జిల్లాలో వినాయక శోభాయాత్ర సోమవారం ఘనంగా జరిగింది.
నిజామాబాద్ క్రైం/నిజామాబాద్ కల్చరల్ : జిల్లాలో వినాయక శోభాయాత్ర సోమవారం ఘనంగా జరిగింది. భక్తులు ఆనందోత్సాహాలతో గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ‘గణపతి బప్పా మోరి యా’ నినాదాలు మారుమోగాయి. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాలలో నిమజ్జనాన్ని వైభవంగా నిర్వహించారు. నగరంలో గణేశ్ శో భాయాత్ర కన్నులపండువగా సాగింది. నిమజ్జ నం కొనసాగిన మార్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఎస్‌పీ డాక్టర్ తరుణ్ జోషీ, అదనపు ఎస్‌పీ పాండునాయక్ బందోబస్తు ఏర్పాట్లును పర్యవేక్షించారు. దుబ్బలోని ఖానాపూర్ చౌరస్తా నుంచి నిమజ్జన యాత్ర పగలు 2.15 నిమిషాలకు ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంట ల వరకు గాంధీచౌక్‌కు చేరుకుంది. చీకటి పడకముందే పోలీసులు యాత్రను గురు ద్వారా దాటించారు.
అక్కడి నుంచి వినాయక్‌నగర్ వరకు పోలీసులు వలయంగా ఏర్పడి రథాన్ని ముందుకు నడిపించా రు. రథం వెనుక అగ్ని మాపక శకటం, వైద్య బృందంతో కూడి న ప్రత్యేక వాహనం, అదనపు పోలీసు బలగాలను సిద్ధంగా ఉంచారు. దుబ్బ నుంచి వినాయక్‌నగర్ వరకు దాతలు భక్తులకు ప్రసాదం, నీళ్ల పాకెట్లు పంపిణీ చేశారు.
ఆనందోత్సాహాలతో
దుబ్బ వద్ద పగలు 2.15 నిమిషాలకు సార్వజనిక్ గణేశ్ మండలి అధ్యక్షుడు రంచోడ్‌లాల్ పచ్చజెండా ఊపి శోభా రథయాత్రను ప్రారంభించారు. అంతకు ముందు ఎంపీ కల్వకుంట్ల కవిత, మేయర్ ఆకుల సుజాత, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, సతీష్‌పవార్, కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎస్‌పీ తరుణ్‌జోషి తదితర అధికారులు కొబ్బరికాయలు కొట్టి పూజలు చే శారు. పూజల అనంతరం రథయాత్ర ముందు కు సాగింది.
పవన్‌నగర్, గుర్బాబాదిరోడ్డు, లలితామహాల్ గేట్, గాంధీగంజ్, వన్‌టౌన్, గాంధీచౌక్, నెహ్రూపార్క్ చౌరస్తా, బోధన్‌రోడ్డు, ఖిల్లా రోడ్డు, బర్కత్‌పుర, గాజుల్‌పేట్, గురుద్వారా, బడాబజార్, గోల్‌హన్మాన్ చౌర స్తా, ఫులాంగ్ చౌరస్తా మీదుగా రాత్రి 11 గంట ల సమయంలో వినాయక్‌నగర్‌లోని వినాయకుల బావికి చేరుకుంది. దారిపొడవునా ఆయా మండపాల నిర్వాహకులు రంగులు చల్లుకుం టూ, వినాయకుడి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సంబురాలతో శోభారథయాత్రలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్, గడుగు గంగాధర్, నగేశ్‌రెడ్డి, మోటూరి దయానంద్ గుప్తా, భక్తవత్సలం నాయుడు, మీసాల సుధాకర్‌రావు, మాజీ మున్సిపల్ మాజీ చైర్మ న్ ముక్కా దేవేందర్‌గుప్తా, టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
గణనాథుని ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఉండాలి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారిగా అత్యంత ఘనంగా పూజలందుకున్న గణనాథుడు అందరినీ ఆశీర్వదించాలని ఎం పీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. శోభాయాత్రకు పూజలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. విశేష పూజలందుకున్న వినాయకుని ఆశీస్సులతో జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నా రు. గణనాథుని అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉంటుందన్నారు.
నగరంలో ఎడ్ల జతలతో రథయాత్రను శోభాయమానంగా తీర్చిదిద్ది, ఊరేగింపుతో గణనాథులను నిమజ్జనం చేయ డం చక్కటి సంప్రదాయమని పేర్కొన్నారు. రథయాత్ర సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జిల్లా అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకుందన్నా రు. ప్రజలకు మంచినీటి సదుపాయం కల్పిం చామన్నారు. నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని ఆమె కోరారు.