భోగి మంటలకు కావాల్సిన కలప, పిడకలు, వంటివి నగరాల్లో అందుబాటులో ఉండవు. అదీగాక అభివృద్ధి పేరుతో ఓ టౌన్ మాదిరివి కూడా నగరాల్లో మారిపోయాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటవన్నీ అందుబాటులో ఉండవు. పైగా అందరికి వ్యయప్రయాసలు కోర్చి మరి సొంతూళ్లుకు వెళ్లడం కూడా కుదరదు. దీంతో వారంతా ఈ భోగమంటను ఇంట్లోని పాత వస్తువులను తగలబెట్టి భోగి మంట వేసుకోవడం లేదా టైర్లు, వేస్ట్ ప్లాస్టిక్‌ని తగలబెట్టడం వంట పనులు చేస్తారు. ఇలాంటి చలిమంట వల్ల పర్యావరణ కాలుష్యమే గాక, ఈ పొగ పీల్చడం వల్ల అనారోగ్య సమస్యల బారినపడతారు. ముఖ్యంగా ప్లాస్టిక్, టైర్లు వంటివి కాల్చడం వల్ల చాలా విషపూరితమైన వాయువులు గాల్లోకి విడుదల అవుతాయి. వీటిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, కేన్సర్ వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయి. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యనిపుణులు, పర్యావరణ అధికారులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పండుగ అనేది మనకు కొత్త ఉత్తేజన్ని తీసుకొచ్చి ఆనందంగా గడిపేలా ఉండాలే కానీ మన వినాశనానికి కారణమయ్యేలా ఉండకూదనేది వారి ఆవేదన. కానీ చాలామంది ఇలానే చేసి చేజేతులారా తమ ఆరోగ్యాన్ని పక్కవారి ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారు. అస్సలు మన పూర్వీకులు ఎందుకని పండగను ఇలా భోగిమంటలతో చేసుకోవాలని చెప్పారు? దానిలో దాగున్న అంతరార్థం ఏంటో తెలుసుకోకుండా అజ్ఞానంతో తప్పుగా జరుపుకుని లేనిపోనీ సమస్యలు కొనితెచ్చుకుంటున్నాం. ఇంతకీ ఎలా చేసుకోవాలంటే.. పర్యావరణ హితంగా మంచి ఔషధ చెట్ల కలప లేదా ఆవుపిడకలతో వేసిన భోగిమంటే అన్ని విధాల మంచిది. దీని నుంచి విడుదలయ్యే వాయువులు పీల్చేతే శ్వాస సంబంధ సమస్యలు తలెత్తవు. మన పూర్వీకులు ఈ భోగి మంటల వేయడానికి కారణం కూడా ఈ రోజుల్లో చలి ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇలా రావి, వేప వంటి ఔషధ గుణాలు గల చెట్ల దుంగల్ని తెచ్చి మంట వేస్తారు. అందులోనే దేశీ ఆవు నెయ్యి, పిడకలు వంటివి కూడా వేస్తారు. ఇలా భోగిమంటను వేసి దాని నుంచి విడుదలయ్యే గాలిని పీల్చితే ఎలాంటి అనారోగ్య సమస్యల రావు. పైగా శ్వాసకోశ సమస్యలు కూడా ఉండవు. ఈ శీతాకాలంలో వచ్చే జలుబు, ఆయాసం వంటి సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలని మన పెద్దలు ఈ ఆచారాన్ని తీసుకొచ్చారు. అయితే దీన్ని తప్పుగా అర్థం చేసుకుని ఇంట్లోని పాత వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, పాత టైర్లతో చలిమంటలు వేసుకుని అనారోగ్యం పాలవ్వుతున్నారు. తెలియకుండానే అటు దేవుడి అనుగ్రహానికి నోచుకోక పోగా, ఇటు ఆరోగ్యాన్ని చేజేతులారా నాశనం చేసుకున్నవారవమవుతున్నాం అని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల దయచేసి ఇలా మాత్రం చేసుకోవద్దు. అవన్నీ అందుబాటులో లేకపోతే కనీసం కొబ్బరి చిప్పలు, వేపాకులు వంటివి తెచ్చుకుని భోగిమంట వేసుకోండి. ఇది కూడా ఆరోగ్యానికి అన్ని విధాల మంచిదే అని హితవు చెబుతున్నారు పర్యావరణ నిపుణులు. అందువల్ల అందరం ఈ పండుగను ఆరోగ్యకరమైన రీతీలో పర్యావరణ హితంగా జరుపుకుని ఆరోగ్యమనే భాగ్యాన్ని, సంతోషమనే సంపదను పొందుదాం. -
హాంగ్‌కాంగ్‌లో భలేగా బుజ్జాయిలతో భోగి!
తెలుగు సంస్కృతిలోని అందచందాలు చాలా ఎక్కువగా కనబడేది పండుగ సమయాలలోనే ఉదాహరణకు, సంక్రాంతినే తీసుకోండి. సంక్రాంతిలో అచ్చమైన తెలుగుదనం వెలుగుతూ ఉంటుంది. భోగి, మకర సంక్రమణం, కనుమ - ఈ మూడు రోజులూ పండుగే కనుక, దీన్ని పెద్ద పండుగ అంటారు. మన పండుగలకు చాలా సామాజిక, సాంప్రదాయ, సాంస్కృతిక మరియు స్వాభావికమైన ఆరోగ్య విలువలు ఉంటాయి. ఈ పండుగలలో పెద్దల ఆశీర్వదిస్తారు. పిల్లలు మహా సందడిగా ఉంటారు. ప్రత్యేకంగా భోగి పండుగనాడు సంబరమంతా పిల్లలదే. కొత్త బట్టలు ధరించి భోగి మంటల్లో భోగి పిడకలు వేయడంతో భోగి సంబరాలు మొదలవుతాయి. భోగిపళ్లలో, చెర్రీస్, శనగలు, చేమంతి, బంతి, గులాబీ పువ్వుల రేకులు, అక్షింతలు, చిల్లర నాణేలు, చాక్లెట్లు కలిపి సాయంత్రం భోగిపండ్లు పిల్లలకు దిష్టి తీసి వాటిని తలపై పోస్తారు. పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చినవారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలూ, పసుపు-కుంకుమలూ పెట్టడం ఆనవాయితీ. అయితే ప్రవాస భారతీయులుగా పండుగకు కావాల్సినవన్ని వారున్న దేశంలో సమకూర్చుకోలేకపోయినా, లభ్యమైన వాటితోనే వారు ఎంతో ఆనందోత్సాహాలతో పండుగలన్నీ సాంప్రదాయబద్ధంగా చేసుకునే ప్రయత్నం చేస్తారు. హాంగ్ కాంగ్ లో నివసిస్తున్న తెలుగు వారు కూడా ప్రతి యేట రెట్టింపు వుత్సాహంతో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి పండుగ వివరాలు తెలుపుతూ, వారి పాపకి భోగి పండ్లు సంధర్భంగా, తమ ఎస్టేట్ లో వున్న మరి కొంత మంది పసి పిల్లల్ని కలుపుకొని ‘బుజ్జాయిలతో భోగి’ చేయడం మొదలుపెట్టగా, భగవంతుని ఆశశీస్సులతో రెండు దశాబ్దాలుగా ఈ సంక్రాంతి వేడుక నిర్విఘ్నంగా కొనసాగుతున్నందుకు తమకు ఎంతో ఆనందాన్ని తృప్తినిస్తోందని తెలిపారు. హాంగ్‌కాంగ్‌లో ‘డూడు బసవన్నలు’ మరియు ‘గంగిరెద్దుల ఆటలు’ కనిపించక పోయినా, ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ‘బుజ్జాయిలతో భోగి’ సందడి క్రిస్మస్ సెలవల నుంచే మొదలవుతుంది. సెలవలకి భారతదేశం వెళ్ళినప్పుడు, రానున్న సంక్రాంతి పండుగకు కావాల్సిన వస్తువులు, క్రొత్త బట్టలు, నగలు, బొమ్మలు మొదలగునవి తెచ్చుకోవడం ఒక ఆనవాయితీగా మారింది. అమ్మల పట్టు చీరలు, తళ తళ మెరిసే మేలిమి నగలు, నాన్నల పంచే సర్దుకొంటూ పిల్లల వెంట పరుగులు, చిన్నారుల క్రొత్త బోసి నవ్వులు - కేరింతలు, పిల్లల కాలి మువ్వల సవ్వడులుతో పండుగ వాతావరణానికి ఆహ్వానాలుగా ధ్వనిస్తాయి. అమ్మమ్మలు - బామ్మలు - తాతయ్యల మురిపాల నవ్వులు, సంతోషాలు ఆ భోగిపళ్ళ సందడికే ప్రకాశాన్నిస్తున్నాయి.. అందరూ భోగిపళ్ళతో సమావేశంకాగా అమ్మమ్మ - బామ్మల హస్తాల మీదుగా దీప ప్రజ్వలనంతో కార్యక్రమం ప్రారంభం కాగా, హాంగ్ కాంగ్ ప్రముఖ గాయని శ్రీమతి హర్షిణి ప్రార్థనగీతం ఆలపించగా, పెద్దలు వారు ముందుగా పిల్లలకి భోగి పళ్ళు పోసి ఆశీర్వదించగా, తల్లి తండ్రులందరు వరుసగా పిల్లలందరికి భోగి పళ్ళు పోసి ఆశీర్వదించారు. పిల్లలందరికి మరింత ఆసక్తి ఉత్సాహాన్ని ఇచ్చేది, పాల్గొంటున్న వారిచ్చే చిరు కానుకలు. వాటిని పుచ్చుకునేందుకు పిల్లల అరుపులు, కేకలు , పరుగులు ఎంత ముచ్చటగా వుంటాయో కదా. మరి కానుకలు అందుకున్న తరువాత వాటిని విప్పి చూసే హడావిడి మీ ఊహకే అంటున్నారు సంతోషంగా, ‘ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య’ సాంస్కృతిక బృందం నుంచి రమాదేవి, మాధురి, హర్షిణి, రాధిక. ఫిబ్రవరిలో తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మరొక్క మంచి మాట, హాంగ్‌కాంగ్‌లో కూడా మన దేశంలో సంక్రాంతికి గాలి పటాల పోటీల వలె ఇక్కడ జాతీయ - అంతర్జాతీయ గాలి పటాల పోటీలు నిర్వహిస్తుంటారు.. మీకు తెలుసా, గాలిపటాలు ఎగురవేయడం హాంగ్‌కాంగ్, చైనాలో ఒక ప్రసిద్ధ కాలక్షేపం. మొదటి గాలిపటం షాన్డాంగ్లో సన్నని చెక్క ముక్కలతో తయారు చేయబడిందని నమ్ముతారు. చైనీస్ గాలిపటాల నమూనాలు ఎక్కువగా జానపద కథలు మరియు బొమ్మలపై ఆధారపడి ఉంటాయి. మీరు తరచుగా డ్రాగన్లు, పువ్వులు, గోల్డ్ ఫిష్, సీతాకోకచిలుకల వంటి ఐకానిక్ చిహ్నాలు మరియు డిజైన్లను చూసివుంటారు. ఇలా అనేక దేశాలలో గాలిపటాలు ఎగురవేయడం ప్రసిద్ధి చెందింది - భారతదేశం, నేపాల్, ఆఫ్గనిస్థాన్, పాకిస్తాన్, చైనా, జపాన్, తైవాన్, గ్రీస్, సైప్రస్, దక్షిణ అమెరికా, పాలినేషియా, ఇండోనేషియా, హాంగ్‌కాంగ్. (క్లిక్ చేయండి: బెర్లిన్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు) -
ముగ్గులోనే ముగ్ధరూపాలు
వ్రతం చేసిన ఆండాళ్ భోగినాడు రంగనాథుడిలో ఐక్యం అయిందని ప్రతీతి. ధనుర్మాసంలో దాపున ఉన్న కోవెలలో ముగ్గులతోనే ఆధ్యాతిక ఆరాధన చేసింది హైదరాబాద్‌లో స్థిరపడ్డ కన్నడ చిత్రకారిణి లభ్య. ముగ్గులలోనే అందమైన దేవతా మూర్తులను తీర్చిదిద్దడం బాల్యంలో తన తాత వద్ద నేర్చుకున్నానని చెబుతోంది. లభ్య బొమ్మలు సంక్రాంతి కళకు వన్నె తెచ్చాయి. ‘ఇదంతా మా తాతయ్య చెలువయ్య చలువ’ అంది లభ్య తాను వేసిన ముగ్గు మూర్తులను చూపుతూ కొద్దిగా తెలుగు, మరింత కన్నడం భాషల్లో. హైదరాబాద్ బాచుపల్లిలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో నివసించే లభ్యది బెంగళూరు. ధనుర్మాసం మొదలయ్యాక కమ్యూనిటీలో ఉన్న గుడిలో ఆమె నిత్యం వేసే ముగ్గు బొమ్మలు చుట్టుపక్కల వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒక్కో బొమ్మను తీర్చిదిద్దడానికి లభ్య ఏడెనిమిది గంటలు వెచ్చించాల్సి వచ్చింది. ‘మా తాత పేరు చెలువయ్య. ఆయన బెంగుళూరు జ్ఞానభారతి యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పని చేసేవారు. దీపావళి, సంక్రాంతి పండుగ సమయాల్లో ఇంటిముందు చక్కని ముగ్గులు రంగులతో వేసేవారు. చిత్రాన్ని జాగ్రత్తగా వేయడం, దాన్ని రంగులతో నింపడం ఆయన వద్దే నేర్చుకున్నా’ అంటుంది లభ్య. తాత ప్రభావం వల్లే చిన్నప్పటి నుంచి బొమ్మలు గీస్తూ పెరిగిన లభ్య ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగంలో చేరింది. ఉద్యోగం చేస్తూనే వివిధ రీతుల చిత్రకళని పరిశీలిస్తూ కుంచెకు పదును పెట్టుకుంటూ వచ్చింది. బెంగుళూరులో చిత్రకళ ఉపాధ్యాయినిగా కూడా పని చేసింది. వివాహానంతరం కొన్నాళ్లకి పూర్తి దృష్టి చిత్ర లేఖనం మీద పెట్టే ఉద్దేశ్యంతో ఉద్యోగానికి స్వస్తి చెప్పి గ్వాలియర్‌లోని రాజా మాన్సింగ్ తోమర్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో చిత్రకళను అభ్యసించింది. కాని ఆమె ప్రత్యేకత అద్భుతమైన చిత్రాలను ముగ్గులుగా నేలమీద ఆవిష్కరించడంలో ఉంది. పండుగ సందర్భాల్లో దేవతామూర్తులను, పండగ సందర్భాన్ని రంగుల ముగ్గులుగా చిత్రిస్తుంది.‘ఈ ధనుర్మాసంలో తిరు΄్పావై పాశురాలకు దృశ్యరూపం ఇచ్చాను ముగ్గుల్లో’ అందామె. వీణలో కూడా డిప్లొమా చేసిన లభ్య వద్ద చిత్రకళ నేర్చుకున్న విద్యార్థులు చాలామందే ఉన్నారు. కేవలం గీతలు రంగులు మాత్రమే కాక ఒక చిత్రాన్ని ప్రేమతో, భావోద్వేగంతో ఎలా అర్థం చేసుకోవాలో, భావనల్ని ఆలోచనలని సంప్రదాయకళగా, మోడర్న్ ఆర్ట్‌గా, ఫ్యూజన్ ఆర్ట్‌గా ఎలా మలచవచ్చో లభ్య తన విద్యార్థులకు నేర్పిస్తుంది. 2022 ముంబైలో జరిగిన ఇండియా ఆర్ట్ ఫెస్టివల్లో, బెంగుళూరులో జరిగే ‘చిత్ర సంతె’లో లభ్య చిత్రాలు అమ్ముడు΄ోయాయి. రాజా రవివర్మ చిత్రాలను ఎంతో ప్రతిభావంతంగా లభ్య పునః చిత్రీకరించింది. ఏ కళలో అయినా స్త్రీలు పురోగమించడానికి కుటుంబ బాధ్యతలు కొంత ఆటంకం కల్గిస్తాయని, పురుషులకు ఉన్న సౌకర్యం స్త్రీలకు ఎల్లవేళలా ఉండదంటోంది లభ్య. -
తెలుగులోగిళ్లలో భోగి సంబరాలు.. సందడే సందడి
-
పందెం కోళ్ళు...సంక్రాంతి ప్రత్యేకం
-
భోగిమంటల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి
-
ఖమ్మం జిల్లాలో ఘనంగా భోగి వేడుకలు
-
తెలుగువారి సిరుల పండగ సంక్రాంతి
-
భోగి భాగ్యాలు
-
మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంట్లో భోగి వేడుకలు
-
కాకినాడలో ఘనంగా భోగి వేడుకలు
-
భోగి వేడుకల్లో స్టెప్పులతో హుషారెత్తించిన మంత్రి అంబటి
-
మంత్రి రోజా ఇంట్లో సంక్రాంతి సంబరాలు
-
ఏలూరు వ్యాప్తంగా అంబరాన్నంటుతున్న సంక్రాంతి సంబరాలు
-
సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్ దంపతులు
12:01PM సీఎం జగన్.. నవరత్నాలతో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించిన నేపథ్యంలో గ్రామ సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు తదితర సేవల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాక్షాత్కారం చేసిన తీరును సాంస్కృతిక కార్యక్రమం ద్వారా కళ్ల కట్టారు. 11: 45AM సింగర్ హారిక నారాయణ్, ప్రముఖ జానపద గాయని కనకవ్వ తదితర కళాకారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మంచి జోష్‌తో పాటలు పాడి వీరు.. ఈ వేడుకలకు మరింత అందం తెచ్చారు. 11:38AM ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమ్మా ఉయ్యాల కోన జంపాల.. పాట పాడిన చైల్డ్ సింగర్ ప్రకృతి రెడ్డి. అనంతరం సీఎం జగన్ ఆశీర్వాదం తీసుకున్న చిన్నారి.. సీఎం జగన్ దంపతులతో సెల్ఫీ కూడా దిగింది. 11:20AM ‘శ్రీనివాస కల్యాణం’ ప్రదర్శన.. తిలకించిన సీఎం జగన్ దంపతులు ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుడు ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ‘శ్రీనివాస కల్యాణం’ ప్రదర్శనను సీఎం జగన్ దంపతులు తిలకిస్తున్నారు. 10:49AM గోశాలలో గోపూజ చేసిన సీఎం జగన్ దంపతులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంట సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. సీఎం జగన్ దంపతులు ముందుగా జ్యోతిని వెలిగించి సంక్రాంతి సంబరాల్ని ప్రారంభించారు. అనంతరం గోశాలలో గోపూజ చేశారు సీఎం జగన్ దంపతులు. ఆపై భోగి మంటను వెలిగించిన సీఎం జగన్.. హరిదాసు కీర్తనలు ఆలకించి ఆశీర్వాదం తీసుకున్నారు. రైతులు, పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సీఎం జగన్‌కు ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వేడుకల నిర్వహిస్తున్నారు. రైతులు, పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం సీఎం జగన్‌కు ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వేడుకల నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా సీఎం జగన్ ఇంటి ఆవరణలో భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ సామగ్రి, ఎడ్ల బండ్లు, గడ్డి వాములు, పశుసంపద, కుల వృత్తుల చిత్రాలతో పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో ఈ సంబరాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి.. నవరత్నాలతో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించిన నేపథ్యంలో గ్రామ సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు తదితర సేవల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాక్షాత్కారం చేసిన తీరును కళ్లకు కట్టనున్నారు. ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుడు ఆనంద్ నేతృత్వంలో ‘శ్రీనివాస కల్యాణం’ ప్రదర్శిస్తారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమ్మా ఉయ్యాల కోన జంపాల.. పాట పాడిన గాయని ప్రకృతి రెడ్డి, అదే సినిమాలో ఎత్తర జెండా.. పాట పాడిన హారిక నారాయణ్, ప్రముఖ జానపద గాయని కనకవ్వ తదితర కళాకారులు ఈ వేడుకల్లో పాలుపంచుకోనున్నారు. -
మార్గాని భరత్ నివాసంలో భోగి వేడుకలు
-
విశాఖలో ఘనంగా భోగి వేడుకలు
-
హైదరాబాద్ లో భోగి మంటల వెలుగులు
-
గుంటూరు జిల్లాలో అంబరాన్నంటుతున్నసంక్రాంతి సంబరాలు
-
విజయవాడలో ఘనంగా భోగి వేడుకలు
-
దేశ వ్యాప్తంగా భోగి వేడుకలు
-
Bhogi 2023: భోగి వచ్చిందోచ్
మసక చీకటిలో భోగి మంటలు ఇంటి ముంగిటిలో వెలుతురును తెస్తాయి. పాత వస్తువులను దగ్ధం చేసి కొత్త ఉత్సాహంలోకి అడుగు పడేలా చేస్తాయి. జనులెల్లా భోగభాగ్యాలతో విలసిల్లాలని కోరే పండగ భోగి. తెల్లవారుజాము తలంట్లూ దోసెలూ మసాలా కూరలూ చంటిపిల్లల భోగిపండ్లూ మూడు రోజుల సంక్రాంతి సంబరాలకు బోణి–భోగి. మనిషిని భోగంతో బతకండి అంటుంది ఈ పండగ. సంతోషాన్ని, సంతృప్తిని కనుగొనడంలోనే భోగం ఉందని చెబుతుంది ఈ పండగ. చలి వంటి జడత్వాన్ని ఉష్ణమనే చైతన్యంతో పారద్రోలి మనిషిని కర్తవ్యోన్ముఖుణ్ణి చేసేది భోగి. పరిశ్రమే భోగమూ భాగ్యమూ అని చెప్పేదే భోగి. భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో భోగిమంటల భోగుల్లో తెల్లారకుండానే పల్లెపల్లెంతాను ఎర్రని కాంతుల భోగుల్లో... చీకటిని తనకు తానుగా తరిమికొట్టడానికి వెలుతురు మంటను ఇంటి ఇంటి ముంగిటకు, వీధి వీధిలోనా, ప్రతి కూడలిలో మనిషి రాజేసే ఇలాంటి పండగ మరొకటి లేదు. అంత ఉదయాన లేచి పాతవన్నీ పనికి మాలినవన్నీ దగ్ధం చేసి నవీనతలోకి అడుగుపెడదామని మనిషి అనుకునే పండగ కూడా ఇలాంటిది వేరొకటి లేదు. తెల్లారకుండానే పల్లె లేస్తుంది. మనిషీ లేస్తాడు. ఎర్రటి నాల్కులు సాచుతూ మొద్దు చలిని, మంచు మందాన్ని కోస్తూ మంటా పైకి లేస్తుంది. ‘రేపటి నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి వస్తాడు. కాంతి ప్రకాశవంతం అవుతుంది. జీవితాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి సిద్ధపడు’ అని ఇవాళ మనిషిని సిద్ధం చేయడానికి వస్తుంది భోగి. ఎల్లవేళలా శుభ్రంగా స్నానం చేసి, మంచి బట్టలు కట్టుకుని, నచ్చింది తినడానికి మించిన భోగం లేదు. అందుకే భోగినాడు తలంట్లు తెలుగునాట ఫేమస్. భోగిమంటలు కాగానే స్త్రీలు కాగుల్లో, గంగాళాలలో వేడినీళ్లు సిద్ధం చేస్తారు. ఇంటి పిల్లలు, మగవాళ్లు నలుగు పెట్టుకుని ఒంటిని తోముకోవాలనే ఆనవాయితీ. ఆ తర్వాత తలంట్లు. కొత్త బట్టలు. కొత్తబియ్యం పాయసం. ఒళ్లు, ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉండటం, శుభ్రమైన పరిసరాల్లో సుఖవంతంగా జీవించడం భోగం. అందుకే భోగి శుభ్రతను సూచిస్తుంది. శుభ్రత అంటే బయట శుభ్రత మాత్రమే కాదు... ఆత్మిక, ఆధ్యాత్మిక శుభ్రత కూడా. జ్ఞాన శుభ్రత కూడా. వివేచనా శుభ్రత. అజ్ఞానాన్ని మించిన అంధకారం లేదు. సరైన ‘చదువు’, దృక్పథం మనిషికి ఉండాలి. మూకలు చెప్పినట్టు చేయరాదు. అలాంటి అజ్ఞాన అంధకారాన్ని మంటల్లో వేసి మాడ్చి మసి చేయమని చెబుతుంది భోగి. నీలోని కల్మషాన్ని, కసిని, పగని, ద్వేషాన్ని, చెడుని తగులబెట్టు అని చెబుతుంది భోగి. మనలో మంచితనం నిండటమే భోగం. మంచివాడిగా బతకడం, అగ్నిలా స్వచ్ఛంగా ఉండటం భోగం. అగ్నికి చీడ అంటదు. అలాంటి జీవితం జీవించగలగాలని సూచన. భోగం అంటే కేవలం ఐశ్వర్యం అనే అర్థం చూడరాదు. అన్నివేళలా చెరగని చిర్నవ్వును ధరించి ఉండగలగడం కూడా భోగమే. భోగిపళ్లు రేగిపండ్లు సూర్యుడి నుంచి ఎక్కువ శక్తిని గ్రహించి దాచుకుంటాయట. ఎటువంటి జటిల వాతావరణం లోనైనా, ఉష్ణోగ్రతలో అయినా ఎదురు తిరిగి బతికి రేగుచెట్లు నిలబడతాయట. చంటి పిల్లలు కూడా అలాంటి శక్తితో అలాంటి ఆయుష్షుతో దిష్టి గిష్టి వదిలించుకుని ఈ కొత్తకాలంలోకి ప్రవేశించాలని భోగినాటి సాయంత్రం భోగిపళ్ల పేరంటం పెడతారు. రేగుపండ్లు, తలంబ్రాలు, రాగి నాణేలు, చిల్లర పైసలు, పూల రెక్కలు కలిపి పిల్లల నెత్తిన పోసి, దిగవిడిచి దిష్టి తీస్తారు. చిట్టి చిట్టి రేగుపళ్ళు చిట్టి తలపై భోగిపళ్ళు ఎంతో చక్కని భోగిపళ్ళు ఎర్ర ఎర్రని రేగుపళ్ళు.... అని పాటలు పాడతారు. ఆయుష్షుతో ఉండటం భోగం. అందుకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం భోగం. పరిస్థితులను ఎదుర్కొనే గుండె దిటవును కలిగి ఉండటం భోగం. బొమ్మల కొలువులు... గొబ్బి పాటలు భోగినాడు బొమ్మల కొలువు పెడతారు కొంతమంది. చిన్నపిల్లలు తమ బొమ్మలు, సేకరించిన బొమ్మలు తీర్చిదిద్ది సంబరపడతారు. ఇక భోగితో మొదలెట్టి పండగ మూడు రోజులూ సాయంత్రం సందె గొబ్బెమ్మలను పెడతారు. వాటి చుట్టూ ఆడవారందరూ చేరి గొబ్బిళ్ళ పాటలు పాడుతూ గొబ్బెమ్మల చుట్టూ ఆడతారు. ‘గొబ్బియళ్ళో సఖియా వినవె చిన్ని కృష్ణుని చరితము గనవె చిన్ని కృష్ణుని మహిమను గనవె ..... ‘ ‘సుబ్బీ సుబ్బమ్మ శుభము నీయవె తామర పువ్వంటి తమ్ముణ్ణీయవె చామంతి పువ్వంటి చెల్లెల్నీయవె’ లాంటి పాటలు పాడతారు. పెళ్ళి కాని అమ్మాయిలు ‘మొగలి పువ్వంటి మొగుణ్ణీయవె’ అని కలుపుతారు. పండగ అంటే అందరికి సంతోషాన్ని ఇచ్చేది. అందరి శుభాన్ని కోరడం భోగం. ఈ భోగి సకల శుభాలను తేవాలని కోరుకుందాం.