తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడే వేరుగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆంధ్రలో ఈ పండుగ హడవిడి మాములుగా ఉండదు. వీధులన్నీ రంగవల్లులతో కొత్త కోడళ్లు, అల్లుళ్లతో సందడిగా ఉంటుంది. ఓ పక్కన కోడి పందేల జోరు, మరోవైపు నోరూరించే రకరకాల పిండి వంటలు రుచులుతో వాతావరణం అంతా ఆహ్లాదభరితంగా మారిపోతుంది. ఎంతెంత దూరాన ఉన్న ఈ పండుగ వస్తే ఊళ్లకే వచ్చేస్తారు అందరూ. అలాంటి ప్రాముఖ్యత గల ఈ పండుగల్లో మొట్టమొదటి రోజు జరుపుకునే భోగి పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది? ఆ రోజు చలిమంటలు ఎందుకు వేస్తారు?. తదితర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం!.
భోగి అనే పేరు ఎలా వచ్చిందంటే..
'భగ' అనే పదం నుంచి 'భోగి' అనే మాట వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి అఖరి రోజుగా భోగి పండుగను భావిస్తారు. ఎందుకంటే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి.. రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలని ప్రజలు కోరుకుంటారు. పురాణ ప్రకారం చూస్తే..పూర్వం ఈ దినమే శ్రీ రంగనధాస్వామి లో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని అందుకు సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాథ!.
భోగిమంటలు ఎందుకంటే..
అందరూ అనుకుంటున్నట్లు చలికాలం కనుక వెచ్చదనం కోసం ఈ చలిమంటలు వేసుకోవడం లేదు. ఆరోగ్యం కోసం అనే చెప్పాలి. ఎందుకంటే..? ధనుర్మాసం నేలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశీ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు అధికంగా గాల్లో విడుదలవుతుంది. అది పీల్చడం ఆరోగ్యానికి మంచిది. అదీగాక ఈ చలికాలంలోనే అనేక వ్యాధులు ప్రబలంగా వస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి. వాటికి ఇది ఔషధంగా పనిచేస్తుంది.
అలాగే ఈ భోగిమంటలు పెద్దగా వచ్చేలా రావి, మామిడి, మేడి వంటి ఔషధ చెట్ల బెరడులను వేస్తారు. అవి బాగా కాలేలా ఆవు నెయ్యిని ఉపయోగిస్తారు. అలా అగ్నిహోత్రంలో వేసిన ప్రతి 10 గ్రాములు దేశీ ఆవునెయ్యి నుంచి ఒక టన్ను ప్రాణ వాయువు విడుదల అవుతుంది. ఈ ఔషధ మూలికలు, ఆవునెయ్యి, ఆవు పిడకలు కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలికి అత్యంత శక్తి ఉంటుంది. ఈ గాలి మన శరీరంలో ఉన్న 72 వేల నాడుల్లోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది.
ఒకరికి రోగం వస్తే తగిన ఔషధం ఇవ్వోచ్చు. అదే అందరికీ ఇవ్వడం కాస్త కష్టం, పైగా అసాధ్యం కూడా. వైద్యం చేయించుకోలేని పేదవాళ్లు కూడా ఉండొచ్చు. ఇదంతా ఆలోచించే మన పెద్దలు అందరూ కలిసి భోగిమంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరూ పాల్గొనేలా సంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుంచే వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదీగాక కులాలకు అతీతంగా ఈ పండుగ పేరుతో అందరూ ఒక చోట చేరడం ప్రజల మధ్య ఉన్న దూరాలను చెరిపేసి ఐక్యమత్యానికి శ్రీకారం చుడుతుంది. అంత మహిమాన్వితమైన ఈ భోగి పండుగ రోజును మీ లోగిళ్లో భోగిమంటలు వేసుకుని పెద్దచిన్న అంతా పాల్గొని ఆయురారోగ్యాల పొందడమే గాక భోగభాగ్యాలు కలిగేలా ఆనందంగా ఈ పండుగ జరుపుకోండి.
Comments
Please login to add a commentAdd a comment