నిజామాబాద్ క్రైం : జిల్లాలో సోమవారం జరుగనున్న గణేశ్ నిమజ్జనోత్సవాలకు పోలీస్‌శాఖ భారీ బందోబ స్తు ఏర్పాటు చేసింది. మొత్తం 1,483 మంది పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. పలు గ్రామాలలో శనివారం నిమజ్జనోత్సవాలు పూర్తికాగా నిజామాబాద్ నగరంతో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ పట్టణాలలో ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఎక్కడా అవాం ఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో నలుగురు డీఎస్పీలు, సీఐలు 14 మంది, ఎస్సైలు 44 మంది, ఏఎస్సైలు 45 మంది, హెడ్‌కానిస్టేబుళ్లు 92 మంది, కానిస్టేబుళ్లు 389 మంది, మహిళా హెడ్ కాని స్టేబుళ్లు, కానిస్టేబుళ్లు 45 మంది, హోంగార్డులు 645 మంది, ఆర్మూడ్ రిజర్వు ఫోర్స్, జిల్లా స్పెషల్ పార్టీ సిబ్బంది కలిసి 205 మంది నిమజ్జనోత్సవాల్లో బందోబస్తు నిర్వహిస్తారని ఎస్పీ తరుణ్‌జోషి ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన పట్టణాలలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా అనుమానాస్పద ప్రాం తాలలో సీసీ కెమోరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అల్లరి మూకల ఆటకట్టించేందుకు ఆయా ప్రాంతాలలో తగినంత మంది సిబ్బందిని నియమించామని, గణేశ్ నిమజ్జనోత్సవాలు శాంతి యుతంగా జరగడానికి ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.
భారీ బందోబస్తు
Published Sun, Sep 7 2014 1:15 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement